ప్రస్తుతం వాట్సాప్ వినియోగం సర్వసాధారణమైపోయింది. ఇందులో టెక్స్ట్ సందేశాలతో పాటు .. భావాలను వ్యక్తపరిచేందుకు ఎమోజీలను వినియోగిస్తుంటాం. ఇప్పుడు ఈ భావాలను మరింత ప్రభావవంతంగా వ్యక్తం చేసేందుకు యానిమేటెడ్ స్టిక్కర్స్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది వాట్సాప్. ఇప్పటి వరకు థర్డ్‌పార్టీ యాప్ ద్వారా ఈ తరహా స్టిక్కర్లను వినియోగించేవారు కొందరు యూజర్లు.
స్టిక్కర్లతో మరింతగా ఈజీ..
యానిమేటెడ్ స్టిక్కర్లను అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్... ఈ గ్రాఫిక్స్‌తో భావాలను మరింత లోతుగా వ్యక్తపరచవచ్చని అభిప్రాయపడింది. యూజర్లను కచ్చితంగా ఈ ఫీచర్ ఆకట్టుకుంటుందని ఆశిస్తోంది.
స్టిక్కర్లు వినియోగించడం ఎలా?
వాట్సాప్ స్టిక్కర్లను వినియోగించేందుకు చాట్ ఓపెన్ చేసి... అందులో ఎమోజీ బటన్‌ను నొక్కాలి.
ఇప్పటి వరకు అక్కడ ఎమోజీ, జిఫ్ ట్యాబ్‌లు కనిపించేవి. ఇకపై వాటి పక్కన స్టిక్కర్ ట్యాబ్ కనిపిస్తుంది. దానిని నొక్కాలి.
ఆ పక్కనే '+' సింబల్ కనిపిస్తుంది. దానిని నొక్కితే రకరకాల స్టిక్కర్ ప్యాక్‌లు వస్తాయి. అందులో మీకు నచ్చిన వాటిని డౌన్లోడ్ చేసుకుని చాటింగ్‌లో ఉపయోగించుకోవచ్చు. మీకు వద్దనుకుంటే వాటిని డిలీట్ చేసే సదుపాయం కూడా ఉంది.
ఇదీ చూడండి:జియో ఎఫెక్ట్: భారత్ కోసం 'జూమ్' ప్రత్యేక ప్లాన్