ETV Bharat / sitara

కోహ్లీ కోసం హెయిర్​ స్టైలిష్ట్​గా మారిన అనుష్క - విరాట్ కోహ్లీ

కరోనా ప్రభావంతో స్వీయ నిర్బంధంలో ఉన్న సెలిబ్రిటీ జోడీ విరాట్​ కోహ్లీ, అనుష్క శర్మ. ఈ నేపథ్యంలో వారికి నచ్చిన వ్యాపకాలతో గడుపుతున్నారు. ఈ క్రమంలో అనుష్క.. కోహ్లీకి హెయర్​కట్​ చేస్తున్న వీడియోను ఇన్​స్టాలో పోస్ట్​ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్​గా మారింది.

Anushka Sharma Turns Hairstylist For her Husband Virat Kohli During Quarantine
కోహ్లీ కోసం హెయిర్​ స్టైలిష్​గా మారిన అనుష్క
author img

By

Published : Mar 28, 2020, 12:22 PM IST

కరోనా నియంత్రణలో భాగంగా స్వీయ నిర్బంధంలో ఉన్నారు సెలిబ్రిటీ కపుల్​ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ. ఈ నేపథ్యంలో కోహ్లీ తన కోసం ఓ హెయిర్​ స్టైలిష్ట్​​ను నియమించుకున్నాడట. తను ఎవరో కాదు అతడి భార్య, బాలీవుడ్​ నటి అనుష్క శర్మ. ఆమె హెయిర్​కట్​ చేసిన వీడియోను ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్​ చేసింది.

"స్వీయ నిర్బంధం మీకు ఇలాంటి వాటిని ఇస్తుంది. వాటిని మీరు ఆహ్వానించాలి. వంటగదిలో ఉన్న కత్తెరలతో నా భార్య నాకు హెయిర్​కట్​ చేసింది. నన్ను చాలా అందంగా తయారు చేసింది."

- విరాట్​ కోహ్లీ, టీమిండియా కెప్టెన్​

21 రోజులు ఇంటిలోనే స్వీయనిర్బంధంలో ఉండాలని మంగళవారం ప్రధానమంత్రి మోదీ పిలుపునిచ్చారు. అయితే వాటిని పట్టించుకోకుండా చాలా మంది ప్రజలు బయట సంచరిస్తున్నారని కోహ్లీ మరో వీడియో ద్వారా తెలిపాడు. ప్రతి ఒక్కరు లాక్​డౌన్​ నియమాలను పాటించాలని అతడు ప్రజలకు విజ్ఞప్తి చేశాడు.

ఇదీ చూడండి.. డోపింగ్ కారణంగా భారత అథ్లెట్​పై నాలుగేళ్ల నిషేధం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.