ETV Bharat / sitara

వాళ్లిద్దరిలో ఒకర్ని పెళ్లి చేసుకోవాలనుకున్నా: రాశి - వెంకటేశ్​ను పెళ్లి చేసుకోవాలనుకున్న రాశి

పెళ్లంటూ చేసుకుంటే హీరో వెంకటేశ్​ లేదా రాజీవ్​ గాంధీనే చేసుకుంటానని హీరోయిన్​ రాశి తన తల్లిదండ్రులకు చెప్పేవారట. ఈటీవీలో 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొన్న నటి రాశి.. ఈ విషయాన్నివెల్లడించారు. వీటితో పాటే పలు ఆసక్తికర సంగతుల్ని పంచుకున్నారు.

actor raashi at ali tho saradaga talk show
'పెళ్లంటూ చేసుకుంటే వాళ్లిద్దరినే చేసుకోవాలనుకున్నా'
author img

By

Published : Nov 12, 2020, 6:31 PM IST

Updated : Nov 13, 2020, 12:00 PM IST

చిత్రపరిశ్రమలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన స్టార్​ హీరోయిన్​ రాశి. ఒక తెలుగమ్మాయి టాలీవుడ్​లో స్టార్​ హోదా సాధించడం చాలా కష్టమైన పని. కానీ, రాశి అప్పట్లోనే ఆ పని చేసి చూపించారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ మెప్పించారు. ఈ అందాల రాశి.. ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో గతంలో పాల్గొన్నప్పుడు చాలా ఆసక్తికర విషయాలతో పాటు సినీ ప్రయాణంలోని ఎదురైన అనుభవాల్ని వెల్లడించింది.

వాళ్లిద్దరినే పెళ్లి చేసుకుంటా!

పెళ్లంటూ చేసుకుంటే హీరో వెంకటేశ్​ను.. లేదంటే రాజీవ్​ గాంధీనే చేసుకుంటానని రాశి తన తల్లిదండ్రులకు చెప్పేవారట. ఈ విషయాన్ని వ్యాఖ్యాత ఆలీ ప్రస్తావించగా.. రాశి సిగ్గుపడతూ నవ్వేశారు. తాను చదువుకునే రోజుల్లో ఎవరిని పెళ్లి చేసుకుంటావు? అని పెద్దవాళ్లు సరదాగా అడిగితే హీరో వెంకటేశ్​ను పెళ్లి చేసుకుంటానని తెగేసి చెప్పేదానిని అని అన్నారు. ఆ వయసులో వెంకటేశ్​ సినిమాలు ఎక్కువగా చూడడం వల్ల అలా అనిపించేదని రాశి తెలిపారు. ఆ తర్వాత రాజీవ్​ గాంధీని వివాహం చేసుకోవాలని రాశి అనుకున్నారట.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'రంగస్థలం'లో అందుకే నటించలేదు

రామ్​చరణ్​ 'రంగస్థలం' సినిమాలో రంగమ్మత్త పాత్ర కోసం దర్శకుడు సుకుమార్​ రాశిని సంప్రదించారట. కానీ, ఆ పాత్రను తాను చేయలేనని చెప్పారు. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా వెల్లడించారు. ఆ పాత్రను పరిచయం చేసే సన్నివేశంలో అనసూయ ధరించిన చీర మోకాళ్లపైకి ఉంటుంది. రంగమ్మత్త పాత్రను సుకుమార్​ అలానే డిజైన్​ చేశారు. అయితే, ఆ విధంగా తాను చేయలేనని.. ఆ పాత్రకు తాను తగిన వ్యక్తిని కాదని రాశి అన్నారు.

Last Updated : Nov 13, 2020, 12:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.