గ్రాఫిక్ డిజైన్, ఎడ్వర్‌టైజింగ్, కార్పొరేట్ బ్రాండింగ్, ప్రాడక్ట్ ప్యాకేజింగ్, పబ్లిషింగ్, వెబ్ డిజైన్, మోషన్ గ్రాఫిక్స్, డిజిటల్ యానిమేషన్, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకింగ్... రంగాల గురించి వినే ఉంటారు. మూడేళ్ల బి.డిఇఎస్ (కమ్యూనికేషన్ డిజైన్) కోర్సు చదివితే ఈ రంగాల్లోకి ప్రవేశించి వినూత్నంగా పనిచేయొచ్చు.
విద్యార్హతలు: ఇంటర్మీడియట్ లేదా దీనికి సమానమైన పరీక్ష పాసై ఉండాలి.
ఈ కోర్సును అందిస్తోన్న కాలేజీలు:
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, అహ్మదాబాద్, ఎం.ఐ.టి.ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ పుణె, ఐఐటీ- బాంబే, కాన్పూర్, గువాహటి, హైదరాబాద్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్, జబల్‌పూర్, స్కూల్ ఆఫ్ డిజైన్, యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్, దెహ్రాదూన్, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, ఫగ్‌వర, వరల్డ్ యూనివర్సిటీ ఆఫ్ డిజైన్, సోనిపట్, వెల్లూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వెల్లూరు, మణిపాల్ యూనివర్సిటీ, జయపుర, స్కూల్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, పుణె, హిందుస్థాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, చెన్నై, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, దిల్లీ. యూనివర్సిటీ ఆఫ్ కేరళ, తిరువనంతపురం, సింబయాసిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్- పుణె. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ-హైదరాబాద్, కె.ఎల్. యూనివర్సిటీ- గుంటూరు మొదలైనవి.
యూనివర్సిటీలు నిర్వహించే ప్రవేశ పరీక్ష పాసవడం ద్వారా కోర్సులో చేరొచ్చు.
ఎలాంటి నైపుణ్యాలు ఉండాలి:
చెప్పదలిచిన సందేశం స్పష్టంగా బోధపడేలా దృశ్య రూపంలో వివరించగలగాలి. వినియోగదారుడికి అవసరమైన సమాచారాన్ని డిజైన్లతో అర్థమయ్యేలా వివరించగలిగే నైపుణ్యం ఉండాలి.
ఉద్యోగావకాశాలు:
కాలేజీలు, యూనివర్సిటీలు, ప్యాకేజింగ్ ఇండస్ట్రీ, డిజైన్ గ్రూప్స్, టీవీ, వార్తాపత్రికలు, మేగజీన్లు, ప్రచురణ సంస్థలు, మల్టీమీడియా సంస్థలు, కంప్యూటర్ గేమ్స్ కంపెనీలు... మొదలైన వాటిల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి. ఈ కోర్సు చదివినవారు గ్రాఫిక్ డిజైనర్, కమ్యూనికేషన్ డిజైనర్, వెబ్ డిజైనర్, ఫ్రీలాన్సర్, ఇంటరాక్షన్/ సర్వీస్ డిజైనర్, టీచర్/ లెక్చరర్ లాంటి ఉద్యోగాల్లో స్థిరపడవచ్చు.
అదనపు అర్హతల కోసం:
ఆసక్తి ఉంటే డిగ్రీ తర్వాత ఎం.డిఇఎస్ (కమ్యూనికేషన్ డిజైన్), పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కమ్యూనికేషన్ డిజైన్ చేయొచ్చు.
ఎనిమిది సెమిస్టర్లలో...
ఈ కోర్సును ఎనిమిది సెమిష్టర్లలో పూర్తిచేయాలి.
సెమ్-1: ఇంగ్లీష్ (కమ్యూనికేషన్ స్కిల్స్), ఆర్ట్ అండ్ విజువల్ పర్‌సెప్షన్, డ్రాయింగ్, ఎలిమెంట్స్ ఆఫ్ డిజైన్, సోషియో-కల్చర్ డిజైన్స్ అండ్ సింబల్స్.
