ETV Bharat / opinion

ఆహార శుద్ధిలో భారతదేశ స్థానమెక్కడ?

author img

By

Published : Feb 13, 2021, 7:32 AM IST

దేశంలో ఆహార పంటల దిగుబడి బాగానే ఉన్నా.. వాటిని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేయకపోవటం వల్ల ఏటా కోట్ల టన్నుల ఆహారం వృధా అవుతోంది. పంట కోత దగ్గర నుంచే సరైన రీతిలో ఉపయోగించుకోగలిగితే.. ఆహార వృధాను అదుపుచేయగలం. ఆహార శుద్ధిపై రైతుకు సరైన అవగాహన కల్పించి.. ఈ రంగంలో వారికి సరైన అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వాలు ముందడుగు వెయ్యాలి. అదేవిధంగా.. శుద్ధి చేసి, ప్యాక్‌ చేసిన ఆహార నాణ్యతపై నియంత్రణ దృష్టిసారిస్తే దేశీయ ఉత్పత్తులకు అంతర్జాతీయ విపణిలో గీరాకీ సాధించవచ్చు.

food processing industries has to establish for the food security in india
ఆహార శుద్ధిలో భారతదేశ స్థానమెక్కడ?

ఎన్నో వ్యయప్రయాసలకోర్చి రైతులు పండిస్తున్న పంటలకు గిట్టుబాటు ధరలు లభించడంలేదు. ధాన్యాల నాణ్యత తగ్గి, వృథా పెరుగుతోంది. ఇలాంటి సమస్యలను అధిగమించాలంటే పంట విలువను పెంచాలి. తినేందుకు సిద్ధం చేసిన (ఫుడ్‌ ప్రాసెసింగ్‌) పదార్థాలను వినియోగదారుడికి అందించడం మెరుగైన పరిష్కారం. అందుకే ఆహార శుద్ధి పరిశ్రమల ఆవశ్యకత ఏర్పడింది. అన్నదాతలను ఈ రంగం వైపు మళ్ళించేందుకు ప్రభుత్వాలు దృష్టిపెట్టాలి. దేశ జనాభాలో 50శాతం కంటే ఎక్కువ ప్రజలు వ్యవసాయాన్నే నమ్ముకున్నారు. వారిలో పది శాతమైనా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ వంటి రంగాలను అందిపుచ్చుకోలేని దుస్థితి నెలకొంది. ఆహార భద్రత, నాణ్యత, సుస్థిరతకు గిరాకీ పెరుగుతున్న తరుణంలో- శుద్ధి చేసిన, ప్యాక్‌ చేసిన ఆహారానికి గిరాకీ అధికమవుతోంది.
అన్ని రంగాలకూ ప్రయోజనం
ప్రపంచ ఆహార శుద్ధి పరిశ్రమ విలువ ప్రస్తుతం రెండు లక్షల కోట్ల డాలర్లు. ఇందులో చైనా, అమెరికా, బ్రెజిల్‌ తరవాతి స్థానంలో భారత్‌ ఉంది. విపణి సామర్థ్య సూచీ (ఎంపీఐ) అధ్యయనం ప్రకారం ఈ రంగంలో మన దేశం ఎంతో పురోగమించినా- చైనా మనకంటే రెట్టింపు వృద్ధిని నమోదు చేస్తోంది. కరోనా సంక్షోభం నేపథ్యంలో అంతర్జాతీయ విపణిలో చైనాపట్ల ఉన్న ప్రతికూలత భారత్‌కు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇదే అదనుగా ప్రభుత్వాలు ఆహార శుద్ధి యూనిట్ల(ఎఫ్‌పీయూ)ను విరివిగా నెలకొల్పేందుకు చొరవ చూపాలి. 2050 నాటికి భారత్‌, చైనా, ఇండొనేషియా, ఫిలిప్పీన్స్‌, పాకిస్థాన్‌లలోని మొత్తం జనాభా ప్రపంచంలో సగానికి పైగా ఉంటుందని అంచనా. రానున్న పదేళ్లలో అమెరికా, యూకే, కెనడా ఫ్రాన్స్‌ ప్రజల కొనుగోలు శక్తిని చైనా, భారత్‌, బ్రెజిల్‌, మెక్సికో అధిగమించే సూచనలున్నాయని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఆ అవకాశాల్ని ఒడుపుగా అందిపుచ్చుకోవాలంటే ఇప్పటి నుంచే పావులు కదపాలి. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగానికి చేయూతనిచ్చే దిశగా కేంద్రం ఎన్నో చర్యలు చేపట్టింది. సులభంగా పారిశ్రామిక అనుమతులు లభించాలి. వందశాతం ఎగుమతి ఆధారిత యూనిట్ల స్థాపన చేపట్టాలి.

