ETV Bharat / sitara

దయకు నిలువెత్తు రూపం 'దియా' - దియా మీర్జీ జీవితం

నటనలో గొప్ప పేరు రాకపోయినా తన దయాగుణంతో చాలా మంది మన్ననలు పొందింది నటి దియా మీర్జా. సాధారణంగా తమ సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతుంటే హీరోయిన్లకు అవకాశాలు చేజారిపోతుంటాయి. కానీ, దియా మీర్జాకు అలా జరగలేదు. తన అందం, అభినయం మీర్జాకు మరిన్ని అవకాశాలు తెచ్చిపెట్టింది. నేడు ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఆమె సినీ ప్రస్తానంపై ప్రత్యేక కథనం..

Dia Mirza
దయ అమ్మాయైతే 'దియా'
author img

By

Published : Dec 9, 2020, 5:31 AM IST

మనసున్న మారాణి.. అనే మాటకి నిలువెత్తు రూపం దియామీర్జా. మామూలుగా సినిమావాళ్లు నటనతోనో, అందంతోనో ఆకట్టుకుంటారు. కానీ, దియామీర్జా మాత్రం తన మనసుతో గుర్తింపు పొందింది. అవార్డుల వేడుకల్లో నటీనటులందరికీ సినిమాల గురించి పురాస్కారాలు దక్కితే.. దియాకి మాత్రం సమాజం కోసం పాటుపడుతున్న విధానాన్ని మెచ్చుకొంటూ పురస్కారాలు అందజేస్తుంటారు. అదే ఆమె ప్రత్యేకత. అలాగని నటన, అందం విషయాల్లో ఏ మాత్రం తక్కువ చేసి చూడలేం. జీరోసైజ్‌ అందాలలో కుర్రకారు దృష్టి మరల్చుకోకుండా చేసేస్తోంది. చేతిలో పెద్దగా విజయాలేక్లపోయినా.. ఆమెకి అవకాశాలు దక్కుతూనే ఉన్నాయంటే కారణం అదే.

నేడు ఆమె పుట్టినరోజు సందర్భంగా దియామీర్జా నటన ప్రయాణం వివరాలు మీకోసం..

హైదరాబాదీ..

అసలు పేరు దియా హ్యాండ్రిచ్‌. హైదరాబాద్‌లో పుట్టి పెరిగింది. తండ్రి జర్మనీకి చెందిన ఫ్రాంక్‌ హ్యాండ్రిచ్‌. తల్లి బంగాల్‌కి చెందిన దీపా. నాలుగేళ్ల వయసులో ఉన్నప్పుడే తల్లిదండ్రులు విడిపోయారు. తొమ్మిదేళ్ల వయసున్నప్పుడు తండ్రి మరణించారు. ఆ తర్వాత తల్లి అహ్మద్‌ మీర్జాని పెళ్లి చేసుకొంది. దీంతో దియా హాండ్రిచ్‌ పేరు కాస్త దియా మీర్జాగా మారిపోయింది. బాల్యమంతా హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో గడిచింది. విద్యారణ్య స్కూల్, స్టాన్లీ జూనియర్‌ కళాశాలల్లో చదువు కొనసాగించింది. ఓపెన్‌ యూనివర్సిటీలో డిగ్రీ చేయాలనుకున్నా.. మోడలింగ్‌ అవకాశాల వల్ల అది సాధ్యం కాలేదు.

Dia Mirza
నటి దియా మీర్జా

మోడలింగ్‌తో..

పదో తరగతి పూర్తవ్వగానే మోడలింగ్‌పై దృష్టి పెట్టింది. ఒక్కపక్క కళాశాలలో చదువుకుంటూనే మరో పక్క మోడల్‌గా పలు వ్యాపార ఉత్పత్తులకు ప్రకటనలు చేసింది. ఆ తర్వాత ఓ మీడియా సంస్థలో మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌గా చేరి మోడల్‌గా తన ప్రస్ధానాన్ని కొనసాగించింది. ఆ తర్వాత అందాల పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచింది. 2000లో మిస్‌ ఏసియా పసిఫిక్‌ ఇంటర్నేషనల్‌గా అందాల కిరీటాన్ని సొంతం చేసుకుంది. మోడలింగ్‌తో లభించిన గుర్తింపు వల్లే బాలీవుడ్‌ నుంచి పిలుపందుకుంది.

