ETV Bharat / sitara

'అందుకే పవర్​స్టార్​ను 40సార్లు పెళ్లి చేసుకుంటా!'

అందంలో ఆమెది తల్లిపోలిక.. నటనలో తండ్రి నడవడిక.. రెండు దశాబ్దాల క్రితం తెలుగు తెరపై తళుక్కున మెరిసి.. తమిళ, మలయాళ భాషల్లో కూడా మంచి నటిగా పేరు సంపాదించింది. అంతేకాదు, నిర్మాతగా, రచయితగా తన ప్రతిభను చాటిన నటి వనిత విజయ్‌ కుమార్‌. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి విచ్చేసి.. సరదా సంగతులు చెప్పుకొచ్చారు.

vaintha, actress vanitha
వనిత విజయ్ కుమార్
author img

By

Published : Aug 19, 2021, 5:21 PM IST

తెలుగుతోపాటు తమిళ, మలయాళ భాషల్లో కూడా మంచి నటిగా పేరు సంపాదించింది నటి వనిత విజయ్ కుమార్. అంతేకాదు, నిర్మాతగా, రచయితగా తన ప్రతిభను చాటింది. 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి విచ్చేసి, సరదా సంగతులు పంచుకుంది.

సాధారణంగా ఎవరైనా ఒక పేరు, రెండు పేర్లు పెట్టుకుంటారు. కానీ, మీరేంటి నాలుగైదు పేర్లు పెట్టుకున్నారు?

వనిత: మా అమ్మకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. ఆమె పెళ్లయిన మూడేళ్ల వరకూ పిల్లలు లేరు. ఇప్పట్లో ఉన్నట్లు అప్పుడు ఐవీఎఫ్‌లాంటివి చికిత్సలు కూడా లేవు. కేవలం డాక్టర్‌ను కలిసి మందులు మాత్రమే వాడేవారు. మా ఇంటికి ఎదురుగా ఒక పుట్ట ఉంది. నాగదేవతకు పూజ చేస్తే పిల్లలు పుడతారని ఎవరో అమ్మకు చెప్పారట. దీంతో ఒక రోజు ఆమె పుట్టలో పాలు పోసి, మొక్కుకున్న వెంటనే ఒకనెలలోనే ప్రెగ్నెంట్‌ అయ్యారు. ఆ తర్వాత నేను పుట్టాను. అందుకే నాకు నాగలక్ష్మి మహేశ్వరి వనిత అని పెట్టారు. ఆ తర్వాత వనిత విజయ్‌కుమార్‌గా పేరు స్థిరపడింది.

'దేవి' సినిమా తర్వాత వనిత సినిమాల్లోకి ఎందుకు రాలేదు?

వనిత: బుర్ర సరిగా పని చేయలేదండి. 14ఏళ్ల వయసులో విజయ్‌తో 'చంద్రలేఖ' చేశా. దాని తర్వాత రాజ్‌కిరణ్‌గారితో 'మాణిక్యం' ఇలా అన్నీ సినిమాలే. ఆ వయసులో పాపులారిటీ, డబ్బు, కెరీర్‌ గురించి నాకు పెద్దగా తెలియదు. పెళ్లి చేసుకుని, పిల్లల్ని కని కుటుంబ జీవితం ప్రారంభించాలనుకున్నా. వయసు ప్రభావం కారణంగా ప్రేమలో పడ్డా. అప్పుడు ఇండస్ట్రీలో ఉండకూడదన్న నిర్ణయం తీసుకున్నా. బిడ్డ పుట్టిన తర్వాత ఇతర ఇండస్ట్రీల్లో అవకాశాలు బాగా వచ్చాయి. చేసింది నాలుగే అయినా, అందరూ గుర్తు పెట్టుకున్నారు. 40 చేయలేదని బాధ ఉన్నా, నాలుగు మంచి సినిమాలు చేశానన్న ఆనందం ఉంది.

vanitha, alitho saradaga
ఆలీతో సరదాగా కార్యక్రమంలో వనిత

'దేవి'లో అవకాశం రావడానికి కారణం?

