పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం సాయంపేటలో పిడుగుపాటుకు 30 గొర్రెలు మృతి చెందాయి. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షానికి పిడుగుపడి భూమయ్య అనే రైతుకు చెందిన గొర్రెలు మృత్యువాత పడ్డాయి. మెుత్తం గొర్రెలు చనిపోవడంతో తీవ్రంగా నష్టపోయానని రైతు ఆవేదన చెందుతున్నాడు. ప్రభుత్వం దయచూపి తనను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాడు.
ఇదీ చూడండి: తేనెటీగల దాడి..ఇబ్బంది పడ్డ మెగా ఫ్యామిలీ