ఇటీవల బాలీవుడ్ ర్యాపర్, సింగర్ బాద్‌షా పాడిన 'గెండా ఫూల్' పాట మంచి ప్రేక్షకాదరణ పొందింది.అయితే ఈ పాట విడుదలైన నాటి నుంచి పలువురు నెటిజన్లు బాద్‌షాపై విమర్శల వర్షం కురిపించడం ప్రారంభించారు. బంగాలీ రచయిత రతన్ కహర్ 'గెండా ఫూల్' పాటను బాద్‌షా కాపీ కొట్టాడని.. కనీసం ఆయనకు ఎలాంటి క్రెడిట్ ఇవ్వలేదని నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా ఈ విషయంపై స్పందించాడు బాద్‌షా. తాను ఇటీవల పాడిన 'గెండా ఫూల్' పాటకు వచ్చిన రాయల్టీలో కొంతభాగాన్ని రతన్ కహర్‌కు ఇస్తానని చెప్పాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
"రతన్ కహర్ పాడిన ఒరిజినల్ 'గెండా ఫూల్' పాటను గతంలో చాలామంది రీక్రియేట్ చేశారు. బంగాలీ సినిమాల్లో కూడా ఆయన పాడిన పాటను ఉపయోగించారు. ఇప్పటివరకూ ఆయనకు ఎవరూ క్రెడిట్ ఇవ్వలేదు. రాయల్టీలు మాత్రమే ఒక కళాకారుడికి ఆదాయం కావడం ఎంతో బాధగా ఉంది. ఇప్పుడు నేను పాడిన 'గెండా ఫూల్' పాటకు వచ్చే రాయల్టీని ఆయనతో పంచుకోవాలనుకుంటున్నాను. లాక్‌డౌన్ పూర్తయిన తర్వాత నేను ఆయన్ని కలవాలనుకుంటున్నాను. అలాగే ఆయనతో కలిసి ఓ పాటను రూపొందించాలనుకుంటున్నాను."
-బాద్‌షా, బాలీవుడ్ సింగర్
బాద్‌షా పాడిన ఈ పాటలో జాక్వలిన్ ఫెర్నాండేజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బంగాలీ టచ్‌తో రూపొందించిన ఈ పాట దుర్గా పూజ థీమ్‌తో సాగుతుంది. దీనికి స్నేహా శెట్టి కోహ్లీ దర్శకత్వం వహించింది. ఇప్పటికే 160 మిలియన్ వీక్షణలతో యూట్యూబ్‌లో దూసుకెళ్తోందీ పాట.
- " class="align-text-top noRightClick twitterSection" data="">