ETV Bharat / sitara

Ajay Devgan: ఓటీటీ రిలీజ్​కు సిద్ధమైన 'భుజ్​' - ఆగస్టు 13న భుజ్​ విడుదల

1971లో భారత్​-పాకిస్థాన్​ మధ్య జరిగిన యుద్ధం నేపథ్యంతో రూపొందిన చిత్రం 'భుజ్​​: ది ప్రైడ్​ ఆఫ్​ ఇండియా'(Bhuj: The Pride of India). అజయ్​ దేవగణ్​(Ajay Devgan), సంజయ్​ దత్​(Sanjay Dutt) ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం ఇప్పుడు ఓటీటీ రిలీజ్​కు సిద్ధమైంది.

Ajay Devgn, Sonakshi Sinha, Sanjay Dutt's 'Bhuj' to release on August 13
Ajay Devgan: ఓటీటీ రిలీజ్​కు సిద్ధమైన 'భుజ్​'
author img

By

Published : Jul 6, 2021, 8:15 PM IST

బాలీవుడ్​ స్టార్స్​ అజయ్​ దేవగణ్​(Ajay Devgan), సంజయ్​ దత్​(Sanjay Dutt) ప్రధానపాత్రల్లో నటిస్తున్న చిత్రం 'భుజ్​: ది ప్రైడ్​ ఆఫ్​ ఇండియా'(Bhuj: The Pride of India). 1971లో భారత్​-పాకిస్థాన్​ మధ్య జరిగిన​ యుద్ధం నేపథ్యంతో సినిమాను రూపొందించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు చోట్ల థియేటర్లు ఇంకా తెరచుకోకపోవడం వల్ల ఈ సినిమా ఓటీటీలో రిలీజ్​ చేసేందుకు చిత్రబృందం సిద్ధమైంది. ఆగస్టు 13న డిస్నీ+హాట్​స్టార్​లో చిత్రాన్ని స్ట్రీమింగ్​ చేయనున్నట్లు ప్రకటించింది.

ఈ సందర్భంగా సినిమాలోని పాత్రలను పరిచయం చేస్తున్న వీడియోను సోషల్​మీడియాలో చిత్రబృందం షేర్ చేసింది. ఇందులో అజయ్​ దేవగణ్​, సంజయ్​ దత్​లతో పాటు సోనాక్షి సిన్హా(Sonakshi Sinha), అమ్మీ విర్క్​(Ammy Virk), శారద్​ ఖేల్కర్​(Sharad Kelkar), నోరా ఫతేహి(Nora Fatehi), ప్రణితా సుభాష్​(Pranitha Subhash) తదితరులు నటించారు. అభిషేక్​ దుదియా దర్శకత్వం వహిస్తుండగా.. కథానాయకుడు అజయ్​ దేవగణ్​ సహ-నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఇదీ చూడండి.. ఇండో-పాక్ యుద్ధంలో సోనాక్షి.. ఫస్ట్​లుక్​ అదరహో

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.