ETV Bharat / sitara

పరీక్షలు రద్దు చేయాలని సోనూ విజ్ఞప్తి - సోనూసూద్​

కరోనా సెకండ్​ వేవ్​ విజృంభిస్తోన్న నేపథ్యంలో సీబీఎస్​ఈ ఆఫ్​లైన్​ పరీక్షలు నిర్వహించాలనుకోవడం సరైన నిర్ణయం కాదని అన్నారు బాలీవుడ్​ నటుడు సోనూసూద్​. ఇంటర్నల్​ అసెస్​మెంట్​​ ద్వారా వారిని ప్రమోట్​ చేయాలని కోరారు.

sonusudh
సోనూసూద్​
author img

By

Published : Apr 12, 2021, 3:31 PM IST

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులకు బోర్డు పరీక్షలు నిర్వహించాలనుకోవడం సరికాదని అన్నారు బాలీవుడ్​ నటుడు సోనూసూద్​. 'క్యాన్సిల్​ బోర్డ్​ ఎగ్జామ్స్'​కు తాను మద్దతుగా నిలుస్తున్నానని తెలిపారు.

ప్రస్తుత తరుణంలో సీబీఎస్​ఈ ఆఫ్​లైన్​ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకోవం సరైనది కాదని చెప్పిన ఆయన.. విద్యార్థులు కూడా ఎగ్జామ్స్​ రాయడానికి సిద్ధంగా లేరని అన్నారు. ఒకవేళ వారు పరీక్షలకు హాజరైతే కరోనా మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ఆఫ్​లైన్​ పద్ధతి ద్వారా కాకుండా ఇంటర్నల్​ అసెస్​మెంట్​ ద్వారా వారిని ప్రమోట్​ చేయాలని విజ్ఞప్తి చేశారు.

లాక్​డౌన్​లో ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన ఎంతో మంది వారి సొంతూళ్లకు చేరుకునేందుకు సోనూ ఎంతగానో కృషి చేశారు. ఆయన సొంత డబ్బులు ఖర్చు చేసి వారికి అండగా నిలిచారు. కష్టాల్లో ఉన్న ఎంతోమందిని ఇప్పటికీ ఆదుకుంటూనే ఉన్నారు.

సోనూసూద్​

ఇదీ చూడండి: ఆకాశాన్నంటిన నటుడు సోనూసూద్​ కీర్తి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.