90వ దశకంలో 'ఫరీబ్', 'మెహందీ' చిత్రాల్లో నటించిన బాలీవుడ్ నటుడు ఫరాజ్ ఖాన్.. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. ప్రస్తుతం బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని తెలియజేసిన ఫరాజ్ కుటుంబీకులు ఫరాద్ అబుషేర్, అహ్మద్ షమోన్.. ఆర్థిక సాయం చేయాలని ప్రజలను కోరారు. ఏడాది నుంచి ఆయనకు ఉన్న శ్వాసకోస సమస్య, ఈ మధ్య చాలా ఎక్కువైందని తెలిపారు.
ఫరాజ్.. ఐసీయూలో అపస్మారక స్థితిలోనే ఉన్నారని, మరో 10 రోజుల చికిత్స అవసరమని ఫరాద్, అహ్మద్ తెలిపారు. అందుకోసం దాదాపు రూ.25 లక్షలు ఖర్చవుతుందని అన్నారు. ఈయన చికిత్స కోసం విరాళమివ్వాలని నటి పూజా భట్ విజ్ఞప్తి చేసింది. ఇప్పటివరకు రూ.7 లక్షల మేర విరాళం పోగైంది.
-
Please share and contribute if possible. I am. Would be grateful if any of you can as well. 🙏https://t.co/UZSbvA2sZb
— Pooja Bhatt (@PoojaB1972) October 14, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Please share and contribute if possible. I am. Would be grateful if any of you can as well. 🙏https://t.co/UZSbvA2sZb
— Pooja Bhatt (@PoojaB1972) October 14, 2020Please share and contribute if possible. I am. Would be grateful if any of you can as well. 🙏https://t.co/UZSbvA2sZb
— Pooja Bhatt (@PoojaB1972) October 14, 2020