సెమ్-2: ఇంగ్లీష్ (క్రియేటివ్ రైటింగ్), కలర్ థెరపీ, డ్రాయింగ్ (పెర్‌సెప్టివ్, ఐసోమెట్రిక్, ఆర్థోగ్రాఫిక్), ఎలిమెంట్స్ ఆఫ్ డిజైన్ (కలర్ అండ్ ఫామ్) టైపోగ్రఫీ (కాలిగ్రఫీ), డ్రాయింగ్ (ఇలస్ట్రేషన్ టెక్నిక్స్ అండ్ స్టైల్స్ ఎక్సెప్లోరేషన్, ఇంట్రడక్షన్ టు డిజిటల్ డిజైన్-1: వర్డ్, ఎక్సెల్ అండ్ పవర్ పాయింట్.
సెమ్-3: ఆర్ట్ హిస్టరీ అండ్ ఆర్ట్ అప్రిషియేషన్, కమ్యూనికేషన్, డ్రాయింగ్-4, విజువలైజేషన్ అండ్ రిప్రజంటేషన్, బేసిక్ గ్రాఫిక్ డిజైన్, బేసిక్ ఫొటోగ్రఫీ, ఇంట్రడక్షన్ టు డిజిటల్ డిజైన్, ఫొటోషాప్, ఇలస్ట్రేటర్ అండ్ డిజైన్, ఓపెన్ ఎలక్టివ్.
సెమ్-4: కంటెంట్ డెవలప్‌మెంట్, ఇంగ్లిష్- కాపీ రైటింగ్, డిజైన్ ప్రాసెస్ అండ్ మెథడాలజీ, బేసిక్స్ ఆఫ్ వీడియో ఫిల్మ్ మేకింగ్, బేసిక్స్ ఆఫ్ యానిమేషన్ ఫిల్మ్ మేకింగ్, అడ్వాన్స్ ట్రైపోగ్రఫీ, అడ్వాన్స్ ఫొటోగ్రఫీ: అడ్వర్‌టైజింగ్, ప్రాడక్ట్ మొదలైనవి.
సెమ్-5: పర్సనాలిటీ డెవలప్‌మెంట్, ప్రింటింగ్ టెక్నాలజీ ఆఫ్ మెథడ్స్, గ్రాఫిక్ డిజైన్ ప్రాజెక్ట్1: పబ్లికేషన్ డిజైన్, ఇంట్రడక్షన్ టు యూజర్ ఇంటర్‌ఫేస్ డిజైన్, గ్రాఫిక్ డిజైన్ ప్రాజెక్ట్ 2: ఇలస్ట్రేషన్ బేస్డ్; గ్రాఫిక్ డిజైన్ ప్రాజెక్ట్-3; ఇంటరాక్టివ్ డిజైన్, ఓపెన్ ఎలక్టివ్.
సెమ్-6: స్టడీ టూర్ అండ్ ఇండస్ట్రియల్ విజిట్స్, డిజైన్ ఆఫీస్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, అడ్వర్‌టైజింగ్ అండ్ మార్కెటింగ్ థియరీ, గ్రాఫిక్ డిజైన్-4 విజువల్ ఐడెంటిటీ అండ్ బ్రాండింగ్, గ్రాఫిక్ డిజైన్ ప్రాజెక్ట్-5: అడ్వర్‌టైజింగ్ అండ్ ప్యాకేజింగ్, గ్రాఫిక్ డిజైన్. ప్రాజెక్ట్-6: డిజైన్ ఫర్ సోషల్ నీడ్స్, ఇండస్ట్రియల్ ఇంటర్న్‌షిప్ ఇన్ సమ్మర్ వెకేషన్.
సెమ్-7: ఇండస్ట్రియల్ ఇంటర్న్‌షిప్ ఎగ్జిబిషన్ అండ్ ప్రజెంటేషన్; గ్రాఫిక్ డిజైన్ ప్రాజెక్ట్:7 ఎన్విరాన్‌మెంట్ గ్రాఫిక్స్/ సిగ్‌నేజ్ డిజైన్, గ్రాఫిక్ డిజైన్ ప్రాజెక్ట్: వ్యక్తిగత అభిరుచిని అనుసరించి. కొలొక్వియమ్ పేపర్, స్టడీ ఫర్ డిగ్రీ ప్రాజెక్ట్ ప్రపోజల్ అండ్ ప్రజంటేషన్, పోర్ట్‌పోలియో డిజైన్ ఫర్ వన్‌సెల్ఫ్.
సెమ్-8: డిగ్రీ ప్రాజెక్టు.