ETV Bharat / science-and-technology

రూ.30వేల లోపు మొబైల్​​ కొనాలా? కొద్దిరోజులు వెయిట్​ చేస్తే చాలు.. త్వరలో సూపర్​ ఫోన్స్​​!! - కొత్త స్మార్ట్​ఫోన్లు లిస్ట్​

స్మార్ట్ ఫోన్ల విపణిలోకి సరికొత్త ఫీచర్లతో కొత్త మోడల్స్​ వస్తూనే ఉన్నాయి. వినియోగదారులకు మరింత అనుభూతిని, ఆనందాన్ని పంచడానికి నయా ఫీచర్లతో అనేక కంపెనీలు స్మార్ట్ ఫోన్లను తయారు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే త్వరలో మార్కెట్​లోకి రానున్న స్మార్ట్ ఫోన్లేంటో తెలుసుకుందాం.

Five upcoming mid range phones that are worth the wait in 2023

author img

By

Published : Apr 17, 2023, 5:35 PM IST

ప్రస్తుత రోజుల్లో స్మార్ట్​ఫోన్ల వినియోగం బాగా పెరుగుతోంది. అందుకే మొబైల్ కంపెనీలు కూడా మార్కెట్లోకి ఇప్పుడు అందుబాటులో ఉన్న ఫోన్లకు దీటుగా కొత్త మోడల్స్​ను తయారు చేస్తున్నాయి. ప్రస్తుతం ఫ్లాగ్ షిప్ గ్రేడ్ ఫీచర్లతో వచ్చే ఫోన్ల పట్ల వినియోగదారులు ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నారు. దీంతో వన్ ప్లస్, శాంసంగ్, రియల్ మీ, పోకో లాంటి బ్రాండెడ్ మొబైల్ కంపెనీలు ఫ్లాట్ షిప్ గ్రేడ్ ఫీచర్లతో కూడిన మొబైల్స్​ను తక్కువ రేటులో అందుబాటులోకి తెస్తున్నాయి. అయితే ఈ ఏడాది మార్కెట్లోకి రాబోతున్న ఫోన్ల గురించి తెలుసుకుందాం. అయితే వీటిన్నంటి ధర రూ.30000 వరకు ఉండవచ్చు!

వన్ ప్లస్ నార్డ్3:
2023లో అందరిలో ఆసక్తిని రేపుతున్న మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లలో వన్ ప్లస్​ నార్డ్​ 3 ఒకటి. చైనాలో వన్ ప్లన్ ఏస్ 2వీ పేరుతో, ఇండియాతో పాటు మిగిలిన ప్రపంచ దేశాల్లో వన్ ప్లస్ నార్డ్ 3 పేరుతో ఈ ఫోన్ రాబోతోంది. మిడ్ టెక్ డైమెన్సిటీ 9000 ఎస్ఓసీ, 1.5కే రెజల్యూషన్ AMOLED, 120Hz రీఫ్రెష్ రేట్, 64MP ప్రైమరీ సెన్సార్​తో కూడిన ట్రిపుల్ కెమెరా వంటి ఫీచర్లు ఉండబోతున్నాయి. ఇందులో 16MP సెల్ఫీ కెమెరా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జులై తర్వాత ఈ ఫోన్​ లాంఛ్​ అవ్వనుందని సమాచారం. దీని ధర ఇండియాలో దాదాపు రూ.30వేల వరకు ఉంటుందని అంచనా.

పోకో ఎఫ్5:
మరికొద్దిరోజుల్లో ఈ ఫోన్​ను పోకో ఇండియా లాంఛ్ చేయనుంది. డ్రాగన్ 7+ జెన్ ఎస్ఓసీ, AMOLED స్క్రీన్, 120Hz రీఫ్రెష్ రేట్, గ్లాస్ శాండ్ విచ్ డిజైన్ వంటి ఫీచర్లతో ఈ ఫోన్ రానుంది. 64MP ప్రైమరీ కెమెరా, 4K వీడియో రికార్డింగ్ లాంటి ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి. దీని ధర కూడా రూ.30వేల దగ్గర్లో ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా.

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్54:
శాంసంగ్ గెలాక్సీ ఏ​54 మాదిరి ఫీచర్లతో శాంసంగ్ గ్యాలక్సీ ఎఫ్54 రాబోతున్నట్లు సమాచారం. ఎక్సినోస్ 1380 ఎస్ఓసీతో 8జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్​తో ఈ ఫోన్ రానుంది. ఇందులో 108MP ప్రైమరీ సెన్సార్​తో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 6000mAh బ్యాటరీ అందుబాటులో ఉండనుంది.

రియల్ మీ జీటీ నియో 5:
ఇటీవలే జరిగిన మొబైల్ వరల్డ్ కాన్ఫరెన్స్​లో రియల్ మీ జీటీ నియో 5.. ప్రపంచంలోనే వేగంగా ఛార్జింగ్​ ఎక్కే ఫోన్​గా నిలిచింది. ఇండియాలో మరికొద్ది నెలల్లో ఈ ఫోన్ లాంఛ్ కానుంది. స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ఎస్ఓసీతో రాబోతున్న ఈ స్మార్ట్ ఫోన్​లో వెనకాల ఎల్ఈడీ స్వ్కేర్ ఉండటం విశేషం. 144Hz FHD+ AMOLED డిస్ ప్లే ఇన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 50MP ప్రైమరీ సెన్సార్ కెమెరా ట్రిపుల్ కెమెరా లాంటి ఫీచర్లు ఉండనున్నాయి. 4600mAh బ్యాటరీ, 240W ఛార్జింగ్​తో 10నిమిషాల్లో బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్ అవ్వనుంది.

నథింగ్ ఫోన్ (2):
ఫ్లాగ్ షిప్ స్నాప్ డ్రాగన్ 8 సిరీస్ ప్రాసెసర్​తో నథింగ్​ ఫోన్​(2).. త్వరలోనే లాంఛ్​ అవ్వనుంది. అయితే గ్లింఫ్ లైటింగ్, వైర్ లెస్ ఛార్జింగ్ లాంటి ఫీచర్లు మినహా మిగతా అంతా నథింగ్ ఫోన్ (1) మాదిరిగా ఉంటాయని సమాచారం. మెటల్ అండ్ గ్లాస్ శాండ్ విచ్ డిజైన్​తో రాబోతున్న ఈ స్మార్ట్ ఫోన్ నథింగ్ ఫోన్ (1) కన్నా కాస్త ధర ఎక్కువేనని టాక్.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.