వనిత: తెలియదు. ఆ టీమ్‌ నన్ను నేరుగానే సంప్రదించింది. హోమ్లీ గెటప్‌ నాకు బాగా సూటవుతుంది. సినిమా చూస్తున్న ప్రేక్షకులకు ఆ పాత్రపై జాలి ఉండాలి. అలా అనుకున్నప్పుడు బహుశా నన్ను ఎంపిక చేసుకుని ఉంటారు. దాంతో పాటు, నాకు సబ్జెక్ట్‌ కూడా బాగా నచ్చింది.

ప్రేమ వివాహానికి మీ తల్లిదండ్రులు ఒప్పుకొన్నారా?

వనిత: వాళ్లకు ఇష్టం లేదండీ. అతనిది వేరే మతం కావడం వల్ల ఒప్పుకోలేదు. నా గురించి ఎంత చెప్పమన్నా చెబుతాను. ఆయన గురించి నన్నేమీ అడగకండి. అన్ని కుటుంబాల్లో సమస్యలు ఉంటాయి. దురదృష్టవశాత్తూ నా గురించి కాస్త ఎక్కువ ప్రచారం అయింది. నాన్న బయటవాళ్ల చెప్పుడు మాటలు విన్నారు. అదే నాకు కాస్త బాధ అనిపించింది. పోలీసు కేసు వరకూ వెళ్లింది. మీడియా వచ్చి అడిగితే, జరిగింది చెప్పాను. అది కాస్తా బాగా వైరల్‌ అయింది.

ఆ తర్వాత సమస్య పరిష్కారమైందా?

వనిత: ఎలాగో సమసిపోయింది. అయితే, అమ్మ చనిపోయే రెండేళ్ల ముందు నేను విడాకులు తీసుకున్నా. ఆ తర్వాత అమ్మానాన్నలతో బాగానే మాట్లాడేదాన్ని. ఆమె చనిపోయిన తర్వాత ఆస్తుల విషయంలో గొడవ అయింది. నేనేమీ మొత్తం ఆస్తులు అడగలేదు. ఆ సమయంలోనే నన్ను ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మన్నారు. దీంతో పిల్లలతో కలిసి కనీసం ఉండటానికి చోటు లేదు. ఆ సమయంలో ఇండస్ట్రీలో ఎవరి దగ్గరికీ వెళ్లలేదు. కేవలం రజనీ అంకుల్‌ను మాత్రమే కలిశా. నాన్న, ఆయన మంచి స్నేహితులు. అంతకుమించి ఫ్యామిలీఫ్రెండ్‌. రజనీ అంకుల్‌ కూడా నాన్నకు చెప్పే ప్రయత్నం చేశారు కానీ, ఆయన వినలేదు. దీంతో సమస్య పరిష్కారం కాకుండా పోయింది. ఇది నా తలరాత అనుకుని వదిలేశా. అయితే, ఆత్మహత్య చేసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. జీవితంలో తప్పు జరిగింది. దాన్ని దిద్దుకునేందుకు ప్రయత్నించానంతే. ఒక అమ్మాయికి వివాహ జీవితం ఫెయిల్‌ అయితే, అక్కడే అయిపోయినట్లు కాదు. నన్ను నేను నిరూపించుకోవాలనుకున్నా.

vanitha, alitho saradaga
'దేవి' నటి వనిత

అమ్మ మంజుల ఎలా చనిపోయారు?

వనిత: అప్పుడు ఆమెకు 59ఏళ్లు. అనుకోకుండా ఒక రోజు కింద పడ్డారు. తలకు దెబ్బ తగిలింది. అందరూ ఏదో చిన్న దెబ్బ అనుకున్నారు. అయితే, ఆమె కడుపులో బలమైన గాయం అయింది. ఆ విషయం అప్పుడు తెలియలేదు. నెల రోజుల పాటు ఇంటర్నల్‌ బ్లీడింగ్‌ అయింది. ఆ తర్వాత రక్తం గడ్డకట్టింది. సమస్యలన్నీ చుట్టుముట్టాయి. ఆస్పత్రికి తీసుకెళ్తే, 72 గంటల్లో చనిపోతారని చెప్పారు. ఈ విషయం తెలిసి బంధువులు అందరూ వచ్చారు. దీంతో నాన్న నన్ను ఆస్పత్రికి రావద్దని చెప్పారు. అయితే, అమ్మ 'వనిత.. వనిత' అని కలవరించడంతో డాక్టర్స్‌ నన్ను పిలవమని చెప్పారట. నేను ఆస్పత్రికి వెళ్లే సరికి బంధువులు బయటకు వెళ్లిపోయారు. నేను వెళ్లి అమ్మను చేతిలోకి తీసుకోగానే, నన్ను చూసి, ఆమె కన్నుమూసింది. నా చేతిని చూసుకుంటే అమ్మే గుర్తొస్తుంది.

