ETV Bharat / jagte-raho

అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా.. ఒకరు మృతి

వారంతా దినసరి కూలీలు. పనికి వెళ్తేనే వారికి పూట గడిచేది. కూలీ పనులు ముగించుకుని ఇంటికి బయల్దేరారు. అంతలోనే వారు ప్రయాణిస్తున్న ట్రాక్టర్​ ఊహించని విధంగా ప్రమాదానికి గురైంది. అదుపుతప్పిన వాహనం రోడ్డు పక్కనే ఉన్న పెద్ద గుంతలో పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం మిట్స్​ కళాశాల సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

tractor accident in surypeta dist
ప్రమాదంలో మృతి చెందిన మహిళ
author img

By

Published : Jan 17, 2021, 10:31 PM IST

సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం మిట్స్ కళాశాల సమీపంలో ట్రాక్టర్ బోల్తా పడగా ఒకరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో 17 మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. అందులో ఇద్దరికి రెండు చేతులు విరిగినట్లు తెలుస్తోంది. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్​కు తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని ఖమ్మంలోని మరో ఆస్పత్రికి తరలించినట్లు వైద్యులు తెలిపారు. వీరంతా హుజూర్​నగర్​లోని సీతారాంనగర్​కు చెందినవారిగా గుర్తించారు.

వీరంతా రోజూలాగే నాటు కూలీ పనికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. కోదాడ నుంచి హుజూర్​నగర్ వెళ్లే రహదారి మార్గమధ్యలో అదుపుతప్పిన ట్రాక్టర్ రోడ్డు పక్కనే ఉన్న పెద్ద గుంతలో పడింది. ఘటనా స్థలంలోనే ఈర్ల మంగమ్మ అనే మహిళ మృతి చెందింది. ప్రమాద సమయంలో చీకటి ఉండగా.. ఏం జరిగిందో తెలియలేదని కూలీలు భయాందోళన వ్యక్తం చేశారు. క్షతగాత్రులను చూసేందుకు కుటుంబసభ్యులు, బంధువులు హుజూర్​నగర్​ ఆస్పత్రికి తరలివచ్చారు.

ఇదీ చూడండి : పంతంగిలో భారీగా వాహనాల రద్దీ.. టోల్‌ బూత్‌లు ఓపెన్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.