Whatsapp New Features Today : ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్.. కొత్త ఫీచర్లను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకురావడంలో ముందు వరుసలో ఉండే వాట్సాప్.. ప్రైవసీకి పెద్ద పీట వేస్తూ మరో మూడు ఫీచర్లను పరిచయం చేయనుంది. వాటి గురించి తెలుసుకుందాం.
ఇకపై వాయిస్ మెసేజెస్ కూడా..
View Once Voice Message Whatsapp : ఇప్పటివరకు వ్యక్తిగత చాట్‌ల భద్రతలో భాగంగా ఎన్నో ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చిన వాట్సాప్.. 'వ్యూ వన్స్ ఫర్ వాయిస్ నోట్స్' పేరుతో కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది. వాట్సాప్‌లో ఇప్పటికే ఫొటోలు, వీడియోలకు సంబంధించి 'వ్యూ వన్స్' ఫీచర్ అందుబాటులో ఉంది. ఏదైనా ఫొటో లేదా వీడియోను ఒకసారి మాత్రమే చూడొచ్చు. దాన్ని స్క్రీన్‌షాట్ తీసుకోవడం కూడా కుదరదు. ఇప్పుడు ఇదే ఫీచర్‌ను వాయిస్ నోట్ ఫార్మాట్‌కు సైతం యాడ్ చేయనుంది.
Voice Notes Whatsapp Features : వాయిస్ రికార్డ్‌ను సెండ్ చేసే సమయంలోనే 'వ్యూ వన్స్' ఆప్షన్ ఎంపిక చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలను వెబ్‌ఇన్ఫో తన బ్లాగ్‌లో షేర్ చేసింది. వ్యూవన్స్‌లో పంపే వాయిస్ మెసేజ్‌లను మరోసారి వినటానికి వీలుండదని తెలిపింది. ప్రస్తుతం కొంతమంది ఆండ్రాయిడ్ బీటా వినియోగదారులకు మాత్రమే ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. పూర్తిస్థాయిలో ఎప్పుడు తీసుకొస్తారనే విషయమై స్పష్టత ఇవ్వలేదు.
చాట్‌ను లాక్ వేయడమే కాదు.. దాచేయొచ్చు కూడా!
How To Hide Lock Chat In Whatsapp : పర్సనల్ చాట్‌ను ఇతరులు చూడకుండా చాట్ లాక్ ఫీచర్‌ను తీసుకొచ్చిన వాట్సాప్.. ఇప్పుడు మరో కొత్త ప్రైవసీ ఫీచర్‌ను తీసుకురానుంది. లాక్ చేసిన చాట్‌ను హైడ్ చేసేందుకు ఆప్షన్‌ను ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం లాక్ చేసిన చాట్లు ఉన్నట్లు వాట్సాప్‌లో కనిపిస్తోంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా సీక్రెట్ కోడ్‌ను సెర్చ్ బార్లో ఎంటర్ చేస్తేనే లాక్ చేసిన చాట్లు కనిపిస్తాయి. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండగా.. త్వరలోనే అందరికీ విస్తరించనుంది వాట్సాప్.
కొత్త ఫీచర్.. ఐపీ అడ్రెస్ సేఫ్
Whatsapp IP Address Security Feature : పై రెండింటితోపాటు యూజర్ల భద్రత కోసం వాట్సాప్ ఇంకో కొత్త ఫీచర్‌ను పరిచయం చేయనుంది. వాట్సాప్ కాల్ చేస్తున్నప్పుడు ఐపీ అడ్రస్‌ను కాపాడటం దీని ఉద్దేశం. సైబర్ మోసగాళ్లు లొకేషన్‌ను గుర్తించకుండా అడ్డుకుంటుంది. కాకపోతే ఈ ప్రైవసీ ఫీచర్ వల్ల వాట్సాప్ కాల్ నాణ్యత కాస్త తక్కువగా ఉండొచ్చు. యూజర్ల లొకేషన్, ఐపీ అడ్రస్‌ను కనుక్కోవడానికి చేసే ప్రయత్నాలను ఇది తిప్పికొడుతోంది. అజ్ఞాత వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్ విషయంలో ఇదెంతగానో భద్రత కల్పిస్తుంది. ప్రైవసీ సెటింగ్స్‌లో అడ్వాన్స్‌డ్ సెగ్మెంట్లో ఈ ఫీచర్ ఉంటుంది. దీన్ని ప్రస్తుతం వాట్సాప్ బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులోకి తెచ్చింది వాట్సాప్.
WhatsApp Dual Account Feature : ఒకే ఫోన్లో రెండు వాట్సాప్ ఖాతాలు.. ఎలా క్రియేట్ చేయాలంటే?
WhatsApp Secret Code Feature : వాట్సాప్ సీక్రెట్ కోడ్‌తో.. మీ ఛాట్స్ మరింత భద్రం!