Vodafone Idea Rs 202 Plan : దేశంలో మూడో అతిపెద్ద టెలికాం ఆపరేటర్ వొడాఫోన్ ఐడియా తమ వినియోగదారుల కోసం కొత్త రూ.202 ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త ప్లాన్ వినియోగదారులకు గొప్ప వినోద అనుభవాన్ని అందించడంపై దృష్టి పెట్టింది. ప్రస్తుతానికి ఈ ప్లాన్ వీఐ మొబైల్ యాప్‌లో మాత్రమే కనిపిస్తోంది. కనుక యూజర్లు ఈ యాప్ ద్వారా మాత్రమే వీఐ మూవీస్ అండ్ టీవీ ప్రో సబ్‌స్క్రిప్షన్‌ను కొనుగోలు చేయడానికి వీలవుతుంది. ఈ ప్లాన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
వొడాఫోన్ ఐడియా ప్లాన్ రూ.202
వొడాఫోన్ ఐడియా రూ.202 ప్లాన్ ప్రత్యేకంగా మూవీ లవర్స్ కోసం తెచ్చినది. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు 13+ ఓటీటీ ఛానల్స్ చూడవచ్చు. వీఐ కస్టమర్లకు మాత్రమే ఈ ప్లాన్ ప్రయోజనాలు అందుతాయి. ఈ ప్లాన్ ద్వారా సర్వీస్ వ్యాలిడిటీ, వాయిస్ కాలింగ్, డేటా లాంటివి లభించవు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ కేవలం ఒక నెల మాత్రమే.
మొబైల్ యాప్‌లో వీఐ 'వీ మూవీస్ అండ్ టీవీ ప్రో' సబ్స్క్రిప్షన్ నెలపాటు ఉంటుంది. ఎలాంటి అదనపు ఖర్చులు లేకుండా 13 ఓటీటీ ఛానల్స్ కంటెంట్‌ను అస్వాదించవచ్చు. ఈ రూ.202 ప్లాన్ కొనుగోలు చేసిన వినియోగదారులు సోనీలివ్, జీ5, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, సన్NXT, హంగామా లాంటి 13 ఓటీటీ ఛానల్స్ కంటెంట్‌ను చూడవచ్చు.
ఎయిర్ టెల్, జియో ఓటీటీ ఆఫర్లకు పోటీగా వీఐ ఈ కొత్త ప్లాన్‌ను తీసుకువచ్చింది. జియో ఇటీవలే తమ యూజర్ల కోసం జియో టీవీ ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకురాగా, ఎయిర్టెల్ చాలా కాలంగా - ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం అందిస్తోంది. అయితే వీఐ యూజర్లు ఈ సరికొత్త రూ.202 ప్లాన్‌ను రీఛార్జ్ చేయడానికి, యాక్టివ్ బేస్ ప్రీపెయిడ్ లేదా పోస్ట్ పెయిడ్ మొబైల్ ప్లాన్‌ను కలిగి ఉండడం అవసరమా? లేదా? అనే విషయంలో స్పష్టత లేదు. అందువల్ల మీ ప్లాన్ కొనుగోలు చేసే ముందు, బేస్ యాక్టివ్ ప్రీపెయిడ్ ప్లాన్స్ రీఛార్జ్ చేసుకోవడం ఎంతైనా మంచిది.
అమెజాన్ ప్రైమ్ Lite ప్లాన్‌పై భారీ డిస్కౌంట్ - మిగిలిన కంపెనీల ప్లాన్స్ ఎలా ఉన్నాయంటే?
మరణం ఎప్పుడో చెప్పే ఏఐ టూల్! 78% పర్ఫెక్ట్ ప్రిడిక్షన్! ఎలా పనిచేస్తుందంటే?