ETV Bharat / sitara

సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో - సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో

సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మల మనవడు శరణ్ కథానాయకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమా ప్రారంభోత్సవం ఈరోజు జరిగింది. కృష్ణ ముఖ్య అతిథిగా హాజరై ముహూర్తపు సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు.

Another Hero coming from Krishna family
సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో
author img

By

Published : Oct 27, 2020, 5:35 PM IST

సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మల కుటుంబం నుంచి మరో నటుడు వెండితెరకు పరిచయమవుతున్నాడు. విజయనిర్మల మనవడు శరణ్ కుమార్ కథానాయకుడిగా నటిస్తున్న తొలి చిత్రం హైదరాబాద్​లోని నానక్ రాంగూడలో లాంఛనంగా ప్రారంభమైంది. సినీటేరియా మీడియా వర్క్స్ పతాకంపై నిర్మిస్తున్న శరణ్ సినిమా ప్రారంభోత్సవానికి సూపర్ స్టార్ కృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Another Hero coming from Krishna family
ప్రారంభోత్సవంలో కృష్ణ

కృష్ణ, విజయనిర్మల నివాసంలో జరిగిన ఈ వేడుకలో శరణ్, జెమినీ సురేష్​లపై చిత్రీకరించిన మూహుర్తపు సన్నివేశానికి కృష్ణ గౌరవ దర్శకత్వం వహించగా.. సుధీర్ బాబు, నవీన్ విజయకృష్ణ కెమెరా స్విచ్చాన్ చేశారు. కథానాయకుడు సాయితేజ, సీనియర్ నటి జయసుధ అతిథులుగా హాజరై చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. రామచంద్ర వట్టికూటి దర్శకత్వంలో రాబోతున్న శరణ్ కుమార్ సినిమాను నవంబర్ నెలాఖరులో చిత్రీకరణ ప్రారంభించి జనవరిలో సింగిల్ షెడ్యూల్​లో పూర్తి చేస్తామని నిర్మాతలు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.