Dia Mirza
మోడలింగ్​పై దృష్టి

తొలి అవకాశం

'రెహనా హై తేరే దిల్‌ మే'తో తొలి అవకాశాన్ని అందుకుంది. ఆ చిత్రం బాక్సాఫీసు ముందు నిలబడలేకపోయింది. అయితే దియామీర్జా అందం మాత్రం బాలీవుడ్‌ ప్రేక్షకుల్ని, పరిశ్రమను బాగా ఆకట్టుకుంది. దీంతో అవకాశాలు వెల్లువెత్తాయి. 'దమ్‌', 'దీవానాపన్‌', 'తుమ్‌కోన్‌ భూల్‌ పాయేంగే', 'తెహజాబ్‌', 'ప్రాణ్‌ జాయే పర్‌ షాన్‌ న జాయే', 'తుమ్‌ సా నహీ దేఖే ఎ లవ్‌ స్టోరీ', 'స్టాప్‌'... ఇలా వరుసగా సినిమాల్లో నటిస్తూ వచ్చింది. ఏ సినిమా కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఆదరణ పొందలేకపోయినా దియాకి మాత్రం అవకాశాలు అలాగే వచ్చాయి. అందుకు కారణం ఆమె అందమే.

Dia Mirza
అందంతో మరిన్ని అవకాశాలు చేజింకించుకున్న దియా

ప్రత్యేక పాత్రలతో...

కథానాయికగా కంటే ప్రత్యేక పాత్రలతోనే ఎక్కువగా గుర్తింపు తెచ్చుకొంది దియామీర్జా. 'లగే రహో మున్నాభాయ్‌', 'పరిణీత', 'ఫైట్‌క్లబ్‌', 'ఘాటవుట్‌ ఎట్‌ లోఖండ్‌వాలా', 'కుర్బాన్‌', 'లక్‌బై ఛాన్స్‌' చిత్రాల్లో దియా పోషించిన పాత్రలు ప్రేక్షకుల్ని అలరించాయి. ఆ చిత్రాలు కూడా విజయాల్ని సాధించాయి. దీంతో అవకాశాలకు ఢోకా లేకపోయింది. మరో పక్క 'అలగ్‌', 'ప్రతీక్ష', 'హానీమూన్‌ ట్రావెల్స్‌', 'క్యాష్‌', 'హే బేబీ', 'లవ్‌ బ్రేకప్స్‌ జిందగీ' తదితర చిత్రాల్లో కథానాయికగానూ అలరించింది.

Dia Mirza
ప్రత్యేక పాత్రల్లోనూ నటించిన దియా

నిర్మాతగా..

నటిగానే కాకుండా నిర్మాణంలోకి కూడా అడుగుపెట్టింది. తన స్నేహితుడు సాహుల్‌ సంఘాతో కలిసి బార్న్‌ఫ్రీ ఎంటర్‌టైన్‌మెంట్‌ అనే సంస్థ స్థాపించింది. ఆ బ్యానర్‌పై తొలిసాని 'లవ్‌ బ్రేకప్‌ జిందగీ' అనే చిత్రాన్ని నిర్మించారు. మంచి లాభాలొచ్చాయి. తన తల్లి మాతృభాష అయిన బెంగాలీలోనూ దియా ఓ చిత్రం చేసింది. 'పాంచ్‌ అధ్యాయ్‌' పేరుతో రూపొందిన ఆ సినిమా నటిగా దియాకి మంచి ఫలితాన్ని తెచ్చిపెట్టింది.

సమాజం కోసం..

నటిగా కంటే ఓ సోషల్‌ యాక్టివిస్ట్‌గా ఎక్కువ గుర్తింపు తెచ్చుకొంది దియా. సమాజం కోసం ఆమె పాటుపడుతున్న విధానం ఎంతోమంది నటీనటులకు ఆదర్శంగా నిలుస్తోంది. క్యాన్సర్, ఎయిడ్స్‌ బాధితులకి మానసిక స్థైర్యాన్ని ఇచ్చే లక్ష్యంతో పలు కార్యక్రమాలు చేపడుతోంది. క్రై.పెట్టా.ఎడాప్ట్, గ్రీన్‌ ఇండియా తదితర సంస్థలు చేపట్టే కార్యక్రమాల్లో దియా కూడా భాగస్వామిగా నిలుస్తోంది. స్వచ్ఛభారత్, నర్మదాబచావో ఉద్యమాలకి కూడా మద్దతునిచ్చింది.

