LIVE : తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల మీడియా సమావేశం - ప్రత్యక్ష ప్రసారం - బీఆర్ఎస్ ప్రెస్మీట్
🎬 Watch Now: Feature Video
Published : Jan 12, 2024, 12:14 PM IST
|Updated : Jan 12, 2024, 6:44 PM IST
BRS Leaders Press Meet at Telangana Bhavan Live : తాజా రాష్ట్ర రాజకీయాలు, పార్లమెంటు ఎన్నికలు 2024, ఎమ్మెల్సీ ఎన్నికలపై తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్సీ ఉపఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం తీరుపై వారు ప్రసంగిస్తున్నారు. కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి రాజీనామాలతో ఏర్పడిన ఎమ్మెల్సీ స్థానాల ఖాళీల షెడ్యూల్ నోటిఫికేషన్ను కేంద్ర ఎన్నికల సంఘం జనవరి 4వ తేదీన విడుదల చేసింది. రెండు స్థానాలకు వేర్వేరుగా ఉప ఎన్నికను నిర్వహిస్తున్నట్లు తెలుపు, గులాబీ రంగుల బ్యాలెట్ పేపర్లను వినియోగిస్తున్నట్లు చెప్పింది. ఈ నేపథ్యంలో ఈసీ పత్రికా ప్రకటనను రద్దు చేస్తూ మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు, బీఆర్ఎస్ అధికరా ప్రతినిధి కార్తీక్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై గురువారం విచారణ జరిపిన సీజేతో కూడుకున్న ధర్మాసనం ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ విషయంపై బీఆర్ఎస్ నేతలు మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. అలాగే త్వరలో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పార్టీ నేతలను బలోపేతం చేస్తూ 17 పార్లమెంటు నియోజకవర్గాల నేతలతో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు.