ETV Bharat / jagte-raho

పెళ్లి ఖర్చులకు డ్రా చేసిన డబ్బులు చోరీ.. దొంగ అరెస్ట్​ - పెళ్లి ఖర్చులకు డ్రా చేసిన డబ్బులు చోరీ

మనవరాలి పెళ్లి ఖర్చుల కోసం ఓ వృద్ధురాలు డబ్బులను డ్రా చేసి తీసుకెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తి.. దానిని లాక్కొని పారిపోయాడు. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సీసీ ఫుటేజీ ద్వారా నిందితుడిని పట్టుకుని అరెస్ట్​ చేశారు.

monet thief arrested at siafabad in hyderabad
పెళ్లి ఖర్చులకు డ్రా చేసిన డబ్బులు చోరీ.. అరెస్ట్​ చేసిన పోలీసులు
author img

By

Published : Oct 29, 2020, 11:00 PM IST

హైదరాబాద్​ లోయర్​ట్యాంక్​బండ్​ డీబీఆర్​ మిల్స్​ కాలనీకి చెందిన విజయలక్ష్మి తెలుగు తల్లి కూడలిలోని ఓ బ్యాంక్​ ఖాతా నుంచి రూ. 50 వేలు డ్రా చేసుకుని ఇంటికెళ్లేందుకు ఆటో ఎక్కారు. ఈ క్రమంలో గుర్తుతెలియని వ్యక్తి దానిని లాక్కొని పారిపోయాడు. విజయలక్ష్మి సైఫాబాద్​ పోలీసులను ఆశ్రయించారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. నిందితుడు ఆదర్శనగర్​ వైపు వెళ్లినట్లు గుర్తించి ఆచూకీ కోసం ప్రయత్నించారు. చోరీ చేసిన వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకుని నగదు సంచిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం తల్లూరుకు చెందిన శ్రీరాంగా గుర్తించారు.

ఇదీ చూడండి: 'ధరణి'లో స్లాట్​ బుకింగ్ ఎలా చేయాలో... తెలుసుకుందాం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.