ETV Bharat / opinion

సాంకేతిక విజ్ఞానంతో వైద్య చికిత్స కొత్త పుంతలు - Medical Digital technology in India

ప్రపంచవ్యాప్తంగా వైద్యుల కొరత అధికంగా ఉంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వైద్య సేవలు అందుబాటులోకి రావటం లేదు. 130 కోట్ల జనాభా ఉన్న భారత్​ 2030 నాటికి 27 లక్షల అల్లోపతీ వైద్యులు అవసరమవుతారని ఐసీఎమ్​ఆర్​ అధ్యయనం చెబుతోంది. వైద్యవ్యవస్థకు సాంకేతికత జోడించడం వల్ల ఈ సమస్యను అధిగమించవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల రోగనిర్ధరణ, చికిత్స విషయంలో సమయమూ కలిసి వస్తుందని చెబుతున్నారు.

New milestones in Medical treatment with the Digital Technology
వైద్య చికిత్సలో కొత్త పుంతలు
author img

By

Published : Jul 18, 2020, 8:36 AM IST

Updated : Jul 18, 2020, 9:08 AM IST

ప్రతి రెండు వేల జనాభాకు కనీసం ఇద్దరు వైద్యులు, అయిదుగురు నర్సులు, ఏడు ఆస్పత్రి పడకలు అందుబాటులో ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సూచిస్తోంది. ఆ లెక్కన 135 కోట్ల జనాభా గల భారత్‌కు 2030నాటికి 27 లక్షల అల్లోపతీ వైద్యులు అవసరమవుతారని ఐసీఎమ్‌ఆర్‌ అధ్యయనం చెబుతోంది. గుండె, శ్వాసకోశ, క్యాన్సర్‌, రోగ నిర్ధరణ, రేడియాలజీ తదితర రంగాల్లో వైద్యనిపుణుల కొరత తీవ్రంగా ఉంది. వైద్యవ్యవస్థకు సాంకేతికత జోడించడం వల్ల సమస్యను అధిగమించవచ్చన్నది నిపుణుల సూచన. దీనివల్ల రోగనిర్ధరణ, చికిత్స విషయంలో సమయమూ కలిసి వస్తుందని చెబుతున్నారు. కృత్రిమ మేధ, యంత్ర విజ్ఞానాల ద్వారా అత్యుత్తమ వైద్య సేవలు పొందవచ్చనీ అంటున్నారు.

డిజిటల్​ విప్లవానికి పునాదులు..

2021 నాటికి ఈ తరహా వైద్యసేవలు 40 శాతం వృద్ధి రేటు సాధించే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు చాటుతున్నాయి. ఆస్పత్రుల నిర్వహణ, వ్యాధి నిర్ధరణ, చికిత్స, వైద్య పరికరాల వినియోగం, ఆరోగ్య బీమా, చరవాణి వైద్యం, మందుల విపణులు తదితర వైద్య రంగాల్లో కృత్రిమ మేధ బలంగా వేళ్లూనుకుంటోంది. దేశంలో 40 శాతం జనాభాకు అంతర్జాల సేవలు అందుబాటులోకి రావడం, స్మార్ట్‌ ఫోన్ల వినియోగం పెరగడం- డిజిటల్‌ విప్లవానికి పునాదులుగా మారుతున్నాయి. వైద్య నిపుణుల కొరత, భౌగోళిక పరిస్థితులు, మౌలిక వసతుల పరిమితులు, పట్టణ పల్లె ప్రాంత ప్రజల మధ్య నెలకొన్న అసమానతలు- దేశంలో నూతన సృజనకు దారి చూపుతున్నాయి.

కృత్రిమ మేధకు విశేషాదరణ

అమెరికాలో కృత్రిమ మేధ వినియోగం వల్ల రోగ నిర్ధరణ, చికిత్సల్లో మానవ తప్పిదాలు 15 శాతం మేర తగ్గినట్లు అక్కడి అధ్యయనాలు చెబుతున్నాయి. స్వయంచాలక విశ్లేషణ కలిగిన వైద్య పరీక్షలు, నిర్దిష్టమైన రోగ నిర్ధరణ, రోగ తీవ్రతను నిరంతరం పర్యవేక్షించే ఉపకరణాలు వైద్య పరిరక్షణలో క్రియాశీలం అవుతున్నాయి. సునిశిత పరిశీలన సమాచార రేఖాగణితాలు రోగ నిర్ధరణ, చికిత్సలో కీలకం కానున్నాయి. క్యాన్సర్‌, గుండె, శ్వాసకోశ వ్యాధులు ఇబ్బడిముబ్బడిగా విస్తరిస్తుండటంతోపాటు వృద్ధుల సంఖ్యా క్రమేపీ పెరుగుతుండటం వల్ల వైద్యులు తమ పనిభారాన్ని తగ్గించుకునేందుకు కృత్రిమ మేధను ఆశ్రయిస్తున్నారు. ఆధునిక సాంకేతికత సహకారంతో వైద్య చికిత్సలో కొత్త ఒరవడులను అన్వేషిస్తున్నారు. కంప్యూటరీకరణ ద్వారా యంత్రాలకు మానవ మెదడు భావనలను పోలిన విధులను మిళితం చేసి లోతైన అధ్యయనం జరుపుతున్నారు. సంబంధిత పరిశీలనకు గణిత శాస్త్రవిజ్ఞానాన్ని జోడించి ఆరోగ్య పరిరక్షణలో సత్ఫలితాలు రాబట్టవచ్చని ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాల్లో జరిగిన అనేక పరిశోధనలు రుజువుచేశాయి.

