వాస్తవానికి దక్షిణ ముఖంగా ఉండే బాల్కనీకి ఎండ రోజంతా ఉంటుంది. కానీ ఏ కారణంతో పాక్షిక నీడ వస్తుందో తెలియదు. ఇలాంటి చోట్ల కొన్ని కూరగాయలు పెంచుకోవచ్ఛు అయితే అవి నెమ్మదిగా పెరుగుతాయి. సాధారణంగా రోజుకు 6 గంటలు సూర్యరశ్మి అందితేనే చాలా రకాల కూరగాయాలు, పూల మొక్కలు పెరుగుతాయి. కొన్ని దుంపలు ముఖ్యంగా క్యారెట్, బంగాళదుంప వంటివి పాక్షిక నీడలో బాగానే వస్తాయి. ఆస్పరాగస్, బ్రకోలీ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, వెల్లుల్లి, బఠాణీ, ముల్లంగి, మెంతితో పాటు ఇతర ఆకుకూరల్నీ సులువుగా పెంచుకోవచ్ఛు టొమాటో, వంగ వంటివి పెంచితే, రోజూ రెండుగంటలు ఎండలో ఉంచాలి. పీస్‌లిల్లీ, ఆంథూరియం, బిగోనియా, ఆఫ్రికన్ వయొలెట్ వంటి పూల మొక్కలూ పెంచుకోవచ్ఛు.
ఎరువులు అవసరం... పాక్షిక నీడలో మొక్కల్ని పెంచేటప్పుడు వాటికి బలమైన ఎరువులు అందించాలి. ఇలాంటి చోట్ల సాధారణంగా వేరు సంబంధిత చీడ-పీడల సమస్య ఉంటుంది. ఒకవేళ చెట్టు నీడపడినా లేదా తరచుగా బిల్డింగ్ రూఫ్ వల్ల నీడ వచ్చినా అప్పుడప్పుడూ ఎండలో ఉంచాలి. రోజు వదిలి రోజు నీటిని అందించాలి. నీడ, చల్లదనం వల్ల నత్తల సమస్య ఎక్కువగా ఉంటుంది. గుడ్డుపెంకులు వేస్తే నత్తల సమస్య ఉండదు.