ETV Bharat / lifestyle

భజే రుద్రరూపం.. భజే బ్రహ్మతేజం! - hanuman jayanthi on june 4th

హనుమ అంటేనే ఓ శక్తి. ఆ పేరే కొండంత ధైర్యం.గంభీరమైన ఉగ్రతేజం.. అంతేస్థాయిలో మధుర వాక్కు, చిత్త సంస్కారంఅనుపమాన దేహదారుఢ్యం... అంతేలా సమున్నత బుద్ధిబలంఅపార శాస్త్ర పాండిత్యం.. అంతే తీక్షణ బ్రహ్మచర్య తేజంగొప్పదైన ప్రతాపరౌద్రం.. అంతే స్థాయిలో పరమ శాంతచిత్తం...వాక్యకోవిదుడు, రాజనీతిజ్ఞుడు, వినయమూర్తి, రామభక్తాగ్రేసరుడు...అనేక శక్తుల మేలుకలయికగా హనుమ దర్శనమిస్తాడు.

hanuman, hanuman jayanthi, lord hanuman
హనుమాన్, హనుమాన్ జయంతి, హనుమాన్ జయంతి స్టోరీ
author img

By

Published : Jun 4, 2021, 6:10 AM IST

దుష్టానాం శిక్షణార్థాయ శిష్టానాం రక్షణాయ చ।
రామకార్యార్థ సిద్ధ్యర్థం జాతః శ్రీహనుమాన్‌ శివః।।

దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకు సాక్షాత్తూ పరమశివుడే రామకార్యాన్ని సాధించాలనే సంకల్పంతో హనుమంతుడిగా అవతరించాడని పరాశర సంహిత చెబుతోంది. వైశాఖమాసం, కృష్ణపక్ష దశమి, శనివారం, పూర్వాభాద్ర నక్షత్రం, కుంభరాశి, మధ్యాహ్నవేళలో ఆంజనేయుడు జన్మించినట్లు పరాశర సంహితలో ఉంది. శివుడి అష్టమూర్తుల్లో ఒకడైన వాయుదేవుని అనుగ్రహం ద్వారా కేసరి అనే వానర వీరుని భార్య అంజనాదేవికి రుద్రతేజంతో హనుమ జన్మించాడు.

విద్యాహనుమ

అపరిమిత భుజశక్తికి తోడు హనుమంతుడు గొప్ప విద్యావేత్త కూడా. కర్మసాక్షి, ప్రత్యక్ష దైవం అయిన సూర్యభగవానుడి దగ్గర అన్ని విద్యలు నేర్చుకున్నాడు హనుమ. ఉపనయనం పూర్తయ్యాక ఓ రోజు హనుమ సూర్యుడి దగ్గరికి వెళ్లి తనను శిష్యుడిగా స్వీకరించాలని అభ్యర్థిస్తాడు. క్షణం కూడా స్థిరంగా ఉండని నేను నీకెలా విద్య నేర్పించగలను అంటాడు సూర్యుడు. తన శరీరాన్ని అమాంతంగా పెంచి, తూర్పు పశ్చిమ పర్వతాల మీద చెరొక కాలు పెట్టి, సూర్య గమనానికి అభిముఖంగా తన ముఖాన్ని తిప్పుతూ సూర్యుడిని విద్య నేర్పించాలని ప్రార్థిస్తాడు హనుమ. ఆయన శక్తిసామర్థ్యాలు, పట్టుదలకు సూర్యుడు ముచ్చటపడి శిష్యుడిగా స్వీకరిస్తాడు. వేదాలు, వేదాంగాలు, వ్యాకరణంతో సహా అన్ని శాస్త్రాలు నేర్చుకుని గొప్ప పండితుడవుతాడు హనుమ. అంతటి పండితుడు కాబట్టే హనుమ మంత్రిగా ఉంటే ముల్లోకాల్లోనూ సాధించలేనిది ఏదీ ఉండదంటాడు రాముడు. విద్య విషయంలో నేటితరం విద్యార్థులకు హనుమ ఆదర్శంగా నిలుస్తాడు.

