ETV Bharat / science-and-technology

వాట్సాప్​ మెసేజ్​ బుక్​మార్క్.. మీకు తెలుసా? - Whatsapp latest news

వాట్సాప్​లో బుక్​మార్క్​ ఫీచర్​ గురించి మీకు తెలుసా? ఒకవేళ తెలియకపోతే ఈ స్టోరీ చదివేయండి. దీని వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో కూడా తెలుసుకోండి.

How to bookmark a message in Whatsapp
వాట్సాప్​
author img

By

Published : Aug 1, 2021, 5:21 PM IST

రోజూ వాట్సాప్​లో ఎంతో మందితో ఛాట్ చేస్తుంటాం. డాక్యుమెంట్‌లు, ఫొటోలు, వీడియోలు, ఆడియో మెసేజ్‌లు ఇతరులకు పంపుతాం. వాటిలో ముఖ్యమైన సమాచారం ఉంటే డిలీట్ చేయకుండా వదిలేస్తాం. కొద్ది రోజుల తర్వాత మనకు కావాల్సిన సమాచారం కోసం వెతుకుదామంటే మొత్తం ఛాట్‌ను పై నుంచి కింది వరకూ జరపాలి. దీనివల్ల చాలా సమయం వృథా అవుతుంది. ఏదైనా కీవర్డ్‌తో సెర్చ్‌ చేసినా కొన్నిసార్లు దొరకదు. మరి వాట్సాప్‌లో ముఖ్యమైన డేటా మనకు కావాల్సినప్పుడు సులువుగా పొందేందుకు ఏం చేయాలో తెలుసా?

వెబ్‌ బ్రౌజర్‌లో బుక్‌మార్క్‌ ఫీచర్‌ తరహాలోనే వాట్సాప్‌లో కూడా స్టార్డ్‌ మెసేజెస్ అనే ఫీచర్ ఉంది. దీని సాయంతో వెబ్‌ బ్రౌజర్‌లో మీకు నచ్చిన వెబ్‌ పేజ్‌ను బుక్‌మార్క్ చేసినట్లే వాట్సాప్‌లో ముఖ్యమైన మెసేజ్‌లను స్టార్డ్‌ ఫీచర్‌తో మార్క్‌ చేసి పెట్టుకోవచ్చు. దీంతో మీరు కావాలనుకున్నప్పుడు సదరు మెసేజ్‌లను వెంటనే యాక్సెస్ చేసుకోవచ్చు. చాలా మంది యూజర్స్‌కు దీనిపై అవగాహన లేకపోవడం వల్ల ఇది అంత పాపులర్ కాలేదు. మరి స్టార్డ్ ఫీచర్ ఎలా పనిచేస్తుంది..వాట్సాప్‌లో మీ మెసేజ్‌లను ఎలా బుక్‌మార్క్ చేయాలో తెలుసుకుందాం.

How to bookmark a message in Whatsapp
వాట్సాప్

* ముందుగా వాట్సాప్‌లో మీరు బుక్‌మార్క్‌ చేయాలనుకుంటున్న మెసేజ్‌ ఉన్న ఛాట్ పేజ్‌ ఓపెన్ చేయాలి.

* అందులో మీరు బుక్‌మార్క్‌ చేయాలకున్న మెసేజ్‌పై లాంగ్ ప్రెస్ చేస్తే మీకు స్క్రీన్‌ పైభాగంలో స్టార్‌ సింబల్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే మీరు సెలెక్ట్ చేసిన మెసేజ్ బుక్‌మార్క్ అయిపోతుంది.

* తర్వాత మీరు మెసేజ్‌లను చూడాలనుకుంటే వాట్సాప్ విండోలో కుడివైపు పైన ఉన్న మూడు డాట్స్‌పై క్లిక్ చేస్తే ఒక లిస్ట్ కనిపిస్తుంది. అందులో స్టార్డ్‌ మెసేజెస్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేస్తే మీరు బుక్‌మార్క్ చేసిన మెసేజ్‌లు కనిపిస్తాయి. వాటిపై క్లిక్ చేస్తే స్టార్డ్‌ చేసిన మెసేజ్‌లు ఉన్న ఛాట్ పేజీ ఓపెన్ అవుతుంది.

* అలానే మీరు స్టార్డ్ చేసిన మెసేజ్‌లను మీ కాంటాక్ట్‌ జాబితాలో ఉన్న వ్యక్తుల ప్రొఫైల్‌పై క్లిక్ చేసి చూడొచ్చు. ఇందుకోసం మీరు స్టార్డ్‌ మెసేజ్‌ చూడాలనుకుంటున్న వ్యక్తికి సంబంధించిన ఛాట్ ఓపెన్ చేయాలి. తర్వాత వారి ప్రొఫైల్‌పై లేదా పేజీలో కుడివైపు పైన ఉన్న మూడు డాట్స్‌పై క్లిక్ చేస్తే వ్యూ కాంటాక్ట్ ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసి కిందకు స్క్రోల్ చేస్తే స్టార్డ్ మెసేజెస్ ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ మీరు వారితో చేసిన ఛాట్‌కు సంబంధించి ఏదైనా డేటా బుక్‌మార్క్ చేసుంటే అందులో కనిపిస్తుంది.

* మీరు మెసేజ్‌లను అన్‌బుక్‌మార్క్‌ చేయాలంటే స్టార్డ్‌ మెసేజెస్‌ ఓపెన్ చేసిన తర్వాత కుడివైపు పైన ఉన్న మూడు డాట్స్‌పై క్లిక్ చేస్తే అన్‌స్టార్‌ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే మీరు బుక్‌మార్క్ చేసిన మెసేజ్‌లు అన్ని అన్‌బుక్‌మార్క్ అవుతాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.