Dia Mirza
జీరోసైజ్​ అందాలతో కుర్రకారును ఆకట్టుకునే దియా మీర్జా

సినిమానే నేర్పించింది..

దియా మీర్జా చిన్నప్పుడు ఇంట్రావర్ట్‌. ఎవ్వరితోనూ మాట్లాడకుండా ఎప్పుడూ ముభావంగా గడిపేది. ఇక మోడలింగ్, సినిమాల్లాంటివి కలలోకి కూడా వచ్చేవి కాదని చెబుతుంటుంది.

"అమ్మ చెప్పిన ధైర్యం, ఇచ్చిన ప్రోత్సాహం నన్ను ముందడుగు వేసేలా జీవితం అంటే ఏమిటో తెలిసొచ్చేలా చేసింది" అని ఓ సందర్భంలో చెప్పింది. కేవలం మన కోసమే కాకుండా నలుగురి గురించి ఆలోచించడంలోనే ఆనందం దొరుకుతోందని చెబుతోంది.

Dia Mirza
దియా హాండ్రిచ్

అంతరంగం.. ఆమె మాటల్లోనే..

  • బాల్యం ఓ మధురజ్ఞాపకం అంటుంటారు అందరూ, కారణాలేమిటో తెలియదు కానీ.. నాకు నా బాల్యం ఏమంత గొప్పగా అనిపించదు. స్కూల్, కాలేజ్‌ వాతావరణమంతా ఇరుగ్గా అనిపించేది.
  • ఉద్యోగం కోసం నలుగురిలో తిరగడం ఎప్పుడు అలవాటైందో.. అప్పుడే సమాజం గురించి, మనుషుల గురించి నేర్చుకొన్నాను. మోడలింగ్‌ నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.
  • నా సినిమాలు పరాజయాన్ని చవిచూసినప్పుడంతా పరిశ్రమ నుంచి వెళ్లిపోవాలనిపించేది. అంత కోపం వచ్చేది. కానీ ఆ వెంటనే నిర్మాతలు నా దగ్గరికొచ్చి మా సినిమాలో నటించండి అని వచ్చే వాళ్లు. ఆ విషయం నాకు అర్థమయ్యేదే కాదు. ఒకసారి మా అమ్మ కలగజేసుకొని... 'సినిమా పరాజయం వెనక నువ్వు మాత్రమే కారణం కాదు. నువ్వే కారణమనుకొంటే నిర్మాతలు ఈ రోజు నీ దగ్గరికొచ్చేవాళ్లు కాదు కదా?'అని చెప్పింది. అప్పుడు అర్థమైంది నాకు అసలు విషయం. ఇక ఆ తర్వాత మళ్లీ జయాపజయాల గురించి ఆలోంచించలేదు.
  • చదవడం, రాయడం అంటే నాకు చాలా ఇష్టం. కొన్ని ఆంగ్ల పత్రికల కోసం వ్యాసాలు కూడా రాశాను.
  • సంగీతం నాకు ప్రాణం. ఖాళీ సమయం దొరికితే మంచి మెలోడీ పాటలు వింటూ కాలక్షేపం చేస్తుంటా.
  • సినిమానే నాకు అన్నీ నేర్పింది. చిత్ర పరిశ్రమలోనే ఉంటూనే మనుషుల్ని చదవడం నేర్చుకొన్నా.
  • ప్రకృతి పరిరక్షించడం మనందరి బాధ్యత. మన పరిసరాలు బాగున్నప్పుడే మనం బాగుంటాం. అందరూ స్వార్థంతో ఆలోచించడం మొదలుపెడితే ఈ భూమిపై ఏమీ మిగలదు.
  • మా అమ్మ ఒకసారి స్పృహ తప్పి పడిపోయారు. ఆమెని అలా చూడగానే నాకు భయమేసింది. వెంటనే సల్మాన్‌ఖాన్‌ని పిలిచాను. ఆయన మా ఇంటికి దగ్గర్లోనే ఉంటాడు. హుటహుటిన వచ్చి మా అమ్మని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇంకో పదిహేను నిమిషాలు ఆలస్యమయ్యుంటే మీ అమ్మగారు కోలుకోవడం కష్టమయ్యేదని డాక్టర్లు చెప్పారు. ఆ సంఘటన తర్వాత నాకు సల్మాన్‌ఖాన్‌పై మరింత గౌరవం పెరిగింది.

ఇదీ చదవండి:'నిశ్చయ్​' వేడుకకు పవన్​.. పూల్​పార్టీలో నిహారిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.