ETV Bharat / science-and-technology

ఇలా చేస్తే మీ వాట్సాప్​ డేటా సురక్షితం

author img

By

Published : Dec 5, 2022, 8:05 AM IST

వాట్సాప్​లో మన చాటింగ్​ సురక్షితమే అని అనుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. ఎన్నో సెక్యూరిటీ ఫీచర్స్​ అందుబాటులో ఉన్నప్పటికి వాటిని మనం సద్వినియోగం చేసుకోకుంటే మన డేటా హ్యాకర్ల చేతిలో పడ్డట్లే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఆ డేటాను కాపాడుకోవడం ఎలా..

tips to make Whatsapp chats more secure
Whatsapp

ప్రస్తుత జనరేషన్​లో హ్యాకింగ్​ అనేది సర్వసాధారణం అయిపోయింది. ఓ చిన్న లింక్​ నొక్కితే చాలు మన డేటా అంతా ఇట్టే కాజేస్తారు సైబర్​ నేరగాళ్లు. మన డేటా భద్రతకు శాశ్వత పరిష్కారం లేకపోయినప్పటికి ఈ చిన్ని చిట్కాలతో తాత్కాలికంగా భద్రపరుచుకోవచ్చు. అది ఎలా అంటే..

చాట్​ ఎన్​క్రిప్షన్​ను చెక్​ చేసుకోవడం..
సాధారణంగా అన్ని వాట్సాప్ చాట్‌లు డిఫాల్ట్‌గా ఎన్‌క్రిప్ట్ అయ్యుంటాయి. అయినా సరే ఏదైనా ముఖ్యమైన సమాచారాన్ని షేర్​ చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు చెక్​ చేసుకుని పంపించాలి.

  • ఎన్‌క్రిప్షన్‌ను వెరిఫై చేయడానికి, చాట్ విండోలో కాంటాక్ట్ పేరుపై ట్యాప్ చేసి, ఆపై ఎన్‌క్రిప్షన్‌పై ట్యాప్ చేయండి.

టూ ఫ్యాక్టర్​ అథెెంటికేషన్​..
మన డేటాను వేరొకరు యాక్సెస్​ చేయకుండా ఉండాలంటే ఈ టూ ఫ్యాక్టర్​ అథెెంటికేషన్​ను మన అకౌంట్​కు జత చేయడం ఎంతో అవసరం.

టూ స్టెప్​ వెరిఫికేషన్​ ఎనేబుల్​ చేయడానికి ఈ స్టెప్స్​ ఉపయోగించండి :

  • వాట్సాప్​ మెనూలోకి వెళ్లాలి.
  • ఆ తర్వాత సెట్టింగ్స్​లో అకౌంట్​ మెనూను ఓపెన్​ చేస్తే అక్కడ టూ ఫ్యాక్టర్​ అథెెంటికేషన్​​ ఆఫ్షన్​ను ఎనేబుల్​ చేయండి.

సెక్యూరిటీ నోటిఫికేషన్లు ఆన్​ చేయడం..
ఇప్పుడున్న చాట్​ను ఏదైనా కొత్త డివైజ్​ ద్వారా యాక్సెస్​ చేస్తే మన ఫోన్​కు ఓ కొత్త సెక్యూరిటీ కోడ్​ వస్తుంది. అంతేకాకుండా సెక్యూరిటీ కోడ్ మారినప్పుడల్లా ఫోన్​కు నోటిఫికేషన్ వస్తుంది.

  • దీన్ని ఎనేబుల్ చేయడానికి, వాట్సాప్​ సెట్టింగ్స్​లోకి వెళ్లాలి.
  • అకౌంట్​ మెనూ ఓపెన్​ చేసి అందులో సెక్యూరిటీ నోటిఫికేషన్‌లోకి వెళ్లాలి.
  • ఆపై 'షో సెక్యూరిటీ నోటిఫికేషన్' ఆప్షన్​పై క్లిక్ చేయాలి.

క్లౌడ్​ బ్యాకప్స్​ను ఎన్​క్రిప్ట్​ చేయండి
గూగుల్​ డ్రైవ్​లో ఉన్న వాట్సప్​ డేటా డిఫాల్ట్​గా ఎన్​క్రిప్ట్​ అయ్యి ఉండడు. దీని వల్ల మన చాట్​కు భద్రత ఉండదు. అందుకోసం మనం చాట్​ బ్యాకప్​ పెట్టే ముందు దాన్ని ఎన్​క్రిప్ట్​ చేయాలి. అది ఎలా అంటే.

  • వాట్సాప్​ సెట్టింగ్స్​కు వెళ్లాలి.
  • అందులో చాట్​ అనే ఆప్షన్​ను సెలెక్ట్​ చేసుకోవాలి.
  • చాట్​లో బ్యాకప్​ అనే ఆప్షన్​ ఉంటుంది దాన్ని సెలెక్ట్​ చేసుకోవాలి.
  • ఆపై బ్యాకప్​ ఎన్​క్రిప్షన్​ను టర్న్​ ఆన్​ చేస్తే దాని ద్వారా మన చాట్​ను పాస్​వర్డ్​తో లాక్​ చేసుకోవచ్చు.

తెలియని లింక్స్​తో జర భద్రం..
ఇప్పటి కాలంలో వాట్సాప్​లో విరివిగా షేర్​ అవుతున్న లింక్స్​ వల్ల ఎన్నో ఇబ్బందుల్లో చిక్కుకున్న వారిని చూస్తుంటాం. అంతే కాకుండా వచ్చిన ప్రతి లింక్​ మంచిదో.. కాదో అన్న విషయం మనకు తెలియదు. అందుకనే వాటిని ఓపెన్​ చేయకపోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. వీటిని క్లిక్ చేయకుండా నిరోధించడానికి లింక్‌ను కాపీ చేసి నార్తన్​ సేఫ్​ వెబ్​, ఫిష్​ ట్యాంక్​ లాంటి ఇతర సైట్‌లలో చెక్​ చేయండి. ఈ అలవాటు ద్వారా మీరు హానికరమైన లింక్‌లపై క్లిక్ చేయడం మానేస్తారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.