ETV Bharat / lifestyle

ఎండలో నుంచి ఇంటికి రాగానే.. చల్లని నీళ్లు తాగుతున్నారా?

శరీరానికి సరిపడా నీరు తాగకపోతే బాడీ డీహైడ్రేషన్‌కు గురవుతుంది. ఫలితంగా జీవక్రియల రేటు కుంటుపడుతుంది. అందుకే రోజూ క్రమం తప్పకుండా 8 నుంచి 10 గ్లాసుల నీరు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. పైగా ఇప్పుడు వేసవి కాలం. రోజురోజుకీ పెరిగే ఉష్ణోగ్రతలతో మనం ఎన్ని నీళ్లు తాగినా చెమట రూపంలో ఆవిరైపోతుంటాయి. తద్వారా శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. అలాగని అదే పనిగా ఎక్కువగా మంచి నీటిని తాగాలనిపించదు. ఈ క్రమంలో వేసవిలో కొన్ని చిట్కాలు పాటిస్తే డీహైడ్రేషన్ సమస్యలను అధిగమించవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.

tips to get relief from body dehydration in summer
ఎండలో నుంచి ఇంటికి రాగానే.. చల్లని నీళ్లు తాగుతున్నారా?
author img

By

Published : Mar 18, 2021, 2:52 PM IST

తల తిరిగినట్లనిపించడం, వికారం, కాళ్ల నొప్పులు, మూత్రం తక్కువ రావడం, మూత్రం రంగు ముదురుగా ఉండడం, నోరెండిపోవడం, శరీరం వేడెక్కడం... వంటివన్నీ డీహైడ్రేషన్ (శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం) లక్షణాలే. ఒక్కోసారి ప్రాణాపాయ స్థితికి చేరే ప్రమాదం లేకపోలేదు. ఈ నేపథ్యంలో ఎండాకాలంలో డీహైడ్రేషన్‌ ఉంచి ఉపశమనం పొందేందుకు ఆరోగ్య నిపుణులు చెబుతున్న చిట్కాలేంటో తెలుసుకుందాం రండి.

tipforhydrationghg650-4.jpg
జీలకర్ర

జీలకర్ర

వంటల్లో తాలింపుకి అధికంగా వినియోగించే జీలకర్ర శరీరంలో నీటి శాతం తగినంత ఉండేలా (హైడ్రేటెడ్‌గా) చేయడంలోనూ బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపిస్తుంది. బాడీలో ఉండే వేడిని తగ్గిస్తుంది. దురదలు, మొటిమలు వంటి సమస్యల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఇలా అందం, ఆరోగ్యపరంగా రెండు విధాలా ప్రయోజనాలు కలిగించే జీలకర్రను శరీరం డీహైడ్రేట్‌ కాకుండా ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం రండి.

ఒక టేబుల్‌ స్పూన్ జీలకర్ర, కొద్దిగా పటిక బెల్లం తీసుకుని గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయాన్నే ఈ మిశ్రమాన్ని వడకట్టి ఆ నీటిని తాగాలి. జీలకర్ర పొడిని తయారుచేసుకుని పెరుగు లేదా మజ్జిగలో కలిపి తాగినా మంచి ఫలితాలుంటాయి.

tipforhydrationghg650-5.jpg
లెమన్‌గ్రాస్‌ టీ

లెమన్‌గ్రాస్‌ టీ

యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్‌, యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు అధికంగా ఉండే లెమన్‌గ్రాస్‌ శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. శరీరంలో అనవసరమైన కొవ్వులను తగ్గించి రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. అజీర్తి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. పేగుల పని తీరుని మెరుగుపరిచి శరీరాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న లెమన్‌గ్రాస్ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలోనూ ఎంతో ఉపయోగపడుతుంది. ఇందుకోసం ఏం చేయాలంటే...

కొద్దిగా లెమన్‌గ్రాస్‌ని తీసుకుని గోరువెచ్చని నీటిలో మరిగించాలి. పూర్తిగా మరిగిన తర్వాత వడకట్టి ఆ నీటిని తాగాలి. అలాగే లెమన్‌ గ్రాస్‌ ఆకుల్ని నీటిలో నానబెట్టి స్నానం చేస్తున్న సమయంలో ఆ ఆకుల్ని బకెట్‌లో వేసుకుని స్నానం చేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి.

tipforhydrationghg650-8.jpg
ఫ్రిజ్‌ వాటర్ వద్దు!

ఫ్రిజ్‌ వాటర్ వద్దు!

