ETV Bharat / science-and-technology

వాట్సాప్​లో మెసేజ్ ఫార్వర్డింగ్ ఇక కష్టమే! ఒకేసారి ఐదుగురికి కాదు ఒకరికే!! - వాట్సాప్​ కొత్త ఫీచర్​

WhatsApp new features: అసత్య వార్తలు, వదంతుల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రముఖ సామాజిక మాధ్యమ దిగ్గజం మరో కొత్త ఫీచర్​ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒక సందేశాన్ని ఇప్పటి వరకు ఒకేసారి ఐదుగురికి ఫార్వర్డ్​ చేసే వీలు ఉండగా.. ఇకపై అలా కుదరదు. వాటిపై పరిమితులు విధించింది వాట్సాప్​. ఆ పరిమితులు ఏమిటి? కొత్త ఫీచర్​ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?

WhatsApp new feature
వాట్సాప్​
author img

By

Published : Apr 4, 2022, 10:17 AM IST

WhatsApp new features: వినియోగదారులకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది ప్రముఖ సామాజిక మాధ్యమ దిగ్గజం వాట్సాప్​​. తాజాగా స్పామ్​, తప్పుడు సమాచార వ్యాప్తిని అరికట్టేందుకు మరో కొత్త ఫీచర్​ను తీసుకొచ్చింది. వాట్సాప్​లో ఇప్పటి వరకు ఓ సందేశాన్ని ఐదుగురికి ఒకేసారి ఫార్వర్డ్​ చేయొచ్చు. వాటికి 'ఫార్వర్డెడ్​' అనే ట్యాగ్​ వస్తుంది. అయితే.. స్పామ్​ను తగ్గించే ఉద్దేశంతో తీసుకొస్తున్న ఈ కొత్త ఫీచర్​తో మెసేజ్​లను ఇతర గ్రూపుల్లో, వ్యక్తిగత చాట్​లకు పంపటంపై పరిమితులు విధించింది. 'ఫార్వర్డెడ్​ మెనీ టైమ్స్​' ట్యాగ్​తో కేవలం ఒకసారి ఒకే గ్రూప్​ లేదా ఒక వ్యక్తికి షేర్​ చేయొచ్చు.

గత నెలలో అందుబాటులోకి తీసుకొచ్చిన వాట్సాప్​ బీటా వర్షన్ ఆడ్రాయిడ్​ 2.22.7.2 అప్డేట్​లో సందేశాలను ఇతరులకు పంపించే వాటిపై పరిమితులు విధించింది. వాట్సాప్​ సందేశాలపై పరిమితులు విధించటంపై వినియోగదారుల్లో వ్యతిరేకత ఉన్నప్పటికీ.. కొత్త ఫీచర్​ను తీసుకురావటాన్ని సమర్థించుకుంది సంస్థ. 'ఇకపై సందేశాలు ఒకసారి ఒకే గ్రూప్​ లేదా వ్యక్తికి ఫార్వర్డ్​ చేయొచ్చు. వాట్సాప్​లో సంభాషణలను వ్యక్తిగతంగా ఉంచటంలో ఇది సహాయపడుతుంది. అలాగే వదంతులు, వైరల్​ మెసేజెస్​, అసత్య వార్తల వ్యాప్తిని తగ్గించేందుకు సాయపడుతుంది.' అని వాట్సాప్​ పేర్కొంది.

ఎర్రర్​ మెసేజ్​: ఎవరైన ఫార్వర్డ్​ సందేశాన్ని రెండు లేదా అంతకన్నా ఎక్కువ గ్రూపులకు పంపాలని ప్రయత్నిస్తే ఎర్రర్​ మెసేజ్​ వస్తుంది. 'ఫార్వర్డెడ్​ మెసేజ్​లు కేవలం ఒకసారి ఒకే గ్రూప్​లోకి పంపించవచ్చు' అనే సందేశంతో పాపప్​ మెనూ కనిపిస్తుంది. వాట్సాప్​బీటాఇన్ఫో ప్రకారం ఈ కొత్త ఫీచర్​ను ఐఓఎస్​ ఆపరేటింగ్​ సిస్టమ్స్​లోనూ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆండ్రాయిడ్​ బీటా వర్షన్​లో తీసుకొచ్చిన నెల రోజుల తర్వాత ఐఓఎస్​ ప్రయత్నాలు చేపట్టింది. వాట్సాప్​ ఐఓఎస్ బీటా వర్షన్​​ 22.7.0.76లో ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఈ కొత్త ఫీచర్​ త్వరలోనే అందరికి అందుబాటులోకి రానుంది.

WhatsApp
ఎర్రర్​ మెసేజ్​తో కనిపించే పాపప్​ మెనూ

ఇదీ చూడండి: ఫోన్‌ నంబర్‌ సేవ్ చేయకుండానే.. వాట్సాప్ చాట్, వాయిస్‌ కాలింగ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.