సీనియర్ నటి ఫరూఖ్ జాఫర్(88) మృతి చెందింది. గత కొంతకాలంగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె(farrukh jaffar death).. శుక్రవారం సాయంత్రం తుదిశ్వాస విడిచింది.
1963లో వివిధ్ భారతి సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఫరూఖ్(farrukh jaffar movies).. 1981లో వచ్చిన ఉమ్రో జాన్ సినిమాతో సహాయ నటిగా మారింది. ఆ తర్వాత స్వేడ్స్, పెప్లీ లైవ్, బేర్‌ఫూట్ టూ గోవా, అలీఘడ్, సుల్తాన్, సీక్రెట్ సూపర్‌స్టార్, వాట్ విల్ పీపుల్ సే, ఫొటోగ్రాఫ్, అమ్మా కీ బోలీ, గులాబో సితాబో(gulabo sitabo review) తదితర చిత్రాల్లో నటించింది.
చివరగా 'గులాబో సితాబో'లో అమితాబ్ బచ్చన్‌కు భార్యగా నటించిన ఫరూఖ్(farrukh jaffar news).. 88 ఏళ్ల వయసులో ఫిల్మ్‌ఫేర్ అవార్డు(filmfare awards 2021) సొంతం చేసుకుంది. ఎక్కువ వయసులో ఈ అవార్డు అందుకున్న యాక్టర్‌గా రికార్డు సృష్టించింది.
ఇవీ చదవండి: