ETV Bharat / sitara

భుజం ఎత్తడం వల్ల నాకు ఆ సమస్య వచ్చింది: అల్లు అర్జున్ - rashmika mandanna

Pushpa Movie: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సినిమా గురించిన విశేషాలను పంచుకున్నారు బన్నీ. ఈ ఒక్క సినిమా నాలుగు సినిమాల కష్టంతో సమానమని చెప్పారు.

pushpa movie
allu arjun pushpa
author img

By

Published : Dec 14, 2021, 11:18 PM IST

Pushpa Movie: 'పుష్ప' ఒక్కటి నాలుగు చిత్రాల కష్టంతో సమానమని చెప్పారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్​ 17న విడుదల కానుంది. రష్మిక హీరోయిన్. ఫాహద్ ఫాజిల్, సునీల్ కీలక పాత్రల్లో నటించారు. దేవీ శ్రీ ప్రసాద్ స్వరాలందించాడు. ఈ చిత్రం కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సినిమాకు సంబంధించిన విశేషాలను పంచుకున్నారు బన్నీ.

అల్లు అర్జున్ ఇంటర్వ్యూ

"'పుష్ప' షూటింగ్ కోసం.. చాలా రీమోట్​ ప్రాంతాలకు వెళ్లాం. ఇంతవరకు ఎవరూ చూపించని ప్రాంతాలను చూపించాం. దానికోసం కొత్తగా రోడ్లు కూడా వేయాల్సి వచ్చింది. ఈ ఒక్క సినిమా నాలుగు సినిమాల కష్టం. ఇది చాలా భారీ సినిమా. షూటింగ్​లో రోజుకు సగటున 500-600 మంది ఉండేవారు. ఒక కిలోమీటర్​ పొడవునా సుమారు 300 వాహనాలు ఉండేవి."

- అల్లు అర్జున్, నటుడు

ఆయన నటనకు షాక్ అవుతారు..

ఈ సినిమాలో అందరూ తెలుగు మాట్లాడగలిగే ఆర్టిస్టులే ఉండటం చాలా మంచి విషయమని చెప్పారు అల్లు అర్జున్. "రష్మిక, ఫాహద్​ ఫాజిల్​ అచ్చ తెలుగు మాట్లాడతారు. సునీల్​.. పాత్ర చూసి షాక్​ అవుతారు. అంత బాగా చేశారు" అని బన్నీ అన్నారు.

pushpa movie
'పుష్ప'లో అల్లు అర్జున్
pushpa movie
రష్మిక

ఆ సమస్య ఎదురైంది..

ఈ సినిమాలో మెడ కాస్త పైకి పెట్టి నటించడం వల్ల ఓ సమస్య ఎదుర్కొన్నట్లు చెప్పారు అల్లు అర్జున్. "సినిమా సాంతం భుజం పైకెత్తి చేశాను. షూటింగ్​ చివరికి వచ్చేసరికి నాకు మెడ పట్టేసింది. అలా పెట్టడం వల్ల మెడ భాగం చిన్నగా అయిపోయింది. దీంతో రోజూ లేవగానే ఓ 15 నిమిషాలు మెడను ఫుల్​ స్ట్రెచ్​ చేసేవాన్ని" అని బన్నీ వివరించారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.