సత్ఫలితాలతోనే..

లక్షల మంది రోగుల నుంచి సమాచారాన్ని సేకరించి, విశ్లేషించి చికిత్స మార్గాన్ని సూచిస్తుండటంతో కృత్రిమ మేధకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ అపారంగా పెరుగుతోంది. అపోలో ఆస్పత్రులు, మైక్రోసాఫ్ట్‌ ఉమ్మడి సాంకేతిక భాగస్వామ్యంతో గుండె జబ్బుల చికిత్సలో సత్ఫలితాలు సాధిస్తున్నారు. ఒక జన సమూహంలోని వ్యక్తిగత ప్రమాద కారకాలను గుర్తించి భవిష్యత్తులో గుండె సంబంధ ‘కరోనరీ ఆర్టరీ’ రోగం బారిన పడకుండా చూసేందుకు ఈవిధానం ఉపయుక్తంగా ఉంటుందన్నది వైద్య నిపుణుల విశ్లేషణ. నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక విజ్ఞానం ఆరోగ్య పరిరక్షణకు సోపానాలవుతున్న రోజులివి. మరోవైపు వివిధ కారణాలవల్ల పెచ్చరిల్లుతున్న రుగ్మతల కారణంగా మన దేశం వైద్య సమాచార గనిగా మారుతోంది. దేశంలో ఏటా సుమారు పది లక్షల మంది వివిధ రకాల క్యాన్సర్ల బారిన పడుతున్నట్లు అంచనా.

అధ్యయనాలు ఏమంటున్నాయంటే..

క్యాన్సర్‌ రోగనిర్ధరణలో నిష్ణాతులైన శాస్త్రవేత్తలు అతి కొద్దిమందే ఉండటంతో యంత్ర అభ్యాసం (మిషన్‌ లెర్నింగ్‌) సౌజన్యంతో వైద్యాన్ని మరింత సరళతరం చేయవచ్చని నిపుణులు అంటున్నారు. డిజిటల్‌ రోగ నిర్ధరణ ద్వారా నూటికి నూరుపాళ్లు నిర్ధరణకు రావచ్చునని ముక్తకంఠంతో చెబుతున్నారు. కోలాన్‌లోని పోలిప్స్‌ను కనుగొనేందుకు చేసే కొలనోస్కోపీలో కృత్రిమ మేధను వినియోగిస్తే అయిదు మిల్లీమీటర్ల కన్నా కంటే తక్కువ పరిమాణం ఉండి, కంటికి కనిపించని పోలిప్స్‌ను కనిపెట్టేందుకు గల అవకాశాలు తొమ్మిది రెట్లు అధికంగా ఉన్నట్లు ఓ అధ్యయనం చెబుతోంది. రొమ్ము క్యాన్సర్‌ నిర్ధరణలో 11మంది నిపుణులైన శాస్త్రవేత్తలు చేసే పనిని ఒక యంత్ర అభ్యాసం వినియోగంతో మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చని మరో అధ్యయనంలో తేలింది. త్వరితగతిన వ్యాపించే సాంక్రామిక వ్యాధుల అన్వేషణలోనూ (ట్రాకింగ్‌), నియంత్రణలోనూ ఈ ప్రక్రియ అధిక జనాభా గల భారత దేశానికి ఎంతో అవసరమని ఆస్ట్రేలియాలోని డీకిన్‌ యూనివర్సిటీ అంటోంది.

సేవల విస్తరణకు కార్యాచరణ

ఖరీదైన బహుళ జాతి సంస్థల ఉత్పత్తులను మాత్రమే కాకుండా ఔత్సాహిక దేశవాళీ సంస్థలను కూడా ప్రోత్సహించాలి. ఇటువంటి అధునాతన వైద్య సేవలు కేవలం కార్పొరేట్‌ వైద్యశాలలకు మాత్రమే పరిమితం అవుతున్నాయి. ప్రభుత్వ రంగంలోని వైద్యశాలలకూ ఈ సేవలు విస్తరిస్తే ప్రాథమిక వైద్య పరిరక్షణ మరింత పటిష్ఠపడుతుంది. ఈ ఫలితాలు సామాన్య ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా విధానాల రూపకల్పనకు ప్రభుత్వాలు సమాయత్తం కావాలి. కార్యాచరణకు నడుం బిగించాలి!

- డాక్టర్‌ జెడ్‌.ఎస్‌. శివప్రసాద్‌, రచయిత - వైద్యరంగ నిపుణులు

ఇదీ చదవండి: ప్రియురాలిని కలిసేందుకు పాక్​కు పయనం.. కానీ!

Last Updated : Jul 18, 2020, 9:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.