ETV Bharat / sitara

హీరోయిన్ దిశా పటానీ తండ్రికి కరోనా​ - Disha Patani latest news

కథానాయిక దిశా పటానీ తండ్రి జగదీశ్​కు కరోనా సోకింది. ఆయనతో పాటు సహ ఉద్యోగుల్లో ఇద్దరికి పాజిటివ్​గా తేలింది. ఈ విషయాన్ని ఉత్తరప్రదేశ్​ విద్యుత్​శాఖ అదనపు సీఎంఓ అశోక్​ కుమార్​ వెల్లడించారు.

Actress Disha Patani's father tests positive for coronavirus
బాలీవుడ్​ నటి దిశా పటానీ తండ్రికి కరోనా పాజిటివ్​
author img

By

Published : Aug 6, 2020, 1:44 PM IST

Updated : Aug 6, 2020, 1:54 PM IST

బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​ దిశా పటానీ తండ్రి జగదీశ్​ పటానీకి కరోనా వైరస్​ సోకినట్లు నిర్ధారణ అయింది. ఆయనతో పాటు ఉత్తరప్రదేశ్​ విద్యుత్​శాఖ విజిలెన్స్​ విభాగం​లో పనిచేసే ఇద్దరు అధికారులకు పాజిటివ్​గా తేలిందని అదనపు సీఎంఓ అశోక్ కుమార్​ చెప్పారు. జగదీశ్​ పటానీతో పాటు అతని సహ ఉద్యోగులు ఇద్దరు ఇటీవలే లక్నో నుంచి ఉత్తరప్రదేశ్​కు వచ్చారని.. వారికి వైద్యపరీక్షలు నిర్వహించగా వైరస్​ సోకినట్లు తెలిసిందని అశోక్​ తెలిపారు.

ఉత్తరప్రదేశ్​ రాష్ట్ర విద్యుత్​ శాఖ విజిలెన్స్​ విభాగంలో డిప్యూటీ ఎస్పీగా పనిచేస్తున్న జగదీశ్​ పటానీ, అతని బృందం ప్రస్తుతం ట్రాన్స్​ఫార్మర్​ కుంభకోణం విషయమై దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా వారికి కరోనా సోకడం వల్ల జోనల్​ ఛీఫ్​ ఇంజనీర్​ కార్యాలయాన్ని 48 గంటలపాటు మూసేస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

Last Updated : Aug 6, 2020, 1:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.