ETV Bharat / jagte-raho

సామాజిక మధ్యమాల్లో నకిలీ ఖాతాలకు అడ్డుకోవాలి: సజ్జనార్

సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాల బెడద తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని... ఆయా సంస్థల ప్రతినిధులను సైబరాబాద్​ సీపీ సజ్జనార్ కోరారు. ఈ మేరకు కమిషనరేట్​లో సామాజిక మాధ్యమ సంస్థల ప్రతినిధులతో వెబినార్​ నిర్వహించారు.

author img

By

Published : Sep 29, 2020, 6:11 PM IST

webinar in cyberabad commissionrate on social media frauds
సామాజిక మధ్యమాల్లో నకిలీ ఖాతాలకు అడ్డుకోవాలి: సజ్జనార్

ఇటీవల ఫేస్​బుక్, ఇన్​స్టా గ్రామ్​లో నకిలీ ఖాతాల బెడద పెరగడం వల్ల పోలీస్ ఉన్నతాధికారులు వీటిపై దృష్టి సారించారు. సైబర్ నేరగాళ్లు పోలీసు అధికారుల పేరుతో నకిలీ ఖాతాలు సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారు. వీటిని నిరోధించడానికి తీసుకోవాల్సిన చర్యలపై సైబరాబాద్ కమిషనరేట్​లో వెబినార్ నిర్వహించారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్, రాచకొండ సీపీ మహేశ్ భగవత్... సామాజిక మాధ్యమ సంస్థల ప్రతినిధులతో చర్చించారు.

పేస్​బుక్ ఖాతాలో ఫోటో, ఇతర వివరాలను సేకరించి సైబర్ నేరగాళ్లు సులభంగా నకిలీ ఖాతా సృష్టిస్తున్నందున... వీటిని నిరోధించాలని పేస్​బుక్​ ప్రతినిధులను సజ్జనార్ కోరారు. సానుకూలంగా స్పందించిన ఫేస్​బుక్, ఇన్​స్టా గ్రామ్ ప్రతినిధులు సైబర్ నేరగాళ్ల నకిలీ ఖాతాలను అడ్డుకుంటామని భరోసా ఇచ్చారు. సామాజిక మాధ్యమాల వినియోగదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నకిలీ ఖాతాల బెడద నుంచి బయటపడొచ్చని ఫేస్​బుక్ ప్రతినిధులు సూచించారు.

ఇదీ చూడండి: ఈ దొంగలు ఏకంగా జవాన్ల అవతారమెత్తి మోసగిస్తున్నారు : సజ్జనార్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.