ETV Bharat / opinion

అది.. ట్రంప్‌ చేసిన ఉగ్రదాడి! - trump supporters clash with police

అమెరికా క్యాపిటల్​లో జరిగిన హింసాకాండ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బైడెన్​ నియామకాన్ని అడ్డుకునేందుకు ట్రంప్​ మద్దతుదారులు చేసిన ప్రయత్నాలకు యావత్​ ప్రపంచం ఉలిక్కిపడింది. ఈ ఘటన అనంతరం అమెరికా అధ్యక్షుడు ట్రంప్​పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ట్రంప్​ను పదవి నుంచి తొలగించేందుకు ఇరు పార్టీల చట్టసభ్యలు విస్తృతంగా చర్చించారు.

trump supporters rally in capitol house
అది.. ట్రంప్‌ చేసిన ఉగ్రదాడి!
author img

By

Published : Jan 9, 2021, 6:57 AM IST

ఎలా వచ్చిందో అలాగే పోతుందంటూ కొవిడ్‌ ప్రజ్వలనానికి పుణ్యం కట్టుకొన్న ట్రంప్‌ మహాశయుడు- మహమ్మారి సాకుతో అధ్యక్ష ఎన్నికల వాయిదాకు సూత్ర రహిత గాలిపటాలెగరేసిన కపట నాటక సూత్రధారి. కరోనా నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా మెయిల్‌ ద్వారా ఓటింగుకు పలు రాష్ట్రాలు సిద్ధమైనప్పటినుంచే, తన నుంచి అధికారం గుంజుకొనే కుట్ర జరుగుతోందన్న దుష్ప్రచారం ట్రంప్‌ ముఖతా మోతెక్కిపోయింది. అమెరికా చరిత్రలోనే అత్యధికంగా ఓట్లు పోలైన నవంబరు నాటి ఎన్నికల్లో కీలక రాష్ట్రాల్లో తరాజు డెమోక్రాట్ల వైపు మొగ్గినప్పటినుంచే ట్రంప్‌ నాలుక బిరుసెక్కింది. అధికార బదలాయింపు సక్రమంగా సాగకుండా అడుగడుగునా అవరోధాలు సృష్టించిన శ్వేత సౌధాధిపతి- ఎలెక్టోరల్‌ కాలేజీ ఓట్లను ఉభయసభలు పరిశీలించి తదుపరి అధ్యక్షుణ్ని ఖరారు చేసే వేళ మహా కుహకానికి తానుగా తెరతీశారు.

ఉపాధ్యక్షుడు పెన్స్‌ సారథ్యంలో జరిగే క్రతువును ప్రభావితం చేసేలా తెరమాటు తతంగం నడిపిన పెద్దమనిషి- కీలక సభా మందిరంపైకి తన అనుయాయుల్ని అక్షరాలా ఉసిగొలిపారు. ప్రాణభీతితో మాన్య సభ్యులు తలో దిక్కున తలదాచుకోగా, రక్షక భటుల కాల్పుల్లో నలుగురు నేలకొరిగిన వైపరీత్యం- ట్రంప్‌ రాజేసిన విద్వేషానలం ఎంత భయానకమైనదో కళ్లకు కడుతోంది. అమెరికా ప్రజాస్వామ్య మౌలిక విలువలపై ట్రంప్‌ చేసిన ఉగ్రదాడి ఇది. జాత్యహంకారంతో మితవాద మూకల్ని రెచ్చగొట్టి, తనంతటి వాడు లేడన్న నియంత వైఖరితో శ్వేతసౌధాన్నే చెరబట్టజూసిన ట్రంప్‌ ధిక్కార ధోరణి- ప్రపంచంలోనే అతి ప్రాచీన ప్రజాస్వామ్య దేశాన్ని నవ్వులపాలు చేసింది. క్యాపిటల్‌ ముట్టడి దరిమిలా ప్రాప్తకాలజ్ఞత రహించిన రిపబ్లికన్లు తుది ఫలితాలకు ఆమోదం తెలపడంతో ట్రంప్‌ సైతం దిగివచ్చి సజావుగా అధికార మార్పిడికి సరేనంటున్నారు. ప్రజాస్వామ్యాన్నే అపహసించిన ట్రంప్‌కు మరొక్క క్షణం కూడా అధ్యక్ష పదవిలో ఉండే అర్హత లేదు!

