ETV Bharat / science-and-technology

ఫేస్​బుక్​, ఇన్​స్టాలో లైక్‌లను మాయం చేసేయండిలా..!

ఫేస్​బుక్​, ఇన్​స్టాగ్రామ్​లలో ఉన్న లైక్​ ఫీచర్​ కొంత మంది యూజర్స్​కు ఉపయోగకరంగా ఉంటే మరికొందరికి చికాకు తెప్పిస్తుంది. ఇందుకోసమే లైక్స్​ హైడ్​ చేసే ఫీచర్​ను (instagram hide likes) ప్రవేశపెట్టాయి ఆ సంస్థలు. మరి ఈ లైక్‌ సంఖ్యను ఎలా హైడ్ చేయాలో తెలుసుకుందాం.

instagram hide likes
ఫేస్​బుక్​, ఇన్​స్టాల్లో లైక్‌లను మాయం చేసేయండిలా..!
author img

By

Published : Aug 22, 2021, 4:52 PM IST

సోషల్‌ మీడియా మనం షేర్ చేసే ఫొటోలు, వీడియోలు, టెక్ట్స్‌కి ఎన్ని లైక్స్‌, కామెంట్స్ వచ్చాయనేది ఎంతో ముఖ్యం. కొన్నిసార్లు వాటి ఆధారంగానే సదరు పోస్ట్ పాపులారిటీని నిర్ణయిస్తారు. అయితే ఈ లైక్స్‌ ఫీచర్‌ కొంత మంది యూజర్స్‌కి ఉపయోగకరంగా ఉంటే మరికొందరికి చికాకు తెప్పిస్తుందట. దీంతో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాంలో లైక్స్‌ కనిపించకుండా హైడ్‌ చేసేలా (instagram hide likes) కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనివల్ల యూజర్స్‌కి తమ ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాం పేజ్‌లపై మరింత నియంత్రణ ఉంటుందని ఫేస్‌బుక్ తెలిపింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రాం తన బ్లాగ్‌లో కొత్త ఫీచర్ తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.

"ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్‌లకు పబ్లిక్ లైక్ సంఖ్యను హైడ్‌ చేసేలా కొత్త ఫీచర్‌ తీసుకొస్తున్నాం. దానివల్ల యూజర్‌ తమకి ఏది కావాలో దాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుంది. చాలా మంది యూజర్స్‌, టెక్ నిపుణులు లైక్‌ల సంఖ్య గురించి విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వాటిని చూడకపోవడం వల్ల ఉపయోగకరంగా ఉందని కొందరు, లైక్‌ల సంఖ్య తమకు చికాకుగా ఉందని మరికొందరు తెలిపారు. అలానే లైక్‌ల ఆధారంగా చాలా మంది యూజర్స్ ట్రెండింగ్‌లో ఉన్న అంశాలను గుర్తిస్తున్నామని వెల్లడించారు. దీంతో ఎలాంటి అంశాలను ఎంచుకోవాలి..ఏవి పాపులర్ అనేది నిర్ణయించుకునే అవకాశం యూజర్స్‌కే ఇస్తున్నాం" అని ఇన్‌స్టాగ్రాం తెలిపింది. మరి లైక్‌ సంఖ్యను ఎలా హైడ్ చేయాలో తెలుసుకుందాం.

ఇన్‌స్టాగ్రాం

  • యాప్‌ ఓపెన్ చేసిన తర్వాత సెట్టింగ్స్‌లోకి వెళితే ప్రైవసీ ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే పోస్ట్స్‌ అనే ఆప్షన్ కనిపిస్తుంది.
  • దాన్ని ఓపెన్ చేసిన తర్వాత మీకు ‘హైడ్ లైక్ అండ్ వ్యూ కౌంట్’ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఎనేబుల్ చేసుకుంటే ఇన్‌స్టాగ్రాంలో మీ పోస్ట్‌లకు వచ్చే లైక్స్ కనిపించవు.
    instagram hide likes
    ఇన్​స్టాగ్రామ్​లో సెట్టింగ్స్​
    instagram hide likes
    ఇన్​స్టాగ్రామ్​లో హైడ్​ లైక్​ కౌంట్​
  • అలానే మీరు గతంలో షేర్ చేసిన పోస్ట్‌లకు వచ్చిన లైక్‌లను హైడ్ చేయాలంటే ఏం చేయాలో చూద్దాం. ముందుగా మీరు ఏ పోస్ట్‌ లైక్‌లను హైడ్ చేయాలకుంటున్నారో దానికి కుడివైపు పైభాగంలో ఉన్న మూడు డాట్స్‌పై క్లిక్ చేయాలి.
  • తర్వాత కొన్ని ఆప్షన్స్‌తో మీకు పాప్‌-అప్‌ విండో కనిపిస్తుంది. అందులో మీకు ‘హైడ్‌ లైక్‌ కౌంట్’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే మీ పోస్ట్‌కి వచ్చిన లైక్స్ కనిపించవు. ఒకవేళ మీకు లైక్స్ కావాలనుకంటే హైడ్‌ లైక్‌ ఆప్షన్స్‌ని డిసేబుల్ చేస్తే సరిపోతుంది.

ఫేస్‌బుక్‌

  • ఫేస్‌బుక్‌ యాప్‌లో సెట్టింగ్స్‌ అండ్ ప్రైవసీలోకి వెళ్లి సెట్టింగ్స్‌ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అది ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే రియాక్షన్ ప్రిఫరెన్సెస్ అనే ఆప్షన్ ఉంటుంది.
  • దానిపై క్లిక్‌ చేస్తే హైడ్ నంబర్‌ ఆఫ్ రియాక్షన్స్ అనే ఆప్షన్ కింద ‘ఆన్‌ పోస్ట్స్‌ ఫ్రమ్‌ అథర్స్’, ‘ఆన్‌ యువర్ పోస్ట్స్‌’ అనే రెండు ఆప్షన్స్ ఉంటాయి.
  • మొదటి ఆప్షన్‌ని ఎనేబుల్ చేస్తే ఇతరుల పోస్టులకు వచ్చే లైక్స్‌ కనిపించవు. అలానే రెండోది ఎనేబుల్ చేస్తే కేవలం మీరు చేస్తే పోస్ట్‌లకు వచ్చే లైక్‌లు మాత్రమే కనిపించవు. అలా ఫేస్‌బుక్‌లో కూడా లైక్‌ల సంఖ్యను కనిపించకుండా చెయ్యొచ్చు. మీకు లైక్‌లు కనిపించాలంటే వాటిని డిసేబుల్ చేస్తే సరిపోతుంది.
    instagram hide likes
    ఫేస్​బుక్​లో లైక్స్​ మాయం చేయాలంటే ఇలా..

ఇదీ చదవండి : MaskFone: ఈ మాస్క్​తో పాటలు, మాటలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.