పోషకాహార లోపం ఉన్న ప్రతి ముగ్గురు పిల్లల్లో ఒకరు భారత్​లోనే..!

ప్రశాంత చిత్తమే మానసిక ఆరోగ్యానికి బలం!

సామర్థ్యం ఉన్నా వెనకే!

న దేశ ఉద్యాన, సాగు ఉత్పత్తులకు మధ్య ప్రాచ్య, దక్షిణ ఆసియా, ఐరోపా యూనియన్‌, అమెరికాలలో గిరాకీ ఉంది. 2019 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ ఉత్పత్తులు, శుద్ధి చేసిన ఆహారం ఎగుమతుల విలువ 3,800 కోట్ల డాలర్లు. అందులో బాసుమతి బియ్యం, మాంసం వాటాయే అధికం. ఇవేకాక మన సుగంధ ద్రవ్యాలు, మసాలాలు, మామిడిపండ్లు, చిరుతిళ్ల(స్నాక్స్‌)కు ప్రపంచ విపణిలో గిరాకీ ఉంది. పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో చైనా తరవాత భారత్‌ రెండో స్థానంలో ఉంది. వాటిని ప్రాసెస్‌ చేయడంలో మాత్రం అయిదో స్థానంలో కొనసాగుతోంది. పండించేందుకు ఉత్సాహం ఉన్నా.. వాటిని శుద్ధి చేసే వెసులుబాటు లేక వృథా ఎక్కువవుతోంది. పదేళ్ల కిందట తెలుగు రాష్ట్రాల రైతులు పెద్దయెత్తున ఈము పక్షుల పెంపకం చేపట్టారు. రాష్ట్రాల్లో ప్రాసెస్‌ యూనిట్లు లేక పెంచిన రైతులంతా దివాలా తీశారు. కేరళలో అరటి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో బొప్పాయి, ఉల్లి వృథా ఎక్కువగా ఉంటోంది. వీటిని సరైన పద్ధతిలో ప్రాసెస్‌ చేసి అంతర్జాతీయ విపణిలో పెట్టవచ్చు. తమిళనాడు ప్రభుత్వం తన సొంత ఆహార ప్రాసెసింగ్‌ విధానాన్ని రూపొందించుకుంది. కొత్తగా ఈ రంగంలోకి వచ్చేవారిని ప్రోత్సహించి, ఆర్థికంగా ఆసరా ఇస్తోంది.

ఆరోగ్య భారతావని సాక్షాత్కరించేది అప్పుడే!

ఆహార భద్రతకు కొత్తరూపునిచ్చే దిశగా అడుగులు

ఆర్థిక వ్యవస్థలో కీలకమైన వ్యవసాయం, పరిశ్రమలను ఆహారశుద్ధి యూనిట్లతో అనుసంధానిస్తే ఆ రెండింట్లోనూ గణనీయ వృద్ధి సాధ్యమవుతుంది. దేశంలో చాలా రాష్ట్రాలతో పోలిస్తే తెలుగురాష్ట్రాల్లో యూనిట్ల సంఖ్య తక్కువగా ఉంది. మహారాష్ట్రలో 60,106, తమిళనాడులో 59,059, గుజరాత్‌లో 27,126, కర్ణాటకలో 26,131 యూనిట్లు ఉండగా- ఆంధ్రప్రదేశ్‌లో 11,173, తెలంగాణలో 12,530 ఎఫ్‌పీయూలు ఉన్నాయి. వ్యవసాయ, తయారీ రంగాలకు ఆహార శుద్ధి కేంద్రాలు వారధిగా ఉండటంవల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా పలువురికి ఉపాధి లభిస్తుంది. ఈ కేంద్రాలు ధాన్యాల నాణ్యత పెంచుతాయి. ఖనిజాలు, ప్రొటీన్లు ఉన్న ఆహారాన్ని దేశానికి అందిస్తాయి. ముఖ్యంగా పంట కోతల తరవాత దేశంలో రూ.92వేల కోట్ల మేర ధాన్యం వృథా అవుతోందని నీతిఆయోగ్‌ వార్షిక నివేదిక అంచనా వేసింది. ఈ నష్టం తగ్గించాలంటే అవసరమైన శీతల గిడ్డంగులు ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం దేశంలో ఉన్న 60శాతం గిడ్డంగులు ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌లోనే ఉన్నాయి. అక్కడ ఆలుగడ్డలే అధికంగా నిల్వ చేస్తున్నారు. అంతకు మించి పోషకాలున్న ఉత్పత్తులను వివిధ రాష్ట్రాలు పండిస్తున్నాయి. అవి వృథా కాకుండా శీతల గిడ్డంగులు విస్తరించాలి. ఎఫ్‌పీయూలతో వాటి గ్రేడింగ్‌, ఉత్పత్తులకు అదనపు పదార్థాలు కలిపి ప్యాకింగ్‌ చేస్తే విలువ పెరిగి అన్నదాతకు ఆదాయం వస్తుంది.

