ETV Bharat / lifestyle

ఈ మహమ్మారిని జయించాలంటే మాస్క్‌ మరిచిపోవద్దు!

మాస్క్‌, స్వీయ పరిశుభ్రత, సామాజిక దూరం... కరోనాను సాధ్యమైనంతవరకు కట్టడి చేయాలంటే ఈ మూడింటినీ మన జీవన విధానంలో భాగం చేసుకోవాల్సిందే. ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు వైద్య నిపుణులు, ప్రభుత్వాలు కూడా ఇదే సూచిస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే చాలామంది ఈ జాగ్రత్తలను పాటిస్తున్నారు. అయితే ‘మనకేం కాదులే’ అనుకుంటూ కొద్దిమంది ఈ జాగ్రత్తలు పాటించడంలో తీవ్ర అలసత్వం వహిస్తున్నారు. ఈక్రమంలో ఈ చిన్న పాటి అజాగ్రత్తలే అందరినీ సమస్యల్లోకి నెడుతున్నాయని హెచ్చరిస్తూ ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం ట్విట్టర్‌ వేదికగా ఒక యానిమేటెడ్‌ వీడియోను విడుదల చేసింది.

this animated corona virus video is a must watch

author img

By

Published : Jul 27, 2020, 1:59 PM IST

కరోనాపై అవగాహన కోసం!

భారతదేశానికి సంబంధించి కరోనా ప్రభావం అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఉత్తర ప్రదేశ్‌ కూడా ఒకటి. దీంతో రోజురోజుకీ పెరుగుతున్న కరోనా కేసులను తగ్గించడానికి అక్కడి ప్రభుత్వం వివిధ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కరోనా వైరస్‌ వ్యాప్తిపై ప్రజల్లో మరింత అవగాహన తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈక్రమంలో తాజాగా తమ అధికారిక ట్విట్టర్‌ పేజీలో ఒక యానిమేటెడ్‌ వీడియోను పోస్ట్‌ చేసింది.

అలసత్వం వద్దు!

ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో కొంతమంది మాస్క్‌ ధరించకుండానే స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు. మరికొందరు ముక్కు, నోటిని పూర్తిగా కవర్‌ చేయకుండా నామమాత్రంగా మాస్క్‌ ధరిస్తున్నారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు మాస్కులు తీయడమో, అదేవిధంగా గాలి ఆడట్లేదంటూ మాస్క్‌ను గడ్డం కిందకు తోయడమో చేస్తున్నారు. ఈక్రమంలో మాస్క్‌ ధరించకపోయినా, ముక్కు, నోటిని పూర్తిగా కవర్‌ చేయకుండా మాస్క్‌ ధరించినా ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ఈ యానిమేటెడ్‌ వీడియోలో స్పష్టంగా చూడొచ్చు. అదేవిధంగా ముక్కు, నోరు పూర్తిగా కవరయ్యేలా ధరించిన మాస్క్‌తో ఈ మహమ్మారి నుంచి ఎలా రక్షణ పొందవచ్చో ఇందులో చూడొచ్చు. వీటితో పాటు స్వీయ పరిశుభ్రత, సామాజిక దూరం లాంటి జాగ్రత్తలు పాటిస్తే ఈ వైరస్‌ నుంచి మనల్ని మనం ఎలా రక్షించుకోవచ్చో ఈ వీడియోలో ఉంది.

  • कोरोना वायरस के संक्रमण से बचने के लिए हमें सार्वजनिक स्थानों पर मास्क लगाना अत्यंत आवश्यक है। पर ध्यान रहे, घर आते ही मास्क को धोना भी बहुत जरूरी है।

    इसके साथ ही सोशल डिस्टेंसिंग का भी विशेष ध्यान रखना है।

    ध्यान रहे,
    कोरोना को हराना है तो मास्क जरूर लगाना है!@ShishirGoUP pic.twitter.com/XEg0AecAVh

    — Government of UP (@UPGovt) July 21, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కరోనాను జయించాలంటే మాస్క్‌ మరిచిపోవద్దు!

‘మనం కరోనాను జయించాలంటే మాస్క్‌ను ధరించాల్సిందే. ప్రత్యేకించి ఇంటి నుంచి బయటికి అడుగుపెట్టేటప్పుడు మాస్క్‌ను మరిచిపోవద్దు. అదేవిధంగా మాస్క్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోండి. వీటితో పాటు స్వీయ పరిశుభ్రత, సామాజిక దూరాన్ని కూడా పాటించండి’ అనే క్యాప్షన్‌తో పోస్ట్‌ చేసిన ఈ వీడియో అందరినీ ఆలోచింపచేస్తోంది. ఈక్రమంలో నెటిజన్లందరూ ‘థ్యాంక్యూ, వెరీ క్రియేటివ్‌, సూపర్బ్‌ వీడియో’ అని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
గతంలోనూ!

కరోనాకు సంబంధించి ఇలా యానిమేటెడ్‌ వీడియోలు విడుదల చేయడం ఇదే మొదటిసారి కాదు. ఇంట్లోనే ఉండడం, సామాజిక దూరం పాటిస్తే కరోనాను ఎలా కట్టడి చేయొచ్చో అవగాహన కల్పిస్తూ కొద్ది రోజుల క్రితం పుణె సిటీ పోలీసులు ఇలాగే ఓ యానిమేటెడ్‌ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియో కూడా నెటిజన్లను తెగ ఆకట్టుకోవడంతో పాటు ఆలోచింపచేసింది. ఇక ముంబై పోలీసులు సినిమాలు, సీరియల్స్‌లో బాగా ప్రాచుర్యం పొందిన వివిధ క్యారక్టర్లు, ఫొటోలతో క్రియేటివ్‌ పోస్టులను సృష్టిస్తూ కరోనా వైరస్‌పై అవగాహన కల్పిస్తున్నారు.

ఇదీ చూడండి: రాష్ట్రపతికి పదో తరగతి కుర్రాడు లేఖ.. ఎందుకంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.