ETV Bharat / sitara

ఆమిర్​ కోసం 'ఆదిపురుష్'​ పోస్ట్​పోన్​​.. 'జెర్సీ' కొత్త రిలీజ్​ డేట్​ - Jersy hindi remake release date

కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చాయి. ఇందులో ప్రభాస్​ 'ఆదిపురుష్'​, ఆమిర్ ఖాన్​ 'లాల్​సింగ్​చద్ధా', అక్షయ్​కుమార్​ 'బచ్చన్​పాండే' చిత్రాల సంగతులు ఉన్నాయి.

Adirpush postpone
ఆదిపురుష్​ పోస్ట్​పోన్​
author img

By

Published : Feb 15, 2022, 5:40 PM IST

Updated : Feb 15, 2022, 6:43 PM IST

'జెర్సీ' హిందీ​ రీమేక్​ సినిమా కొత్త విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. ఏప్రిల్​ 14న రిలీజ్​ చేయనున్నట్లు దర్శకనిర్మాతలు స్పష్టం చేశారు. ఇందులో షాహిద్​ కపూర్​ ప్రధానపాత్ర పోషించగా.. మృనాల్​ ఠాకూర్​, పంకజ్​ కపూర్​ కీలకపాత్రల్లో నటించారు. మాృతకను రూపొందించిన గౌతమ్​ తిన్ననూరి హిందీలోనూ దర్శకత్వం వహించారు. జెర్సీ హిందీ రీమేక్​కు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్​ సమర్పకులుగా ఉండగా.. అమన్​ గిల్​, దిల్​ రాజు, నాగ వంశీ నిర్మాతలుగా వ్యవహరించారు. ​

jersy new release date
జెర్సీ కొత్త రిలీజ్​ డేట్​

'లాల్​సింగ్​చద్ధా' కోసం ఆదిపురుష్​ పోస్ట్​పోన్​

prabhas Adirpush postpone: ఆగస్టు 11న విడుదవ్వాల్సిన ప్రభాస్​ 'ఆదిపురుష్'​ వాయిదా పడింది. అదే రోజున బాలీవుడ్​ స్టార్​ ఆమిర్​ ఖాన్​ నటించిన 'లాల్​ సింగ్ చద్ధా' రిలీజ్​ అవ్వడానికి సిద్ధమవ్వడమే ఇందుకు కారణం. ఈ విషయాన్ని ఆమిర్​ సినిమా చిత్రబృందం తెలిపింది.. "షూటింగ్​ పూర్తికానందున ఏప్రిల్​ 14న మా సినిమా రిలీజ్ చేయట్లేదు. 2022 ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తాం. మమల్ని అర్థం చేసుకుని మా కోసం తమ సినిమాను వాయిదా వేసుకున్న ఆదిపురుష్​ టీమ్​కు కృతజ్ఞతలు" అని పేర్కొంది. కాగా ఏప్రిల్​ 14న యశ్​ 'కేజీఎఫ్​ 2', విజయ్​ 'బీస్ట్'​ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

adipurush postpone
ఆదిపురుష్​, లాల్​సింగ్​ చద్ధా పోస్ట్​పోన్​

ట్రైలర్​ విడుదల తేదీ

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటించి 'బచ్చన్​పాండే' ట్రైలర్​ ఫిబ్రవరి 18న రిలీజ్​ కానుంది. కృతిసనన్ , జాక్వెలిన్ ఫెర్నాండెజ్​ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఫర్హాద్ సమ్జీ దర్శకత్వం వహించారు. గ్యాంగ్​స్టర్ డ్రామా కథతో దీనిని తెరకెక్కించారు.

bachan pandey trailer
బచ్చన్​పాండే ట్రైలర్​

ఇదీ చూడండి: వారికి క్షమాపణలు చెప్పిన ఆ హీరో.. ఎందుకంటే?

Last Updated : Feb 15, 2022, 6:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.