ETV Bharat / lifestyle

ఈ టిప్స్‌తో వారానికి అరకిలో చొప్పున తగ్గుతున్నా!

మనసు పెట్టి ఉత్సాహంగా ముందుకు సాగాలే గానీ.. ఏ పనైనా సులభంగా పూర్తి చేయగలం. ఫిట్‌నెస్‌ సాధించడం కూడా అంతే! ఈ విషయం చెబుతోంది మరెవరో కాదు.. బాలీవుడ్‌ అందాల తార సమీరా రెడ్డి. కెరీర్‌ ఆరంభంలో నటిగా తనను తాను నిరూపించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం అమ్మతనానికి, కుటుంబ బాధ్యతలకే అధిక ప్రాధాన్యమిస్తోంది. అలాగని అందరి నుంచి దూరం కాకుండా.. సోషల్‌ మీడియా ద్వారా మనందరికీ చేరువలోనే ఉంటోందీ అందాల అమ్మ. ఈ క్రమంలో ఇద్దరు పిల్లల తల్లిగా తాను ఆస్వాదిస్తోన్న అమ్మతనంలోని అనుభూతులు, పేరెంటింగ్‌ పాఠాలు, ఫిట్‌నెస్‌ మెలకువలు, బాడీ పాజిటివిటీ.. తదితర అంశాల్లో తన మనసులోని మాటల్ని నిర్మొహమాటంగా పంచుకుంటుంటుందీ బ్యూటిఫుల్‌ మామ్‌. బరువు తగ్గడమనేది చిటికెలో పూర్తయ్యే పని కాదని, అందుకు చాలా రోజులు పడుతుందని చెబుతూనే.. ఫిట్‌నెస్‌ కోసం తాను పాటిస్తోన్న కొన్ని నియమాలను సోషల్​మీడియా ద్వారా మన ముందుంచిందీ చక్కనమ్మ.

author img

By

Published : Mar 18, 2021, 2:50 PM IST

heroine-saameera-reddy-shares-her-weekly-fitness-plan-through-an-instagram
ఈ టిప్స్‌తో వారానికి అరకిలో చొప్పున తగ్గుతున్నా!

ఫిట్‌నెస్‌ విషయంలో ఎవరేమన్నా తన దారి తనదే అంటుంటుంది సమీర. బరువు పెరగడం, తగ్గడమనేది ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి ఒక్కోలా ఉంటుందని, అంతమాత్రానికి ఇతరుల్ని విమర్శించాల్సిన అవసరం లేదని చెబుతుంటుంది. ఈ క్రమంలో తన కాలేజీ రోజుల్లో, గర్భిణిగా ఉన్నప్పుడు, ప్రసవం తర్వాత.. ఇలా పలు సందర్భాల్లో అధిక బరువు గురించి తానెదుర్కొన్న విమర్శలు, అనుభవాలను పంచుకుంటూనే.. తనదైన శైలిలో విమర్శల్ని తిప్పి కొడుతుంటుందీ అందాల అమ్మ. ఇలా తన జీవితంలోని ప్రతి కోణాన్నీ సానుకూల దృక్పథంతో చూసే సమీర.. అప్పుడప్పుడూ తన వెయిట్‌లాస్‌ సీక్రెట్స్‌ని సైతం పంచుకుంటుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తాను పాటిస్తోన్న వీక్లీ ఫిట్‌నెస్‌ టిప్స్‌ని ఇటీవలే ఇన్‌స్టా పోస్ట్‌ రూపంలో రాసుకొచ్చింది.

ఆ రెండూ ముఖ్యం!

ఏ పనైనా క్రమశిక్షణతో కష్టపడి చేస్తే తప్పకుండా అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాం. తాను కూడా బరువు తగ్గే విషయంలో ఈ రెండింటికీ కట్టుబడి ముందుకు సాగుతున్నానంటోంది సమీర. ‘బరువు తగ్గాలని అనుకోవడం కాదు.. అందుకోసం మనం వేసుకున్న ప్రణాళికకు కట్టుబడి ఉండాలి. ఈ క్రమంలో క్రమశిక్షణ, కష్టపడే తత్వం అలవర్చుకోవడం చాలా ముఖ్యం. ఇవే బరువు తగ్గే విషయంలో మనల్ని ఆరోగ్యకరమైన జీవనశైలి వైపు అడుగులేయిస్తాయి. అలాగని త్వరగా తగ్గాలని కాకుండా దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకోవాలి.. అప్పుడే మనం అనుకున్న ఫిట్‌నెస్‌ను సాధించగలం.. ప్రస్తుతం నేను చేస్తోంది కూడా అదే! ప్రస్తుతం నా బరువు 90.6 కిలోలు. గత వారం 91 కిలోలున్న నేను వారం రోజుల్లో సుమారు అరకిలో దాకా తగ్గాను. ఇలా వారానికి అరకిలో చొప్పున తగ్గాలని నిర్ణయించుకున్నా. ఈ క్రమంలో కాస్త చిరాగ్గా, అలసటగా అనిపించినా నేను నా ప్రణాళికకు కట్టుబడే ముందుకు సాగుతున్నా.. మీరు కూడా అలాగే చేయండి.. తప్పకుండా ఫలితం కనిపిస్తుంది.

వారమంతా ఇలా!

ఉదయం నిద్ర లేవగానే కాస్త అలసటగా అనిపించినా 45 నిమిషాలు యోగా చేయడం మాత్రం అస్సలు ఆపను. అలాగే ఆహారం విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటున్నా. ఈ క్రమంలో ఉదయం 11 నుంచి రాత్రి 7 గంటల వరకు మూడు సార్లు (11am, 2pm, 6pm) మాత్రమే ఆహారం తీసుకుంటా. అది కూడా ఎక్కువగా నీళ్లు, హెర్బల్‌ టీ/బ్లాక్‌ కాఫీ.. వంటి ద్రవాహారానికే ప్రాధాన్యమిస్తున్నా. నా డైట్‌లో పాలు, చక్కెరకు చోటివ్వట్లేదు. మొన్నటిదాకా అర్ధరాత్రి అపరాత్రి లేకుండా స్వీట్స్‌, ఇంకా నచ్చిన పదార్థాలు తినాలనిపించేది. కానీ ఇప్పుడు ఆ సమస్య తగ్గింది. అలాగే వారమంతా సంపూర్ణ పోషకాహారం తీసుకోవడంతో పాటు వారానికి మూడుసార్లు యోగా, రోజూ బ్యాడ్మింటన్‌, నాలుగుసార్లు సైక్లింగ్‌.. వంటివి చేస్తున్నా. కానీ ఏది చేసినా మనసు పెట్టి, యాక్టివ్‌గా చేయడం వల్లే మంచి ఫలితం కనిపిస్తోంది..’ అని తన వీక్లీ ఫిట్‌నెస్‌ ప్లాన్‌ని పంచుకుంటూనే.. ‘మరి, మీ వెయిట్‌లాస్‌ టిప్స్‌ ఏంటి?’ అంటూ ఫ్యాన్స్‌ని అడుగుతోందీ చక్కనమ్మ.

ఇదీ చూడండి: జాతి వివక్ష కాదు.. లైంగిక వ్యసనం వల్లే కాల్పులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.