షార్ట్‌ఫిల్మ్‌లో, సినిమాల్లో అవకాశం కల్పిస్తానంటూ అమాయక మహిళలను వ్యభిచార రొంపిలోకి దించుతున్న ఘరానా మోసగాడిని నెల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. 'మెటీరియల్' పంపిస్తున్నా అనే కోడ్ పెట్టి అమ్మాయిలను సరఫరా చేసే అతను.. నెల్లూరు జిల్లా కోవూరు మండలానికి చెందిన ఓ బాలికను ఉచ్చులో దించటానికి ప్రయత్నించాడు. బాలిక ఇచ్చిన ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు షేక్ జాకీర్ హుస్సేన్‌ను అరెస్ట్ చేశారు. అతను నడుపుతున్న ఆరు వ్యభిచార గృహాలపై దాడులు చేశారు. 8 మంది నిర్వాహకులను, ఐదుగురు విటులను అరెస్ట్ చేశారు. ఏడుగురు బాధితులను రెస్క్యూ హోంకు తరలించారు. కారు, ద్విచక్రవాహనం, కంప్యూటర్‌తో పాటు 14 సెల్ఫోన్లు, రూ.12,300 నగదు స్వాధీనం చేసుకున్నారు.
హుస్సేన్ వలలో భారీ సంఖ్యలో యువతులు, మహిళలు పడి.. మోసపోయినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి మహిళలను తీసుకొచ్చి వ్యభిచారం రొంపిలోకి దించాడని గుర్తించామన్నారు. 12 ఏళ్లుగా ఇలాంటి మోసాలకు పాల్పడుతూ, ఐదేళ్లుగా వ్యభిచారం నిర్వహిస్తున్నాడని నెల్లూరు నగర డీఎస్పీ శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఈ కేసు పూర్తిస్థాయిలో విచారిస్తే ఎక్కువ మంది బాధితులు బయటకు వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు.
ఇదీ చూడండి: టిక్‌టాక్‌తో ప్రేమ... రాష్ట్రం దాటిన యువతులు