ETV Bharat / opinion

కరోనా కాలంలో.. న్యాయ వ్యవస్థకు సాంకేతిక అండ

కరోనా వైరస్​ నేపథ్యంలో విధించిన లాక్​డౌన్​ కారణంగా.. దాదాపు ప్రపంచమంతా స్తంభించిపోయింది. అన్ని రంగాలూ ఎక్కడిక్కడే నిలిచిపోయాయి. న్యాయవ్యవస్థదీ అదే పరిస్థితి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో సాంకేతికత సాయంతో అన్ని వ్యవస్థలూ ముందుకెళ్తున్నాయి. ఈ  తరుణంలో న్యాయవ్యవస్థ కూడా ఆ దిశగా ముందడుగేయడానికి ఇదే సరైన సందర్భంగా కనిపిస్తోంది.

Legal system takes the Technical support
న్యాయ వ్యవస్థకు సాంకేతిక అండ
author img

By

Published : Jun 11, 2020, 2:17 PM IST

కొవిడ్‌ మహమ్మారి కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో ప్రపంచమంతా స్తంభించిన స్థితికి చేరింది. ఫలితంగా, అన్ని వ్యవస్థలూ ఎక్కడిక్కడే ఆగిపోయాయి. ఇందులో న్యాయవ్యవస్థ సైతం ఉంది. మిగతా అన్ని వ్యవస్థల్లాగే న్యాయస్థానాలకూ అవాంతరాలు తప్పడం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్నే దన్నుగా మార్చుకుని ముందడుగు వేసేందుకు అన్ని వ్యవస్థలు కృషి చేస్తున్నాయి. న్యాయ వ్యవస్థ కూడా ఆ దిశగా అడుగులు వేయడానికి ఇదే సరైన సందర్భమని చెప్పవచ్చు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితులను ఉపయోగించుకొని సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆయుధంగా మలచుకొని నవ్య సంస్కరణలకు శ్రీకారం చుట్టాల్సిన సమయం ఆసన్నమైంది.

దృశ్య మాధ్యమం ద్వారా..

ఈ క్రమంలో కక్షిదారుగానీ, న్యాయవాదిగానీ కోర్టు మెట్లు ఎక్కకుండానే చరవాణి ద్వారా కేసులను నడిపించే అవకాశం ఉంది. దానికి కావాల్సిన యంత్రాంగాన్ని, వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి కోర్టులో, అనుమతి పొందిన న్యాయవాది ఇంట్లో దృశ్యమాధ్యమ సమావేశం ఏర్పాటు చేసుకునే వెసులుబాటు కల్పించాలి. సాక్షులను దృశ్యమాధ్యమ సమావేశం ద్వారానే ప్రశ్నించే అవకాశాలను పరిశీలించాలి. ఇది సాధ్యంకాని పక్షంలో, సాక్షులతో అవసరం లేకుండా జరిగే కోర్టు కార్యక్రమాలను దృశ్య మాధ్యమ సమావేశం ద్వారా నిర్వహించవచ్చు. దీనివల్ల దూర ప్రాంతంలో ఉన్న కక్షిదారులు లాక్‌డౌన్‌ సమయంలో కోర్టుకి ప్రత్యక్షంగా రావాల్సిన అవసరం లేకుండా కేసు విచారణ కొనసాగించవచ్చు. న్యాయవాది ఏదైనా పరిస్థితిలో కోర్టుకు రాలేకపోయినా దృశ్యమాధ్యమ సమావేశం ద్వారా విచారణలో పాల్గొనవచ్చు. సుప్రీంకోర్టులోని కొన్ని ధర్మాసనాలు, పలు హైకోర్టులు, కొన్ని జిల్లాల్లోని దిగువ కోర్టుల్లో బెయిల్‌ పిటిషన్లు వంటి అత్యవసర విచారణలు చాలా వరకు వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారానే జరుగుతున్నాయి.

డిజిటల్​ వ్యవస్థ వైపుగా..

వీడియో కాన్పరెన్స్‌, భౌతిక దూరం పాటించడం వంటి వాటిద్వారా ఇప్పటికే పరిమిత స్థాయిలో సాంకేతికపరంగా కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. సాధారణంగా న్యాయస్థాన సముదాయాల్లో జనం గుంపులుగా చేరడం పరిపాటి. ఇలాంటి సమస్యను పరిష్కరించేందుకు పత్రాలను ఈ-ఫైలింగ్‌ ద్వారా సమర్పించడం, కోర్టు రూముల కార్యక్రమావళిని వెబ్‌క్యాస్టింగ్‌ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయడం, సాధారణ కేసుల్లో సాక్ష్యాలను ఆన్‌లైన్‌లో రికార్డు చేయడం వంటి చర్యల ద్వారా సమస్యలను కొంతమేర అధిగమించవచ్చు. ఇదే క్రమంలో పూర్తిస్థాయిలో డిజిటల్‌ వ్యవస్థ వైపు నడిచే దిశగా పలు చర్యలను తీసుకోవాల్సి ఉంటుంది. అందులో పలు సమస్యలు ఎదురయ్యే అవకాశం లేకపోలేదు. కోర్టు సిబ్బందికి సాంకేతిక శిక్షణ, ప్రాసిక్యూటర్లు, న్యాయవాదులు, పోలీసులు, పిటిషన్‌దారులందరూ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించేలా చేయడం వంటివన్నీ పెద్ద సవాలే.

