ETV Bharat / lifestyle

పుచ్చకాయతో పాటు గింజలూ తినాలట.. ఎందుకో తెలుసా?

వేసవికాలంలో అందరూ పుచ్చకాయలు తింటారు. అందులో చాలామంది పుచ్చకాయ గింజలు పడేస్తుంటారు. మీరూ అలాగే చేస్తున్నారా? అయితే పోషకాలను పడేస్తున్నట్లే మరి. పుచ్చకాయ గింజల్లో దాగి ఉన్న పోషకాలేంటో తెలుసుకుందాం రండి..!

watermelon uses, watermelon seeds benefits
పుచ్చకాయగింజలతో ఉపయోగాలు, పుచ్చకాయ గింజలతో లాభాలు
author img

By

Published : Apr 21, 2021, 3:21 PM IST

వేసవిలో మండుటెండల నుంచి ఉపశమనం పొందాలంటే పుచ్చకాయకు మించిన పండు మరొకటి లేదు. దాదాపు 95 శాతం నీటిని నింపుకొన్న ఈ సీజనల్‌ ఫ్రూట్‌లో శరీరానికి చలువనిచ్చే గుణాలు పుష్కలంగా ఉంటాయి. అయితే చాలామంది ఈ పండును తినేటప్పుడు గింజలను పక్కన పడేస్తుంటారు. మరికొంతమంది తినేందుకు సులభంగా ఉంటుందని గింజలు లేని పుచ్చకాయ ముక్కలను కొని తెచ్చుకుంటారు. అయితే ఇలా పుచ్చకాయ గింజలను పక్కన పెట్టేయడమంటే చేతికందిన పోషకాలను దూరం చేసుకున్నట్లేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రొటీన్లు, విటమిన్లు లాంటి పోషకాలు వీటిలో పుష్కలంగా ఉంటాయని వారు సూచిస్తున్నారు.

పండ్లలోనే కాదు.. గింజల్లోనూ!

పుచ్చకాయ పండులో ఉన్న పోషక విలువల్లో ఎక్కువ భాగం వాటి గింజల నుంచే లభిస్తుంది. వీటిలో ప్రొటీన్లు, విటమిన్స్‌తో పాటు మెగ్నీషియం, ఐరన్‌, పొటాషియం, కాపర్‌, జింక్‌, మాంగనీస్‌, ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందించడమే కాకుండా చర్మం, జుట్టు సంరక్షణలోనూ కీలక పాత్ర పోషిస్తాయి.

watermelonseedsbenefitsghg650-5.jpg
అందం ఆరోగ్యం

చర్మ సంరక్షణకు..

ముఖంపై ముడతలు తొలగిపోయి మిలమిలలాడాలంటే పుచ్చకాయ గింజలను డైట్‌లో భాగం చేసుకోవాల్సిందే. ఇందులోని మెగ్నీషియం, జింక్‌ ఇతర ఖనిజ లవణాలు చర్మంలోని విష తుల్యాలను తొలగిస్తాయి. వృద్ధాప్య ఛాయలు రాకుండా అడ్డుపడతాయి. వీటిని డైరెక్టుగా తీసుకోవడం ఇష్టం లేకపోతే వేయించుకుని తినచ్చు. ఈ గింజల్లో నీటి శాతం కూడా అధికంగా ఉంటుంది. అందుకే తామర లాంటి చర్మవ్యాధుల చికిత్సా విధానాల్లో వీటిని ఎక్కువగా వాడుతుంటారు.

watermelonseedsbenefitsghg650-8.jpg
పట్టులాంటి కురులు

కురుల ఆరోగ్యాన్ని కాపాడతాయి!

చర్మమే కాదు కురుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఎన్నో పోషకాలు పుచ్చకాయ గింజల్లో ఉంటాయి. ఇందులోని ప్రొటీన్లు, ఐరన్‌, మెగ్నీషియం, జింక్‌ తదితర ఖనిజ లవణాలు శిరోజాల కుదుళ్లను బలంగా ఉంచడంలో తోడ్పడతాయి. జుట్టు పొడవుగా పెరిగేందుకు సహకరిస్తాయి. ఈ గింజల్లోని మాంగనీస్‌ జుట్టు రాలిపోవడాన్ని బాగా నిరోధిస్తుంది. కురులకు మృదుత్వాన్ని చేకూర్చి సిల్కీగా మార్చడంలో ఇందులోని కాపర్‌ కీలక పాత్ర పోషిస్తుంది.

watermelonseedsbenefitsghg650-1.jpg
గుండె జబ్బులకు దూరం

గుండె జబ్బులను తగ్గిస్తాయి!