చిన్నప్పటి నుంచి ఎవరితో ఎక్కువ రిలేషన్‌ ఉండేది?

వనిత: నాన్నతో చాలా ఫ్రెండ్లీ రిలేషన్‌. అయితే, ఆయన్ను చూస్తే ఇప్పటికీ నాకు భయమే. అమ్మతో ఎప్పుడూ ప్రేమతో కూడిన గొడవే. అప్పుడప్పుడూ నాన్నకు ఫోన్‌ చేస్తూనే ఉంటాను. నేను ఆయనను వదులుకోలేదు. నేను కష్టాల్లో ఉన్నప్పుడు అందరూ ఉన్నారనిపించింది. ఇప్పుడు వరుస విజయాలతో ఉన్నప్పుడు ఎవరూ లేరని అనిపిస్తోంది. రెండు నెలల కిందట నాన్నకు ఫోన్‌ చేశా. ఆయన కూడా ఏమీ జరగనట్టే మాట్లాడారు. 'మిమ్మల్ని చూడాలని ఉంది' అని అడిగితే, 'నాకు ఒంట్లో బాగాలేదు. ఎప్పుడు కలవాలో మళ్లీ చెబుతాను' అన్నారు. ఆ తర్వాత రెండు మూడుసార్లు కాల్‌ చేసినా, ఆయన లిఫ్ట్‌ చేయలేదు. దీంతో ఆయన్ను ఇబ్బంది పెట్టకూడదని వదిలేశా. నేను, నా చెల్లి ప్రీత మంచి స్నేహితులం. ఆమె ఎక్కడకు వెళ్లినా నేను చూసుకునేదాన్ని. శ్రీదేవి నా కన్నా ఆరు సంవత్సరాలు చిన్నది. అమ్మ ఆస్తి విషయంలో సుప్రీంకోర్టు వరకూ వెళ్లాను. ఆస్తి అంతా నా చెల్లెళ్ల పేరుమీద ఉందని తెలిసి, కేసు వాపస్‌ తీసుకున్నా. ఎందుకంటే వాళ్లు బాగుండటమే నాకు కావాలి. డైరెక్టర్‌ హరిని ప్రీత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఒక సినిమా షూటింగ్‌కు నేను వెళ్లలేదు. దీంతో వాళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించి పెళ్లి చేసుకున్నారు. ఆ షూటింగ్‌కు నేను వెళ్లి ఉంటే ఆ ప్రేమ సక్సెస్‌ అయ్యేది కాదు. ఎందుకంటే నేను నా జీవితంలో చేసిన తప్పును వేరే వాళ్లను చేయనీయను. అయితే, ప్రీత తీసుకున్నది మంచి నిర్ణయం.

vanitha, alitho saradaga
వనిత కుటుంబ సభ్యులు

వనిత విజయ్‌కుమార్‌ అంటే వివాదం.. వివాదం అంటే వనిత విజయ్‌కుమార్‌ ఎందుకలా అయింది?