అవే సమస్యలు..

ప్రజాస్వామ్యానికి న్యాయవ్యవస్థ వెన్నెముక. పరిపాలన ప్రజాస్వామ్యబద్ధంగా లేనప్పుడు, వ్యక్తులు చట్టప్రకారం నడుచుకోనప్పుడు ప్రజలకు ఉన్న ఆఖరి ఆశ న్యాయస్థానమే. మూడంచెల మన న్యాయవ్యవస్థలో కేసులు కోట్ల సంఖ్యలో పేరుకుపోయాయి. న్యాయ వ్యవస్థలో సంస్కరణల కోసం దేశం మొత్తం కోడై కూస్తున్నా అవసరమైనవారి చెవిన పడటం లేదు. ఏదైనా వ్యవస్థలో సంస్కరణలు చేపట్టాలంటే ముందు సమస్యను గుర్తించాలి. సమస్యను గుర్తించనంతకాలం, సంస్కరణలు చేపట్టినా ఫలితం ఉండదు. న్యాయస్థానాలు తక్కువగా ఉండటం, న్యాయమూర్తులు సరిపడా లేకపోవడం, కోర్టులు తక్కువ సమయం పని చేయడం, కోర్టులకు జవాబుదారీ విధానం లేకపోవటం, వృత్తికి అంకితమై పని చేసే న్యాయవాదులు కొద్దిమంది మాత్రమే ఉండటం వంటివి ఈ వ్యవస్థలో ఉన్న ప్రధాన సమస్యలు. న్యాయవ్యవస్థలో గూడుకట్టుకుపోయిన ఇలాంటి సమస్యల్ని ఒక్కసారిగా పరిష్కరించడం సాధ్యమయ్యే పనికాదు. కొండలా పేరుకుపోయిన కేసులూ ఒక్క ఉదుటున తగ్గవు. సుప్రీంకోర్టులోనే 60 వేలకుపైగా కేసులు అపరిష్కృతంగా ఉన్నాయి. హైకోర్టుల్లో 48.18 లక్షల కేసులు, దిగువ కోర్టులతో కలిపి మొత్తంగా 3.23 కోట్ల కేసులు అపరిష్కృతంగా ఉన్నాయి.

అందరూ బాధ్యత వహించాల్సిందే..
అయితే, కొవిడ్‌ మహమ్మారితో అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవం కల్పించేందుకు భారత్‌ బహుళ రీతుల్లో సంస్కరణలు చేపడుతోంది. ఇదే రీతిన న్యాయవ్యవస్థలో అపరిష్కృత కేసుల పరిష్కారానికి నడుంకడితే పెట్టుబడులు పెట్టేవారిలో గొప్ప విశ్వాసం నెలకొంటుందనే అభిప్రాయాలున్నాయి. న్యాయమూర్తుల ఖాళీల భర్తీ, కృత్రిమ మేధ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం, న్యాయవితరణలో గుణాత్మక, పరిమాణాత్మక మార్పులు వంటివి ప్రస్తుతం న్యాయసంస్కరణల్లో భాగంగా మారాల్సిన అంశాలు. భారత్‌కు ఇప్పుడివి తప్పనిసరి అవసరాలు. వ్యవస్థను సంస్కరించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ఈ దిశగా అడుగేసేందుకు ప్రతి మండలానికి కనీసం ఒక కోర్టు ఉండాలి. ప్రతి కోర్టులో తగినంతమంది న్యాయమూర్తులు, సిబ్బంది తప్పనిసరి. కోర్టులు సైతం రోజుకి ఎనిమిది గంటలు పని చేయాలి. ప్రతి కేసుకి నిర్దిష్ట కాలపరిమితి ఉండాలి. న్యాయస్థానాలు కాలపరిమితి విధించుకుని స్వీయ నియంత్రణ ఏర్పాటు చేసుకోవాలి. కేసు విచారణ పూర్తయ్యాక తీర్పును రిజర్వ్‌లో ఉంచటాన్ని సాధ్యమైనంత వరకు పరిహరించాలి.

- డాక్టర్‌ జి.పద్మజ, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, డా.అంబేడ్కర్‌ న్యాయ కళాశాల, హైదరాబాద్‌

ఇదీ చదవండి: బడిగంటలపై డోలాయమానం.. నిర్వహణలో సవాళ్లు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.