పుచ్చకాయ గింజల్లో మోనో అన్శ్యాచురేటెడ్‌, పాలీ అన్శ్యాచురేటెడ్‌ ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని డైట్‌లో చేర్చుకోవడం ద్వారా గుండె నొప్పి, గుండెపోటు, మధుమేహం లాంటి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. ఇక మాంగనీస్‌ రక్తపోటులో హెచ్చుతగ్గులను నివారిస్తే... శరీరంలోని వివిధ భాగాలకు రక్తాన్ని చేరవేయడంలో ఐరన్‌ కీలక పాత్ర పోషిస్తుంది.

watermelonseedsbenefitsghg650-4.jpg
ఎముకలకు బలం

ఎముకల ఆరోగ్యం!

సాధారణంగా వయసు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనంగా మారిపోతాయి. చిన్న చిన్న దెబ్బలు తగిలినా చాలా రోజుల పాటు వెంటాడుతుంటాయి. ఈ క్రమంలో పుచ్చకాయ గింజలను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా ఈ సమస్యలను అధిగమించవచ్చు. ఈ గింజల్లోని మెగ్నీషియం, కాపర్‌, పొటాషియం వంటి పోషకాలు ఆస్టియోపొరోసిస్ లాంటి వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. కండరాలను దృఢంగా మార్చుతాయి.

watermelonseedsbenefitsghg650-3.jpg
చక్కెర స్థాయి నియంత్రణ

చక్కెర స్థాయులను నియంత్రిస్తాయి!

పుచ్చకాయ గింజల్లో విటమిన్లు- ఎ, సి, బి6 పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలోని చక్కెర స్థాయుల్లోని హెచ్చుతగ్గులను నియంత్రిస్తాయి. మధుమేహం లాంటి వ్యాధులు రాకుండా కాపాడతాయి. ప్రత్యేకించి రక్తంలోని చక్కెర స్థాయులపై ప్రత్యక్ష ప్రభావం చూపే కార్బొహైడ్రేట్లను క్రమబద్ధీకరించడంలో మెగ్నీషియం కీలకపాత్ర పోషిస్తుంది.

watermelonseedsbenefitsghg650-6.jpg
జ్ఞాపకశక్తి పెంచే గుణాలు

జ్ఞాపకశక్తి పెంపొందడానికి!

పుచ్చకాయ గింజల్లో శరీరానికి శక్తినిచ్చే గుణాలు అధికంగా ఉంటాయి. ప్రత్యేకించి ఇందులోని ఫ్యాటీ యాసిడ్స్‌ ఆకలి కోరికలను అదుపు చేస్తాయి. కడుపు నిండిన అనుభూతిని ఇస్తాయి. ఇక ఇందులోని విటమిన్‌-బి, ఐరన్, ఇతర ఖనిజ లవణాలు రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. మెదడు పనితీరు మెరుగుపడి జ్ఞాపకశక్తి పెంపొందడంలో ఈ గింజల్లోని ఫోలిక్‌ యాసిడ్‌ బాగా పనిచేస్తుంది.

ఇలా తినచ్చు!

సాధారణంగా చాలామంది పుచ్చకాయ గింజలను ఎండబెట్టి తింటుంటారు. ఇలా డైరెక్టుగా తినడం ఇష్టం లేకపోతే వేయించుకుని తినచ్చు. అదేవిధంగా వీటిని పొడిగా చేసుకుని వివిధ రకాల ఫ్రూట్‌ సలాడ్స్‌, సూప్స్‌, స్మూతీలలో కలుపుకొని తీసుకోవచ్చు.

సో.. చూశారుగా.. పుచ్చకాయ గింజలతో ఎన్ని ప్రయోజనాలున్నాయో! మరి మీరు కూడా వీటిని పారేయకుండా డైట్లో భాగం చేసుకోండి. చర్మం, జుట్టును సంరక్షించుకోవడంతో పాటు ఆరోగ్యాన్నీ కాపాడుకోండి.

ఇదీ చదవండి: పాలిచ్చే తల్లులూ.. ఈ విషయాల్లో జాగ్రత్త!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.