సూపర్‌స్టార్ మహేశ్‌తో 'అతిథి' సినిమాలో నటించిన హీరోయిన్ అమృతరావు ఆదివారం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని వారి సన్నిహితులు ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. 'అమృతరావు, ఆర్‌జే అన్మోల్ దంపతులు మగ శిశువుకు స్వాగతం పలికారు. తల్లి, శిశువు ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. అభిమానుల అభినందనలు, ఆశీర్వాదాలకు దంపతులు కృతజ్ఞతలు తెలిపారు' అని ప్రకటనలో పేర్కొన్నారు.
అమృతరావు, అన్మోల్ ఏడేళ్లు ప్రేమించుకున్న తర్వాత 2016లో పెళ్లి చేసుకున్నారు. గత నెలలో నటి భర్తతో కలిసి ఓ ఆసుపత్రి వద్ద కనిపించిన ఫొటోలు వైరలయ్యాయి. ఈనేపథ్యంలోనే స్పందించిన అమృత తాను తల్లి కాబోతున్నట్లు స్పష్టం చేసింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
దర్శకుడు సురేందర్‌రెడ్డి తీసిన 'అతిథి'లో మహేశ్ సరనన అమృత నటించింది. ఈ చిత్రం తర్వాత హిందీలో పలు చిత్రాలు చేసింది. 2019లో నవాజుద్దీన్ సిద్ధిఖీ 'ఠాక్రే'లో చివరిసారి తెరపై కనిపించింది.
ఇవీ చదవండి: