ETV Bharat / lifestyle

కలుషిత ఆహారం, కాలం చెల్లిన తిండితో అనారోగ్య సమస్యలు

author img

By

Published : Mar 22, 2021, 12:37 PM IST

మనిషి జీవించాలంటే ఆహారం, నీళ్లు అతి ముఖ్యం. తినేది కూడా కల్తీ లేని.. శుభ్రమైన ఆహారం అయ్యుండాలి. ఇంట్లో వండుకోవడం కంటే బయట దొరికేది తినడానికే జనం ఇష్టపడుతున్న ప్రస్తుత రోజుల్లో.. అనారోగ్యం బారిన పడేవారి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. ఆహార పదార్థాల విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ప్రమాదం తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

expiry-dated-food-pollution-problems-in-guntur-district
కలుషిత ఆహారం, కాలం చెల్లిన తిండితో అనారోగ్య సమస్యలు

కలుషిత ఆహారం ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. కాలం చెల్లిన తినుబండారాలు, స్వీట్లు, బేకరీ పదార్థాలు తిని.. చాలామంది అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. పాడైన ఆహార పదార్థాలు తినడం వల్ల.. విరేచనాలు, వాంతులు, గ్యాస్ట్రిక్ సమస్యలు, ఉదర సంబంధ వ్యాధుల బారిన పడుతున్నారు. కరోనా నేపథ్యంలో ప్రజలు కొంతకాలం ఇంటి ఆహారానికే ప్రాధాన్యం ఇవ్వడం వల్ల.. ప్యాకేజ్డ్‌ తినుబండారాలు, బేకరీ పదార్థాల విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. ఆ తర్వాత మళ్లీ యథా మామూలే. బేకరీలు, హోటళ్ల తిండి కోసం జనం క్యూ కడుతున్నారు. బయటి పదార్థాలు కొనే ముందు ఎక్కువమంది కాలం చెల్లిన తేదీ వివరాలు చూసుకోకపోవడం.. ఎక్కువ నష్టం కలిగిస్తోంది.

సరైన వివరాలు లేక..

బేకరీల్లో తయారుచేసే పదార్థాలు ఎన్ని రోజులు నిల్వ ఉంటాయో చెప్పలేని పరిస్థితి. ప్యాకేజ్డ్‌ వస్తువులు ఎప్పుడు తయారు చేశారు, కాలం ఎప్పడు తీరుతుందనే వివరాలు కూడా చాలావరకు ఉండటం లేదు. ఇలాంటివి కూడా సమస్యలకు కారణమవుతున్నాయి. ప్యాకేజీ యాక్ట్‌ ప్రకారం.. విక్రయించే ఆహార పదార్థాలన్నింటిపై తగిన వివరాలు ఉండాల్సిందేనని అధికారులు స్పష్టంచేస్తున్నారు. నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. బయట కొనే పదార్థాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, లేదంటే అనారోగ్య సమస్యల బారిన పడతారని ఆహార నిపుణులు సూచిస్తున్నారు.

ఇదీ చదవండి: కర్జూర కల్లుకు చిరునామాగా తర్నికల్‌ గ్రామం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.