అల్పాహారంగా: అటుకులతో చేసిన పోహా, ఇడ్లీ, దోసె వంటివి ఉదయం అల్పాహారంగా ఇవ్వాలి. వీలైతే సీజనల్ పండ్లను కూడా చేర్చండి. ఒకవేళ అలా నచ్చకపోతే తాజా పండ్లను మిల్క్‌షేక్స్‌లా చేసిస్తే విటమిన్ల లోపం ఉండదు.
అన్నం తప్పనిసరి: మధ్యాహ్న భోజనాన్ని పిల్లలు తప్పనిసరిగా తీసుకోవాలి. తాజాకూరగాయలతో చేసిన కూరలు, పప్పుతోపాటు చిక్కుడు, బీన్స్ తప్పనిసరిగా ఉండేట్టు చూడాలి. ఉడకబెట్టిన రాజ్మా, సెనగలను రోజులో ఏదో ఒక సమయంలో స్నాక్స్‌లా ఇవ్వాలి.
విటమిన్ బి12: పెరుగు, ఎండుద్రాక్షల్లో విటమిన్ బి12, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. సాయంత్రంపూట వీటిని విడిగా కూడా పిల్లలకు తినిపిస్తే మంచిది.
ఏడు గంటలకే: సాయంత్రం ఏడింటికల్లా పిల్లలకు భోజనంపెట్టేయాలి. ఇందులో గోధుమ, జొన్నపిండితో చేసిన చపాతీలతోపాటు అన్నం కూడా కొద్దిగా ఉండాలి. పోషకవిలువలతో కూడిన ఈ ఆహారం పిల్లల్లో ఆరోగ్యకరమైన ఎదుగుదలకు తోడ్పడుతుంది.
నిద్రకు ముందు: రాత్రిపూట నిద్రకు ముందు పసుపు వేసిన గోరువెచ్చని పాలు లేదా ఏదైనా మిల్క్ షేక్‌ను తాగించాలి. పిల్లలు ఇష్టపడకపోతే ఒక అరటిపండు తినిపించాలి. దీంతో త్వరగా నిద్రపోతారు. తెల్లవారేవరకు తిరిగి ఆకలి వేయదు. ఇది వారిలో నిద్రలేమిని దూరం చేసి, ఉదయంపూట ఉత్సాహంగా నిద్రలేచేలా చేస్తుంది.