సుందర హనుమ

హనుమకు తల్లి పెట్టిన పేరు సుందరుడు. అద్భుత సౌందర్యమూర్తి హనుమంతుడు. సూర్యుడిని మింగాలని ఆకాశానికి ఎగిరిన బాలాంజనేయుడి మీదకి ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని విసురుతాడు. అది దవడల మీద బలంగా తాకటంతో చెక్కుకున్నట్లు అవుతాయి. అలా చెక్కుకుపోయిన దవడలు కలిగిన వాడు కావటంతో సుందరుడు హనుమంతుడిగా ప్రసిద్ధి పొందాడు. మరొక విశేషం ఏమిటంటే... రామాయణంలోని అన్ని సర్గలకు అందులోని కథాంశాన్ని బట్టి పేరు పెట్టాడు వాల్మీకి. కానీ సీతాన్వేషణ జరిగిన సర్గను మాత్రం సుందరకాండ అన్నాడు. నిజానికి, హనుమత్కాండ అని పేరు పెట్టాలని అందరూ అంటారు. హనుమ అసలు పేరు సుందరుడు కదా. అందుకని వాల్మీకి ఈ సర్గకు సుందరకాండ అని పేరు పెట్టాడని ప్రతీతి.

హనుమంతుడి మంత్రాల్లో ‘సుందర హనుమాన్‌ మహామంత్రం’ ఒకటి. వాల్మీకి తన శ్లోకాల్లో అంతర్గతంగా ఈ సుందర మంత్రాన్ని నిక్షిప్తం చేశాడు కాబట్టి సుందరకాండ అయిందని మరొక వివరణ. నిజానికి, భౌతిక సౌందర్యాన్ని మించింది హృదయ సౌందర్యం. మొత్తం రామాయణంలో ఎక్కడా తన గురించి చెప్పుకోలేదు హనుమ. రాముడు విడిచిన బాణాన్ని అంటూ తన ఘనత అంతా రాముడికే కట్టబెట్టాడు. సీతమ్మను రామయ్య చెంత చేర్చటం తప్ప మరోధ్యాస లేదు హనుమకు. అందుకే ఆ హృదయాన్ని మించిన సుందర హృదయం మరొకటి లేదు. కాబట్టే ఈ కాండ సుందరకాండ అయింది.

ప్రభువు పూజలందుకున్న బంటు

హనుమంతుడు రాముడి బంటు. ఇది అందరికీ తెలిసిందే. కానీ రామయ్యే స్వయంగా హనుమంతుడిని పూజించిన వివరణ పరాశర సంహితలో ఉంది. దీని ప్రకారం సూర్యుడిని మింగటానికి ఆకాశానికి ఎగిరిన హనుమంతుడి మీద వజ్రాయుధం ప్రయోగిస్తాడు ఇంద్రుడు. హనుమ ఓ పర్వతం మీద పడి మూర్ఛపోతాడు. బిడ్డకు కలిగిన కష్టం చూసి వాయుదేవుడు కోపంతో అన్నిలోకాల్లో ఉన్న వాయువుని స్తంభింపజేస్తాడు. లోకాలన్నీ అల్లకల్లోలం అవుతాయి. విషయం తెలుసుకున్న బ్రహ్మదేవుడు 33 కోట్ల దేవతల్ని వెంటపెట్టుకుని హనుమంతుడున్న చోటుకి వస్తాడు. అతడిని ఉజ్జీవితుణ్ని చేసి అనేక వరాలిస్తాడు. మిగిలిన దేవతలందరూ తమ శక్తిని హనుమంతుడికిచ్చి, తమ అస్త్ర శస్త్రాలేవీ అతడి మీద పనిచెయ్యవంటూ వరాలిస్తారు. హనుమంతుడి పేరుతో హనుమద్వ్రతం వ్యాప్తిలోకి వస్తుందని, ఈ వ్రతం చేసిన వారి పనులన్నీ హనుమ చేసిపెడతాడని బ్రహ్మదేవుడు ఈ సందర్భంలో చెబుతాడు.ఈ కథంతా రాముడికి హనుమే స్వయంగా చెబుతాడు. సీతాన్వేషణలో ఉన్న రాముడు పంపానదీ తీరంలో హనుమంతుణ్ని వేదిక మీద కూర్చోపెట్టి లక్ష్మణుడితో సహా ఈ వ్రతం చేస్తాడు. వ్రతం ఫలితంగా సీతాన్వేషణ మొదలు సీతారామ పట్టాభిషేకం వరకూ మొత్తం కార్యాన్ని తన భుజాల మీద వేసుకుని నడిపిస్తాడు హనుమ. ఇలా ప్రభువు చేత పూజలందుకున్న ఏకైక బంటు మారుతి మాత్రమే.

వేద హనుమ
హనుమ అనే పదానికి ఉపనిషత్తులు చెబుతున్న అర్థం ‘వేదం’. రాముడు శ్రీమహావిష్ణువు అవతారం. అలాంటి వేద స్వరూపుడైన విష్ణువు రామావతారంలో సీతను అన్వేషిస్తూ కొండలు, కోనలు తిరుగుతాడు. ఓ సందర్భంలో హనుమ భుజాల్ని అధిరోహిస్తాడు. వేదం మాత్రమే వేదస్వరూపుడిని భరించగలదు. రామయ్యను భుజాల మీద కూర్చోబెట్టుకున్నాడంటే హనుమ వేదస్వరూపుడని చెప్పకనే చెప్పినట్లయింది.