డీహైడ్రేషన్‌ నుంచి ఉపశమనం పొందడానికి మంచి నీటిని మించిన ఔషధం లేదంటారు ఆరోగ్య నిపుణులు. దాహం వేసినా, వేయకపోయినా వేసవిలో వీలైనంత ఎక్కువగా మంచినీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి. అదే సమయంలో సాధ్యమైనంతవరకు ఫ్రిజ్‌ వాటర్‌ను దూరం పెడితే మేలు. ఫ్రిజ్‌ నీటి వల్ల శరీర ఉష్ణోగ్రత పెరగడంతో పాటు గొంతునొప్పి, జలుబు, దగ్గు వంటి అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. దీనికి బదులు మట్టి కుండలోని నీళ్లు తాగడం మేలు. ఎందుకంటే మట్టి సహజసిద్ధమైన కూలింగ్‌ ఏజెంట్‌గా పని చేస్తుంది. మట్టి కుండలోని నీళ్లు తీసుకోవడం వల్ల వేసవిలో తలెత్తే జీర్ణ సంబంధిత సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు.

tipforhydrationghg650-5.jpg
నో ఆల్కహాల్!

నో ఆల్కహాల్!

మద్యపానం కారణంగా శారీరకంగా, మానసికంగా ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. ఆల్కహాల్ అధికంగా సేవించడం వల్ల శరీరం త్వరగా డీహైడ్రేషన్‌కు గురవుతుంది. కాబట్టి దీనికి ఎంత దూరంగా ఉంటే ఆరోగ్యానికి అంత మేలని నిపుణులు సూచిస్తున్నారు. ఆల్కహాల్‌ డ్రింక్స్‌కు బదులు ఓ గ్లాస్ మంచి నీరు తీసుకోవడం ఎంతో ఉత్తమం. పదే పదే మంచి నీటిని తాగేందుకు ఇష్టం లేకపోతే ఫ్రూట్‌జ్యూస్‌లు తాగడమో, పైన చెప్పిన చిట్కాలను పాటించడమో చేయండి.

tipforhydrationghg650-7.jpg
ఫ్రైడ్ ఫుడ్స్‌ను దూరం పెట్టండి..

ఫ్రైడ్ ఫుడ్స్‌ను దూరం పెట్టండి..

ఎండాకాలంలో కారం, మసాలా, నూనె పదార్థాలను పూర్తిగా తగ్గించాలి. లేదంటే శరీరంలోని నీరంతా ఆవిరైపోయి డీహైడ్రేషన్‌ మొదలవుతుంది. ఇది ఒక్కోసారి వడదెబ్బకు దారి తీస్తుంది. ప్రత్యేకించి చిప్స్‌, కుకీస్‌, ఫ్రైడ్ ఫుడ్స్‌, నాన్‌వెజ్‌ వంటకాలకు వీలైనంత దూరంగా ఉండాలి. వేసవిలో వీటిని అధికంగా తీసుకుంటే శరీరంలో అత్యధికంగా వేడి పుట్టి... చెమట ఎక్కువగా పట్టే అవకాశం ఉంది. తద్వారా శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. అలాగే అజీర్తి సమస్యలు కూడా తలెత్తుతాయి.

అదేవిధంగా చాలామంది ఎండలోంచి ఇంటికి చేరగానే లేదంటే బయటికి వెళ్లినప్పుడు చల్లదనం కోసం ఐస్‌క్రీమ్స్‌, కూల్‌ డ్రింక్స్... వంటి వాటిని ఆశ్రయిస్తూ ఉంటారు. అయితే ఇవి ఎండ వేడిమి నుంచి తాత్కాలిక ఉపశమనం కలిగించినప్పటికీ శరీరంలో అత్యధికంగా వేడి ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. అలాగే టీ, కాఫీలకు కూడా ఎంత దూరంగా ఉంటే అంత శ్రేయస్కరం. వాటిలో ఉండే కెఫీన్‌ శరీరంలోని నీటి స్థాయులను తగ్గించేస్తుంది. వీటికి బదులుగా కొబ్బరినీరు, మజ్జిగ, పెరుగుతో పాటు పుచ్చకాయ, తర్బూజా, ముంజలతో చేసిన షర్బత్ లను తాగితే డీహైడ్రేషన్‌ సమస్యలు దూరమవుతాయి. పలు ఆరోగ్య ప్రయోజనాలు కూడా చేకూరతాయి.

చూశారుగా... వేసవిలో ఎండ వేడిమి నుంచి శరీరాన్ని ఎలా రక్షించుకోవాలో..! మరి మీరు కూడా ఈ టిప్స్‌ను పాటించండి. డీహైడ్రేషన్‌ సమస్యల నుంచి ఉపశమనం పొందండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.