వాల్‌నట్:
యాపిల్‌ను చిన్నముక్కలుగా కోసుకుని దీంట్లో రెండు, మూడు వాల్‌నట్లు, అరటిపండు, బాదం పాలు కలిపితే వాల్‌నట్ జ్యూస్ సిద్ధమవుతుంది.
బాదం:
బాదంపాలల్లో పావుస్పూన్ చియాగింజలు, కొద్దిగా బెల్లం తురుము వేసి జ్యూస్ చేసుకోవాలి.
పాలకూర:
కట్ట పాలకూరను తీసుకుని సన్నగా తరగాలి. దీంట్లో అయిదారు బాదం పలుకులు, పావుస్పూను అవిసె గింజలు, పావుస్పూన్ చియా గింజలు వేసి, గ్లాసు పాలు పోసి జ్యూస్ చేయాలి.
స్ట్రాబెర్రీ:
రెండు స్ట్రాబెర్రీలను తీసుకుని చిన్న ముక్కలుగా కోసుకోవాలి. దీంట్లో పది జీడిపప్పు పలుకులు, పాలు పోసి జ్యూస్ చేసుకోవాలి.