జర్మనీకి చెందిన సెన్న్హైసర్ సంస్థ తమ కొత్త ఆడియో ప్రాడక్ట్‌లను భారత విపణిలోకి విడుదల చేసింది. ఇందులో భాగంగా సెన్న్హైసర్ ఐఈ 900 ఇన్ (Sennheiser IE 900) ఇయర్ఫోన్ల అమ్మకం ప్రారంభించింది. అయితే ఈ ఇయర్లఫోన్ల ధర రూ. 1,29,900గా ఉండటం విశేషం. వీటిని సంస్థ ఆన్లైన్ స్టోర్‌లో ముందుగా ఆర్డర్ చేసుకున్నవారికే అందిస్తోంది సెన్న్హైసర్.
![ear phones](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12491130_ear-phones.jpg)
సెన్న్హైసర్ ఐఈ 900.. సంస్థకు చెందిన ఎక్స్3ఆర్ సిస్టమ్‌తో వస్తోంది. ఇందులో మల్టీ డ్రైవర్‌కు బదులుగా వన్ డ్రైవర్ ప్రిన్సిపుల్‌ను వాడారు. దీని వల్ల ఆడియో వినే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడవు. దీంతో పాటు.. 7మిల్లీ మీటర్ల ట్రూ రెస్పాన్స్ ట్రాన్స్‌డ్యూసర్‌ను ఇందులో అమర్చడం విశేషం.
ఎక్కువ శబ్దంతో ఆడియో వినేవారిని దృష్టిలో పెట్టుకుని ఈ ఇయర్‌ఫోన్స్ తయారు చేసినట్లు సంస్థ పేర్కొంది. అదే సమయంలో ఐఈ 900లో అతి స్వల్ప శబ్దాలు కూడా వినబడేలా ట్రాన్య్డ్యూసర్ను అభివృద్ధి చేసినట్లు పేర్కొంది.
ఇదీ చదవండి:యాపిల్ కొత్త ఇయర్ ఫోన్స్‌కు ఎందుకంత ధర?