బొప్పాయి పండుతో ఆరోగ్యమే కాదు అందమూ సొంతం చేసుకోవాలంటే ఈ చిట్కా పాటించి చూడండి..
పావుకప్పు బొప్పాయి ముక్కల్లో రెండు చెంచాల చిక్కటిపాలు, చెంచా తేనె వేసి బాగా మెత్తగా ముద్దలా చేయాలి. దీన్ని ముఖం, మెడకు పట్టించాలి. వారంలో రెండుసార్లు ఈ పూతను ప్రయత్నించాలి. తేనె చర్మానికి తేమను అందించి మృదువుగా ఉండేలా చేస్తుంది. అలాగే పాలలోని లాక్టిక్ యాసిడ్ చర్మంపై పేరుకుపోయిన మృతకణాలను తొలగిస్తుంది.