వనిత: జాతకం అలా ఉందనుకుంటా. నేను కాస్త ఓపెన్‌గా మాట్లాడతా. నేను మాట్లాడేది పంచ్‌ కొట్టినట్లు ఉంటుంది. నేను కడుపులో ఉండగా, మా అమ్మ ఒక న్యూమరాలజిస్ట్‌ను కలిసి 'మా కూతురు చాలా ఫేమస్‌ అవ్వాలి. అందుకు తగిన పేరు పెట్టండి' అడిగిందట. ఆయన ఏ ముహూర్తాన ఈ పేరు పెట్టారో.. నేను ఎప్పుడూ వార్తల్లోనే ఉంటున్నా. 'పవర్‌స్టార్‌' శ్రీనివాసన్‌గారితో ఓ సినిమా చేస్తున్నా. దాని సినిమా షూటింగ్‌కు సంబంధించి ఒక ఫొటో పెట్టా. అది కూడా నాకు పెళ్లయినట్లు క్రియేట్‌ చేశారు. అక్కడ ఆయన మంచి కమెడియన్‌. ఈ ఫొటో పెట్టిన తర్వాత నన్ను ‘వైరల్‌ స్టార్‌’ వనిత అని కూడా అంటున్నారు.

మరి తమిళ పవర్‌స్టార్‌ను నిజంగా పెళ్లి చేసుకుంటున్నారా?

వనిత: లేదండీ(నవ్వులు) ఒక్కో సినిమా ఒక్కో ప్రేమ.. పెళ్లి జరుగుతుంటాయి. అవన్నీ నా వ్యక్తిగత జీవితానికి అన్వయించారు. సోషల్‌మీడియాలో కొందరికి ఇదే పని. దీంతో నాకు కోపం వచ్చి, 'నాలుగు కాదు, 40 సార్లు పెళ్లి చేసుకుంటా మీకెందుకు' అని స్టేట్‌మెంట్‌ ఇచ్చా.

vanitha, alitho saradaga
వనిత విజయ్ కుమార్

తెలుగు చిత్ర పరిశ్రమలోకి రావాలని ఆలోచన ఉందా?

వనిత: 'దేవి' ఎంత విజయం సాధించిందో ఇప్పటికీ అందరికీ గుర్తే. ఆ సినిమా దొరకడం నాకు అదృష్టం. అయితే, దాన్ని నేను సద్వినియోగం చేసుకోలేదు. మళ్లీ సినిమాలు చేస్తున్నా. వ్యక్తిగత జీవితంలో సెకండ్ ఛాన్స్‌లు దొరకుతాయి. వృత్తి జీవితంలో చాలా తక్కువ మందికి మాత్రమే లభిస్తాయి. నాకు దేవుడి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టే, నాకు రెండో అవకాశం వచ్చింది. చిన్నప్పటి నుంచి తెలుగు రాదు. కానీ, 'దేవి' సినిమా కోసం నేర్చుకున్నా. తెలుగులో జూనియర్‌ ఎన్టీఆర్‌ అంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో ఒక్క సన్నివేశంలో అయినా నటించాలని ఉంది. ఆయన నటుడిగా కెరీర్‌ ప్రారంభించిన నాటి ప్రతి సినిమా నేను చూశా. ప్లీజ్‌ ఎన్టీఆర్‌.. మీ సినిమాలో అవకాశం ఇవ్వండి!

vanitha, alitho saradaga
వనిత సెల్ఫీ ఫొటో

చిన్నప్పుడు ఎలా ఉండేవారు? ఎవరో దర్శకుడి ఇంటికి ఫోన్‌ చేసి, వాళ్ల అబ్బాయిని ఏడిపించారట!

వనిత: అస్సలు అల్లరి చేసేదాన్ని కాదు. 40 వచ్చిన తర్వాతే నాటీగా మారా. అయితే, ఆ ఫోన్‌ చేసింది నేను కాదు, మంచు విష్ణు, మంచు మనోజ్‌. మేమంతా చిన్నప్పటి స్నేహితులం. మోహన్‌బాబుగారు, రజనీ అంకుల్‌, నాన్నా స్నేహితులు కావడంతో అందరం రజనీ అంకుల్‌ ఇంట్లో కలిసేవాళ్లం. మనోజ్‌ బాగా అల్లరి చేసేవాడు. ప్రాంక్‌ కాల్‌ చేద్దామని ఐడియా ఇచ్చింది కూడా అతనే. అలా ఒక్కొక్కరూ ఒక్కో పేరు చెబితే, నేను రవిరాజా అంకుల్‌ పేరు చెప్పా. వాళ్ల అబ్బాయి సత్యని ఏడిపిద్దాం అనుకున్నాం. ఆ సమయానికి ఆది ఫోన్‌ ఎత్తాడు. ‘మీ కరెంట్‌ మీటర్‌ తిరుగుతుందో లేదో చూడు. అర్జెంట్‌గా వెళ్లు’ అనేసరికి ఎవరో పెద్ద వాళ్లు ఫోన్‌ చేశారనుకుని ఆది పరిగెత్తుకుంటూ వెళ్లి చూసొచ్చాడు. ‘అవును తిరుగుతోంది’ అని అంటే ‘అయితే వెళ్లి తిరగకుండా పట్టుకో' అని ఫోన్‌ పెట్టేశాడు. మేమంతా ఒకటే నవ్వులు.