ఓంకార హనుమ
హనుమాన్‌ అనే శబ్దానికి ‘జ్ఞానవాన్‌’ అనే అర్థం కనిపిస్తుంది. ‘హను’ అంటే ‘జ్ఞానం’ అనే అర్థం ఉంది. ‘హనువు’ అంటే ‘దవడలు’ అనీ వాడుక. శబ్దార్థపరంగా చూస్తే, ‘హనుమ’ అనే పదంలోని అచ్చులు ‘అ, ఉ, మ’ - ఈ మూడూ కలిస్తే ‘ఓం’కారం ఆవిర్భవిస్తుంది. దీని ద్వారా హనుమంతుడు ఓంకార స్వరూపుడనే విషయం స్పష్టంగా తెలుస్తుంది.

ఆత్మ, పరమాత్మల కలయిక

శ్రీరాముడు తన పట్టాభిషేక సమయంలో అందరికీ కానుకలతో కృతజ్ఞతలు తెలియజేస్తూ, హనుమను కూడా ఏంకావాలో కోరుకోమంటాడు. ‘నాకు నీ పట్ల సదా పరమ ప్రేమ ప్రసాదించ’మంటాడు హనుమ. ఆ మాటకు రాముడి హృదయం పరవశించి, సింహాసనం నుంచి దిగి హనుమను బిగియారా కౌగిలించుకుని ఆశీర్వదించాడు. అంతేకాదు, నీవల్ల నా కష్టాలు తొలగాయి. నీకు ఉపకారం చేయాలంటే నాకొచ్చిన కష్టాలు నీకూ రావాలి. నీకు కష్టం కలిగిందన్న ఊహ వచ్చినా నా మనసు బాధపడుతుంది. అలాంటి భావన రాకుండా నీ ఉపకారాలన్నీ నాలో జీర్ణమైపోవుగాక’ అని కోరుకుంటాను అంటాడు. ఇది హనుమపై శ్రీరాముడి భావన మాత్రమే కాదు. తరచి చూస్తే ఆత్మ-పరమాత్మల కలయికకు ప్రతీక.

ఎన్నో రూపాల్లో..

కర్తృత్వ, భోక్తృత్వ జ్ఞాతృత్వాల పట్ల అహంకార మమకారాలు లేనివాడు హనుమ. తాను రామబాణంలా లంకలో ప్రవేశించగలనని చెప్పాడేగానీ, తన శక్తి సామర్థ్యాలను ప్రకటించలేదు. రామరావణ యుద్ధంలో మూర్ఛితుడైన లక్ష్మణుడిని పునరుజ్జీవింపజేయటానికి సంజీవని పర్వతాన్ని తెచ్చినప్పుడు- నన్ను, నా వంశాన్ని నిలిపావంటూ హనుమను చిరంజీవిగా ఆశీర్వదించాడు రాముడు.

హనుమంతుని ప్రజ్ఞాపాటవాలను కిష్కింధకాండ నుంచి చూసి ప్రశంసించకుండా ఉండలేం. మంత్రిగా, సేనా నాయకుడిగా, సలహాదారుగా, విభీషణ శరణాగతి సందర్భంలో దౌత్యవేత్తగా, కార్య కుశలుడిగా... ఎన్నో రూపాల్లో చూస్తాం. అందుకే రామాయణం అనే మణిహారంలో రత్నమై వెలిగొందాడు హనుమ.

మనుస్మృతిలో చెప్పినట్లు ప్రభువు పట్ల అనురాగం, కపటమెరుగని స్థితి, సమరత, జ్ఞానం, దేశకాలతత్త్వం తెలిసి ఉండటం, మంచి దేహదారుఢ్యం, భయమన్నది లేకపోవటం, వాక్పటుత్వం.. ఈ లక్షణాలన్నీ హనుమలో పుష్కలంగా ఉన్నాయి. అందుకే శ్రీరాముడి ప్రేమకు పాత్రుడయ్యాడు. అలాంటి హనుమను స్మరిస్తే బుద్ధి, కీర్తి, బలం, ధైర్యం, నిర్భయత్వం, రోగాలు లేకుండా ఉండటం, వాక్పటుత్వం లాంటి మంచి లక్షణాలన్నీ ప్రాప్తిస్తాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.