నల్గొండ జిల్లా నిడమనూరు మండలం బక్కమంతుల పాడు వద్ద విషాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. ద్విచక్రవాహనంపై మిర్యాలగూడ నుంచి హాలియా వైపునకు వెళ్తున్న యువకులు అదుపు తప్పి రోడ్డు పక్కన పడి... అక్కడికక్కడే మృతి చెందారు.
మృతులు ఒకరు పెద్దవూర మండలం బోనుతలకు చెందిన వట్టే నరేశ్ యాదవ్ కాగా... మరొకరు అనుముల మండలం హాలియాకు చెందిన జవీద్గా పోలీసులు గుర్తించారు. నరేశ్ కోళ్ల ఫారంలో పనిచేస్తూ డిగ్రీ చదువుతున్నాడని... జవీద్ బైక్ మెకానిక్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: ధాన్యం కుప్పలపై రక్తపు మడుగులో రైతు..