పందెం కోళ్లలా పార్టీలు కొట్టుకొంటుంటే ప్రజాస్వామ్యం అచేతనమై అరాచకత్వం పాదుకొంటుందని, ఆ పరిస్థితుల్లో స్వప్రయోజనాల కోసం ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకొనే నాయకుడు పుట్టుకొస్తాడని అమెరికా మొట్టమొదటి అధ్యక్షుడిగా జార్జి వాషింగ్టన్‌ హెచ్చరించి దాదాపు 225 సంవత్సరాలైంది. పేరుకు అగ్రరాజ్యమే అయినా, స్వేచ్ఛా సమానత్వ సూత్రాలతో రాజ్యాంగం గుబాళిస్తున్నా- అంతకంతకు విస్తరిస్తున్న సామాజిక అంతరాలతో సామాన్య జనవాహినిలో ఆవేశోద్రేక అగ్నిపర్వతాలు నిశ్శబ్దంగా ప్రజ్వరిల్లుతూనే ఉన్నాయి. నల్లనయ్య ఒబామా రెండు విడతల పాలన దరిమిలా జాత్యహంకార విద్వేషపూరిత లావాను వెలిగక్కుతూ ట్రంప్‌ చేసిన ప్రచారం క్రితంసారి ఎన్నికల్లో- జార్జి వాషింగ్టన్‌ హెచ్చరికను తొలిసారిగా నిజం చేసింది. ప్రపంచానికి పొంచి ఉన్న పది ఘోర ప్రమాదాల్లో అమెరికా అధ్యక్షత ట్రంప్‌కు దఖలు పడటమూ ఒకటన్న నాలుగేళ్లనాటి ‘ఎకానమిస్ట్‌’ సర్వే ఎంత సత్యమో, పదేపదే రుజువవుతోంది.

‘అమెరికా ఫస్ట్‌’ నినాదంతో అందలం ఎక్కి, తాను లేకపోతే అమెరికాకు దిక్కే లేదన్న అతిశయంతో సమస్త యంత్రాంగాన్నీ భ్రష్టు పట్టించి- జాతీయంగానూ అంతర్జాతీయంగానూ ట్రంప్‌ చేసిన విధానపర దారుణాలు లెక్కలేనన్ని! వాటన్నింటికీ పరాకాష్ఠ- క్యాపిటల్‌పై తాజా దాడి. అసలు పోరు ఇప్పుడే మొదలైందంటూ 2024 సమరానికి సమాయత్తమవుతున్న ట్రంప్‌ను తక్షణం అధ్యక్ష పీఠం నుంచి తప్పించడంతోపాటు మరోసారి పోటీ అవకాశం లేకుండా చేయడమూ అమెరికా ప్రయోజనాల రీత్యా అత్యావశ్యకం. దేశాధ్యక్షతతోపాటు ఉభయ సభల మీదా పట్టు సాధించిన డెమోక్రాట్లు- అమెరికా సమాజంలో ప్రమాదకరంగా వేరూనుకొన్న జాత్యహంకార విద్వేష భావజాలాన్ని తుడిచిపెట్టడానికి, సమన్యాయ సూత్రాల చట్టబద్ధ పాలనకు గొడుగు పట్టడానికి యుద్ధప్రాతిపదికన కదలడం నేటి అవసరం!

ఇదీ చదవండి : అమెరికా ఆందోళనలపై ప్రపంచ దేశాల అసహనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.