ETV Bharat / sitara

హీరోయిన్, విలన్​ రెండు ఐశ్వర్యనే! - Ponniyin Selvan latest news

మణిరత్నం తీస్తున్న 'పొన్నియన్ సెల్వన్' సినిమా ఐశ్వర్యరాయ్ ద్విపాత్రాభినయం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ప్రతినాయిక పాత్ర కూడా విశేషం.

Aishwarya Rai Bachchan
ఐశ్వర్యరాయ్ బచ్చన్
author img

By

Published : Feb 20, 2021, 6:25 AM IST

ఐశ్వర్యరాయ్‌.. ఒకే సినిమాలోని రెండు పాత్రల్లో అలరించనుంది. అందులోనూ ఓ పాత్ర హీరోయిన్, రెండోది విలన్‌. అందాలు నిండిన ఐశ్వర్య నీలి కళ్లల్లో కర్కశత్వం కూడా పలికించనున్నారు ప్రముఖ దర్శకుడు మణిరత్నం. ఆమె ప్రధాన పాత్రలో ఆయన తెరకెక్కిస్తోన్న చిత్రం 'పొన్నియిన్‌ సెల్వన్‌'. ఇందులో మందాకినీ దేవి, నందిని పాత్రల్లో ఐశ్వర్య కనిపించబోతుంది. అందులో ఒకటి ప్రతినాయిక ఛాయలున్న పాత్రని సమాచారం. దీని కోసం ఆమె ప్రత్యేకంగా సాధన చేస్తుందట.

Aishwarya Rai Bachchan
ఐశ్వర్యరాయ్

కొవిడ్‌ కారణంగా ఆగిపోయిన ఈ సినిమా ఇటీవలే హైదరాబాద్‌లో తిరిగి ప్రారంభమైంది. ఎక్కువమంది తారాగణంపై ఇందులోని ఓ గీతాన్ని కూడా తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తీసే ఆలోచనలో చిత్రబృందం ఉందట. తొలిభాగం చిత్రీకరణ మే నెలకు పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. విక్రమ్‌, కార్తి, జయం రవి, విక్రమ్‌ ప్రభు, త్రిష, ఐశ్వర్య రాజేష్‌, ఐశ్వర్య లక్ష్మి తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతమందిస్తున్నారు.

ఇది చదవండి: దుబాయ్​లో ట్రాఫిక్​ జామ్​కు కారణమైన ఐశ్వర్యరాయ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.