అవగాహన, అవకాశాలు అవసరం
కేంద్ర ప్రభుత్వం ఆహార శుద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా ఈ రంగంలో పెట్టుబడులు పెంచడానికి ఇప్పటికే చర్యలు చేపట్టింది. దేశం నుంచి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను 2022 నాటికి 4.35 లక్షల కోట్ల రూపాయలకు పెంచాలని కేంద్ర ప్రభుత్వ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల విధానం-2018 తీసుకొచ్చింది. ఇది ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలకు మంచి పరిణామం. 2020-21 ఆర్థిక సంవత్సరానికి పోషకాహార సంబంధిత కార్యక్రమాల కోసం బడ్జెట్‌ను 22శాతం పెంచి రూ.35,600 కోట్లు ప్రకటించారు. కేంద్రం మెగా ఫుడ్‌ పార్క్‌ పథకం కింద దేశవ్యాప్తంగా 37 ఆహార పార్కులను మంజూరు చేసింది. ఇందులో ఇప్పటికే 20 పని మొదలుపెట్టగా మరో 17 త్వరలో ప్రారంభం కానున్నాయి. వీటిని రైతులు పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా చూడాలి.

రైతుకు సాయంతోనే ఆత్మనిర్భర్‌

తరుముతున్న నీటి సంక్షోభం- మేల్కొనకపోతే గడ్డు కాలం

రుణ లభ్యత..
ఆహార శుద్ధి రంగంపై అన్నదాతకు పూర్తి అవగాహన, అవకాశాలు కల్పిస్తే- మద్దతు ధర, ఎరువుల కోసం ఇచ్చే రాయితీల వైపు చూడాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా ఎగుమతులకు అవసరమైన నాణ్యతతో పంటలు పండించేలా రైతులకు ప్రభుత్వాలు శిక్షణ ఇవ్వాలి. అప్పడాలు, పాల ఉత్పత్తుల్లో అక్కడక్కడ విజయం సాధించిన మహిళా సంఘాలను స్ఫూర్తిగా తీసుకొని గ్రామాల్లో ప్రాసెసింగ్‌ యూనిట్లు నెలకొల్పేలా రైతులను ప్రేరేపించాలి. తక్కువ పెట్టుబడితో స్థాపించే ఎఫ్‌పీయూలకు రుణాలు సులభంగా లభించేలా బ్యాంకర్లను ఒప్పించాలి. కర్షకులు తయారు చేసిన ఆహార పదార్థాలను అంగన్‌వాడీలు, పాఠశాలలు, ప్రభుత్వ వసతి గృహాలు, ఆసుపత్రులకు అందేలా ప్రభుత్వాలు వారధిగా ఉండాలి. పంట ఉత్పత్తుల రవాణాకు టోల్‌ట్యాక్స్‌ మినహాయింపు, వాహన, యంత్ర సామగ్రికి రుణాలు ఇవ్వాలి. కిసాన్‌ రైలు తరహా సదుపాయాలు విరివిగా వినియోగంలోకి తేవాలి.

వ్యవసాయ సంబంధ అంకుర పరిశ్రమలతో రైతుల పంటలను అనుసంధానించాలి. నేరుగా రైతుకే ఆదాయం వస్తుందన్న నమ్మకం కల్పిస్తే అన్నదాతే ఈ రంగంలో అంకురాలు స్థాపించగలడు. రైతులు ఆ స్థాయికి చేరువైతే ప్రపంచ మార్కెట్లో మన ఆహార పదార్థాలకు మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది.

- బండపల్లి స్టాలిన్‌

ఇవీ చదవండి: 'సరైన తిండి తినకపోతే రూ.11 లక్షల కోట్లు ఖర్చు'

భారత రోడ్లపై త్వరలోనే విద్యుత్​ కార్ల జోరు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.