ETV Bharat / jagte-raho

బైక్​ను ఢీకొట్టిన ఇసుకట్రాక్టర్​... ఒకరు మృతి - road accident news

విధులు ముగించుకుని భర్తతో కలిసి ఇంటికి వెళ్తున్న దంపతులను ఇసుకట్రాక్టర్​ రూపంలో మృత్యువు ఎదురైంది. ఈ ప్రమాదంలో భార్య అక్కడికక్కడే మృతి చెందగా... భర్త తీవ్రంగా గాయపడ్డారు.

wife died and husband injured in accident

author img

By

Published : Oct 23, 2020, 2:57 PM IST

నిజామాబాద్​లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పట్టణంలోని ప్రగతినగర్​లో జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు. కోటగిరి మండలం ఏతోండ గ్రామానికి చెందిన శ్యామల, భర్త సాయిలుతో కలిసి ఎల్లమ్మ గుట్టలో నివాసం ఉంటూ... ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తోంది.

పని ముగించుకుని తన భర్తతో కలిసి ద్విచక్రవాహనంపై ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో ఇటుక ట్రాక్టర్ వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ఘటనలో శ్యామల అక్కడికక్కడే మృతి చెందగా... భర్త సాయిలు తీవ్ర గాయలపాలయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు.

ఇదీ చూడండి: వరదల ధాటికి వాహనాలు ధ్వంసం.. మరమ్మతులకు భారీగా వ్యయం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.