'దేవి' సినిమా షూటింగ్‌కు ముందు నిర్మాత ఎం.ఎస్‌.రాజుకు సాయిబాబా కలలో కనిపించి, 'ఈ సినిమా అయిపోయిన తర్వాత కొంతమంది చనిపోతారు’ అని అన్నారట. అసలు ఏం జరిగింది?

వనిత: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారి స్టూడియోలో 'దేవి' సినిమా రికార్డింగ్‌ పూజా కార్యక్రమం. దేవిశ్రీ ప్రసాద్‌కు అదే తొలి సినిమా. ఎం.ఎస్‌.రాజుగారు సాయిబాబా భక్తుడు. ఆయనకు కలలో సాయిబాబా కనిపించి, 'ఈ సినిమా బాగా హిట్టవుతుంది. మంచి పేరు వస్తుంది. కానీ, ఈ షూటింగ్‌ అయ్యేలోపు ముగ్గురు చనిపోతారు. జాగ్రత్త’ అని అన్నారట. విశాఖలో షూటింగ్‌ జరుగుతోంది. ఒక పాటలో పాము వచ్చి నాకు బొట్టు పెట్టాలి. అది నిజంగా జరిగింది. అయితే, బొట్టు పెట్టిన వెంటనే పాము నా చేయి కరిచింది. రక్తం కూడా వచ్చింది. అందరికీ భయం వేసింది. పెన్సిలిన్‌ చేస్తే, నాకు రియాక్షన్‌ వస్తుంది. దాంతో అమ్మ నన్ను ఆస్పత్రి తీసుకెళ్లనని చెప్పారు. అయితే, అక్కడ నాకు ఒక నాటు మందు ఇచ్చారు. అందుకు తీసుకునేందుకు కూడా అమ్మ ఒప్పుకోలేదు. ఎం.ఎస్‌.రాజుగారు చాలా భయపడ్డారు. రిస్క్‌ తీసుకోవద్దని వేడుకున్నారు. అప్పుడు అమ్మ ఒక విషయం చెప్పారు. 'నా కూతురు నాగదేవత వల్ల పుట్టింది. ఆమె వల్ల చనిపోతే పర్వాలేదు' అని అన్నది. ఆ దేవత దయ వల్ల నాకు ఏమీ జరగలేదు. అయితే, ఆ పామును తీసుకువచ్చిన వ్యక్తిని అదే పాము కరిచి చనిపోయాడు. ఆ తర్వాత ప్రొడక్షన్‌ మేనేజర్‌ నాగేశ్వర్‌ కూడా అలాగే కన్నుమూశారు. నేను ఎలాగో ప్రాణాలతో బయటపడ్డా!

మీకు ఎంతమంది పిల్లలు?

వనిత: నాకు ఒక కుమారుడు. విజయ్‌ శ్రీహరి, ఇద్దరు కూతుళ్లు. అబ్బాయి ప్రస్తుతం లండన్‌లో ఫిలిం మేకింగ్‌ కోర్సు చదువుతున్నాడు.

తెలుగులో ఎలాంటి సినిమాలు ఆశిస్తున్నారు?

వనిత: విభిన్న పాత్రలు చేయాలని ఉంది. ఇక్కడ నాకు ఏది సరిపోతుందో ఆ పాత్రలే చేస్తా! అలా అని ఫలానా పాత్ర మాత్రమే చేయాలని నేను హద్దులు పెట్టుకోను.

ఇదీ చదవండి:Alitho Saradaga: ఆ డైలాగ్ వెనుక అంత కథ ఉందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.