ETV Bharat / sitara

బన్నీ మరో పాన్ ఇండియా సినిమా.. రెమ్యునరేషన్​ రూ.100 కోట్లు? - allu arjun next movie

Allu arjun movies: అల్లు అర్జున్ మరో క్రేజీ పాన్ ఇండియా సినిమాకు రంగం సిద్ధం చేస్తున్నారు. తమిళ స్టార్ అట్లీతో ఈసారి కలిసి పనిచేయనున్నట్లు తెలుస్తోంది.

allu arjun
అల్లు అర్జున్
author img

By

Published : Jan 24, 2022, 1:36 PM IST

Allu arjun Atlee movie: 'పుష్ప' సినిమాతో అల్లు అర్జున్ రేంజ్​ అమాంతం పెరిగిపోయింది. 'పుష్ప' సాంగ్స్, డైలాగ్స్​తో బాలీవుడ్​ సెలబ్రిటీలు, క్రికెటర్లు ఇన్​స్టా రీల్స్ చేస్తుండటమే ఇందుకు ఉదాహరణ. బన్నీ నటనకు కూడా ఫిదా అయ్యామంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ క్రమంలో తన తర్వాతి సినిమాలపై ప్రత్యేక శ్రద్ధా తీసుకుంటున్నారు బన్నీ.

allu arjun pushpa movie
పుష్ప సినిమాలో అల్లు అర్జున్

'పుష్ప 2' తర్వాత తను చేయబోయే సినిమాల లైనప్​ను క్రేజీగా రెడీ చేసుకుంటున్నారు అల్లు అర్జున్. ఇందులో భాగంగానే తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ, బన్నీ భేటీ అయ్యారు. అయితే వీరిద్దరూ కలిసింది సినిమా కోసమేనని తెలుస్తోంది. అన్ని కుదిరితే త్వరలో ప్రకటన కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతమందిస్తాడని, లైకా ప్రొడక్షన్స్ భారీ వ్యయంతో నిర్మిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. బన్నీకి రూ.100 కోట్ల రెమ్యునరేషన్​ కూడా ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

allu arjun atlee movie
అల్లుఅర్జున్-అట్లీ

అట్లీ ప్రస్తుతం బాలీవుడ్​ బాద్​షా షారుక్​తో సినిమా చేస్తున్నారు. ఇది పూర్తయిన తర్వాతే అల్లు అర్జున్​తో సినిమా కోసం రంగంలోకి దిగుతారని తెలుస్తోంది. ఇతడితో పాటే బన్నీ, మురుగదాస్​తో సినిమా చేయాల్సి ఉంది. ఎప్పుడో ఈ విషయం గురించి బయటకువచ్చినప్పటికీ, సెట్స్​పైకి వెళ్లడం ఆలస్యమవుతూ వస్తోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.