ETV Bharat / sitara

'జైభీమ్'​ రికార్డు.. కొత్త రిలీజ్​ డేట్​తో 'గంగూబాయ్​' - cinema updates

మిమ్మల్ని అలరించేందుకు కొత్త సినిమా కబుర్లు వచ్చాయి(cinema updates). ఇందులో ఆలియాభట్​ 'గంగూబాయ్​', అక్షయ్​కుమార్​ 'పృథ్వీరాజ్'​, సూర్య 'జైభీమ్'​, రాజ్​తరుణ్​ 'అనుభవించు రాజా' సహా పలు చిత్రాల సంగతులు ఉన్నాయి.

cinema updates
సినిమా అప్డేట్స్​
author img

By

Published : Nov 15, 2021, 1:22 PM IST

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య-దర్శకుడు టి.ఎస్‌.జ్ఞానవేల్‌ కలయికలో తెరకెక్కిన సినిమా 'జైభీమ్​'(surya jai bhim movie). అమెజాన్​ ప్రైమ్​లో ఇటీవలే విడుదలైన ఈ మూవీ విశేష ప్రేక్షకాదరణ పొందింది(surya jai bhim movie release date). ఇప్పుడీ ఈ చిత్రం ఓ రికార్డును అందుకుంది. ప్రముఖ మూవీ రేటింగ్​ సంస్థ ఐఎండీబీ సినిమాల జాబితాలో అత్యధిక రేటింగ్​ 9.6 సాధించి టాప్​-1 స్థానాన్ని కైవసం చేసుకుంది. ఏ తప్పు చేయని బలహీన వర్గ మహిళను కేసు నుంచి బయటపడేసే లాయర్ పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు సూర్య. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఈ మూవీని నిర్మించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

కొత్త రిలీజ్​ డేట్​

ఆలియా భట్(gangubai kathiawadi movie) హీరోయిన్​గా ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన చిత్రం 'గంగూబాయ్ కతియావాడి'. వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం కొత్త విడుదల తేదీని ఖరారు చేసుకుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 18న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపింది చిత్రబృందం(gangubai kathiawadi release date). ఇప్పటికే విడుదల ఈ చిత్ర టీజర్​​ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

cinema updates
గంగూబాయ్​ కతియావాడి

టీజర్​తో

యోధుడు పృథ్వీరాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా 'పృథ్వీరాజ్​'. బాలీవుడ్​ స్టార్​ హీరో అక్షయ్​కుమార్​ టైటిల్​ రోల్ పోషించారు. మాజీ మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ కథానాయిక. తాజాగా ఈ చిత్ర టీజర్(akshay kumar prithviraj teaser)​ విడుదలై ఆకట్టుకుంది. సినిమాను వచ్చే ఏడాది జనవరి 21న రిలీజ్​ చేయనున్నట్లు తెలిపింది చిత్రబృందం(akshay kumar prithviraj release date).ఈ మూవీకి చంద్రప్రకాశ్ ద్వివేది దర్శకుడు. యష్ రాజ్​ ఫిల్మ్స్​ నిర్మిస్తోంది.

సాంగ్​తో రాజ్​తరుణ్​

రాజ్‌ తరుణ్‌, కశిష్‌ ఖాన్‌ జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'అనుభవించు రాజా'(anubhavinchu raja movie). శ్రీను గవిరెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం నవంబర్‌ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది(raj tarun anubhavinchu raja movie release date). ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఓ సరికొత్త పాట బయటకు వచ్చింది. 'బతికేయ్‌ హాయిగా' అంటూ సాగే ఈ పాటకు భాస్కర భట్ల సాహిత్యం అందించగా దీపు ఆలపించారు. గోపీసుందర్‌ స్వరాలు సమకూర్చారు. వినోదాత్మక కథాంశంతో కుటుంబం మొత్తం మెచ్చేలా రూపొందిన చిత్రమిది. అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై సుప్రియ యార్లగడ్డ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో రాజ్‌ తరుణ్‌.. ఎలాంటి ఉద్యోగం చేయకుండా పెద్దలు సంపాదించిన డబ్బుని దుబారాగా కోళ్ల పందెలు కోసం ఖర్చు పెట్టే యువకుడిగా కనిపించనున్నారు.

'రామ్​అసుర్​' ట్రైలర్​

అభినవ్‌ సర్ధార్‌, రామ్‌ కార్తిక్‌, చాందిని తమిళ్‌రాసన్‌, శాని సాల్మాన్‌, శెర్రి అగర్వాల్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'రామ్‌ అసుర్‌'. వెంకటేష్‌ త్రిపర్ణ తెరకెక్కించారు. అభినవ్‌, వెంకటేష్‌ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ఈనెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీటీమ్​.. చిత్ర ట్రైలర్​ను రిలీజ్​ చేసింది. ఈ ప్రచార చిత్రం ఆద్యంతం ఆకట్టుకుంటోంది.

ఫస్ట్​లుక్​

తాప్సీ, ప్రతీక్​ గాంధీ కలిసి నటిస్తున్న కామెడీ డ్రామా సినిమా 'వో లడ్కీ హై కహా'. తాజాగా ఈ చిత్రం ఫస్ట్​లుక్​ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ చిత్ర ఫస్ట్​ షెడ్యూల్​ షూటింగ్​ జైపూర్​లో జరుగుతోంది. ఈ మూవీకి అర్షద్​ సయ్యద్​ దర్శకుడు.

cinema updates
'వో లడ్కీ హై కహా' ఫస్ట్​లుక్​

ఇదీ చూడండి: ఆసక్తిగా 'గని' టీజర్​.. 'రాంబో'గా విజయ్​సేతుపతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.