ETV Bharat / priya

కారం కారంగా.. 'కార్న్‌ రిబ్స్‌'- తయారు చేసుకోండిలా..

ఎప్పుడూ ఒకేరకమైన స్నాక్స్ తిని బోర్ కొట్టిందా? అయితే.. ఈ సారి స్వీట్ కార్న్​తో కారంకారంగా ఉండే 'కార్న్ రిబ్స్' తయారు చేసుకోండి.

corn ribs recipe
కార్న్‌ రిబ్స్‌ రెసిపీ
author img

By

Published : Oct 23, 2021, 9:20 AM IST

కరకరలాడే 'కార్న్ రిబ్స్' ఎలా తయారు చేసుకోవాలంటే..?​

కావాల్సినవి:

  • స్వీట్‌కార్న్‌ కండెలు- రెండు,
  • కారం- చెంచా,
  • వెల్లుల్లి ముద్ద- అర చెంచా,
  • నిమ్మరసం- పెద్ద చెంచా,
  • ఉప్పు- తగినంత,
  • నూనె- వేయించడానికి సరిపడా.
    corn ribs recipe
    కార్న్‌ రిబ్స్‌

తయారీ: మొక్కజొన్న కండెలను స్టీమర్‌లో పది నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత నాలుగు ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. గిన్నెలో ఉప్పు, కారం, వెల్లుల్లి పేస్ట్‌, నిమ్మరసం, నూనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కంకులకు పట్టించి పది నిమిషాలపాటు పక్కన పెట్టాలి. పాన్‌లో నూనె పోసి మీడియం మంటపై వేడి చేయాలి. వేడెక్కిన నూనెలో మసాలా పట్టించిన కంకులు క్రిస్పీ అయ్యేవరకు వేయించాలి. ఆ తర్వాత కొద్దిసేపు టిష్యూపేపర్‌ పై వేయాలి. వీటిని పళ్లెంలోకి తీసుకుని కొద్దిగా కారం చల్లి వేడివేడిగా తింటే బాగుంటాయి.

-స్వర్ణలత వేదాంతం, హైదరాబాద్​.

ఇదీ చూడండి: టేస్టీ 'రవ్వ షీరా' తయారు చేసుకోండిలా..

ఇదీ చూడండి: కాస్త భిన్నంగా 'గోలీ ఇడ్లీలు' వడ్డించండిలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.